mahimasabdam.tv@gmail.com
+91 9390209376

కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించు కొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించి యున్నాము. - 2 కొరింథీయులు 4 : 2
పాస్టర్ లాట్టిమర్ గారు (Hugh Lattimer) ప్రసంగించే చర్చికి ఇంగ్లాండు రాజు వచ్చేవాడు. లాట్టిమర్ గారు పాపమును ఖండించుచు ధైర్యముగా చేసిన ప్రసంగము రాజుకు నచ్చలేదు. రాజు సోమవారం నాడు పాస్టర్ గారికి ఇలా ఉత్తరం వ్రాసి పంపాడు.
పాస్టర్ లాటిమర్ గారికి, నీవు ఎవరి ముందు ప్రసంగిస్తున్నావో తెలుసా? సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యనేత బాధపడేలా ప్రసంగిస్తావా? జాగ్రత్త. క్షణాల్లో నీ ప్రాణం తీయగలను. ప్రసంగ వేదిక మీదే నీ ప్రాణం తీయగలను. ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రసంగించు. నాకు అప్రియమైనది పలికావో ఇదే నీకు ఆఖరి ఆదివారం. నిన్న ఆదివారం పాపాన్ని ఖండిస్తూ చేసిన ప్రసంగమునకు క్షమాపణ చెప్పి వచ్చే ఆదివారం నాడు జాగ్రత్తగా ప్రసంగం చేయి.
లాట్టిమర్ గారు ఈ ఉత్తరమును జాగ్రత్తగా చదువుకొని తన అసిస్టెంట్ పాస్టర్ గారికి ఇచ్చారు. 'అయ్యా ప్రసంగం మారుస్తారా?' అని ఆయన అడిగాడు. లాట్టిమర్ గారు 'నేను ఎవరి వర్తమానమును ప్రకటిస్తున్నానో ఆయన రాజు కంటే చాల గొప్పవాడు. సర్వ శక్తి సంపన్నుడు. ఆయన చెప్పిన మాట వినకపోతే నన్ను శాశ్వతంగా నరకంలో పడ వేస్తాడు. ఆయనే ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి అని చెప్పారు. (మత్తయి 10 : 28) కనుక నేను భయపడే ప్రశ్నే లేదు' అన్నారు.
లాట్టిమర్ గారికి గీర, పొగరు, తిక్క అని కొందరు అనుకొనవచ్చును. కాని తరువాత ఆదివారం ఆయన మరింత ఆత్మశక్తితో, బలముతో ప్రసంగిస్తే రాజు కూడ భయపడ్డాడు. తన తీరు మార్చుకొన్నాడు. మన దృష్టి దేవునిని ఘనపరచుట యందే, మహిమ పర్చుట యందే, ప్రీతి పర్చుట యందే ఉండవలెను. మనము ఎవరిని ప్రీతి పర్చుచున్నాము. దేవునినా? మనుష్యులనా? - డా||పి.బి.మనోహర్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)






 dad.png)



.jpg)








.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech