Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

విమర్శ
18 February 2022

విమర్శ

జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును . గద్దింపును వినువాడు వివేకి అగును ( సామెతలు 15 : 31,32 ) .

ఎదుటివారు మనలను విమర్శించినప్పుడు మన స్పందన ఎట్లు ఉన్నది ? విమర్శను శ్రద్ధగా తీసుకొనువారికి విజయము ప్రాప్తించును . గద్దింపును నిర్లక్ష్య పెట్టువారికి అపజయము లభించును . నార్వే దేశమునకు చెందిన ఓలేబుల్ ( Ole Bull ) 1810 ఫిబ్రవరి 5 వ తేదీన జన్మించారు . తన 17 వ ఏట వయోలిన్ నేర్చుకొని ప్రదర్శనలు ఇచ్చుటకు ఇటలీ వెళ్లాడు . మొదటి కచేరి అనంతరము ఒక వార్త పత్రికలో  ఓలేబుల్ నేర్చుకోవలసినది చాలా ఉన్నది . అతడు రత్నం వంటివాడు . కాని ఇంకా మెరుగు పెట్టితేనే కాని రాణించడు  అని అతని గురించి వ్రాసారు . ఆ విమర్శ చదివి ఓలేబుల్ కోపం తెచ్చుకొనవచ్చును లేదా గద్దింపును లక్ష్యపెట్టవచ్చును . అదృష్టవశాత్తు ఓలేబుల్ రెండవ దానిని ఎన్ను కొన్నాడు . అతడు వార్తా పత్రిక ఆఫీసుకు వెళ్ళి తనను విమర్శించినది ఎవరో తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లాడు . విమర్శించినది 70 సంవత్సరముల వయస్సు గల ఒక వృద్ధుడు . ఒక రోజు అంతా ఓలేబుల్ అతని వద్ద కూర్చొని తన లోపములు ఏమిటో అడిగి తెలుసుకొన్నాడు . వాటిని ఎలా సవరించు కోవాలో తెలుసుకొన్నాడు . అతడు ప్రదర్శనలు ఇచ్చుటకు ఇటలీలో పర్యటించుట మానివేసి ఇంటికి వచ్చి ఆరు నెలల పాటు సమర్ధులైన గురువుల వద్ద జాగ్రత్తగా నేర్చుకొని గంటల తరబడి ప్రాక్టీసు చేసి తిరిగి ప్రదర్శనలు ఇచ్చుటకు ఐరోపా ఖండమంతా తిరిగాడు . 26 సంవత్సరములు వచ్చే సరికి అతడు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు .

మనము గద్దింపును లక్ష్యపెట్టుచున్నామా ? పాస్టరు గారు మన దుస్తుల గురించి , ప్రవర్తన గురించి గద్దించినప్పుడు లక్ష్యపెట్టుచున్నామా ? లేదా కోపగించుకొని వేరే చర్చికి వెళ్లుచున్నామా ? ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు . గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును ( సామెతలు 10:17 ) . -

డా॥పి.బి. మనోహర్ 

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech