mahimasabdam.tv@gmail.com
+91 9390209376

ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ( ఎఫెస్సీ 4:32 ) . మన మనస్సులో కక్ష , కోపము ఉంచుకొనరాదు . నిజ క్రైస్తవులు వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉండవలెను . అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా పని చేసిన హ్యుబర్ట్ హంఫ్రీ ( Welli Hubert Humphrey ) 1978 జనవరి 13 న మరణించారు . ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది నాయకులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు . అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు . కానీ మాజీ అధ్యక్షుడు అయిన రిచర్డ్ నిక్సన్ ( Richard Nixon ) వాటర్ గేట్ కుంభకోణంలో ఇరుక్కున్నందు వలన ఆయనకు ఎవ్వరూ స్వాగతం పలుకలేదు . నిక్సన్ ఒక మూల నిశ్శబ్దంగా నిలువబడి ఉన్నాడు . ఆ సమయంలో అమెరికా అధ్యక్షులుగా ఉన్న జిమ్మీ కార్టర్ ఆ హాలులోనికి ప్రవేశించారు . కార్టర్ గారు డెమోక్రటీ పార్టీకి చెందినవారు . రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్సన్ ఒంటరిగా నిలువబడి ఉండుట కార్టర్ చూసారు . కార్టర్ వెంటనే నిక్సన్ వద్దకు కరచాలనం చేస్తూ బాగున్నారా ? అని పలకరించాడు . జిమ్మీ కార్టర్ నిజమైన క్రైస్తవుడు . క్రీస్తు ప్రేమను , క్షమా గుణమును ఆయన కలిగి ఉన్నారు . - డా || పి.బి.మనోహర్ , 98483 63638
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)









.jpg)
 dad.png)









.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech