mahimasabdam.tv@gmail.com
+91 9390209376

నీవు నాకు ఆశ్రయముగానుంటివి. శత్రువుల యెదుల బలమైన కోటగానుంటివి. నీ రెక్కల చాటున దాగుకొందును. కీర్తనలు 61 : 3
'నేను ఈ విషయం చాల తక్కువ మందికి చెప్పాను. చాల మంది నమ్మరని నాకు తెలుసు' అని అన్నా గ్రేస్ లీషీడ్ Anna Grace Lescheidఅన్నది. ఆమె వయస్సు 87 సంవత్సరాలు. ఆమె మనుమలు, మనుమరాండ్రు, మునిమనుమలు ఆమె చుట్టూ కూర్చున్నారు. ఆమె ఏమి చెబుతుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆమె గొంతు సవరించుకొని 'అది1944 వ సంవత్సరం డిసెంబరు నెల. కాని ఈ సంఘటన నిన్న జరిగినంత స్పష్టంగా నాకు గుర్తు ఉన్నది. నేను ఉక్రెయిన్ నుండి పారిపోయి వచ్చాను.Czechoslovakiaచెగొస్లేవికియాలో ఆల్ఫ్స్ పర్వతములకు దగ్గరగా రాట్ కెర్స్ బర్గ్Ratkersburgఅనే గ్రామంకు వచ్చాను. ఉక్రెయిన్‌లోఉన్నప్పుడు డ్నీపర్Dnieperనదికి పశ్చిమంగా ఉన్న నీడర్‌చోర్టిట్జా అనే ఊరిలో ఉండే దానిని. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. బాంబులు మా ఇళ్లపైనా, వీధుల్లోనూ పడుతున్నాయి. ఎప్పుడు బాంబు మా ఇంటిపై పడుతుందో అని భయంతో వణకి చచ్చేవాళ్లం.
చివరికి ఒక రైలు కాందిశీకులతో పోలెండు మీదుగా చెగొస్లేవికియా వెళ్లుచున్నదని తెలిసి మా ఊరివారందరూ ఇళ్లు వదలి ముఖ్యమైన వస్తువులు తీసుకొని ఆ రైలు ఎక్కాము. లైట్లు లేకుండా కిక్కిరిసిన జనంతో, రాత్రి వేళల్లో ఆ రైలు ప్రయాణించేది. సరియైన నీరు, ఆహారం లేదు. అప్పుడప్పుడు రష్యన్లు మాపై తుపాకులు పేల్చేవారు. రైలు ప్రక్కన బాంబులు పడినప్పుడు ఆ ధాటికి ఆ బోగీ అటూ ఇటూ ఊగేది. ఆ బాంబు ధ్వనులతో మా చెవులు గళ్లు పడ్డాయి. అప్పటికి చెగొస్లేవికియాను జర్మన్లు ఆక్రమించుకొని యున్నారు. తమను ఆక్రమించుకొన్న జర్మన్లు అంటే చెగొస్లేవికియా ప్రజలకు కోపం. జర్మన్లు తీసుకొని వచ్చారని మాపై కోపం. అందుచేత జర్మనీ వెళ్దామని నేను నిర్ణయించుకున్నాను.
నా చెల్లెలు టీనా జర్మనీలో ఉన్నది. యుద్ధం ప్రారంభమగుటకు ముందే జర్మనీ వచ్చేయమన్నది. నేను జర్మనీ వెళ్లుటకు వీసా కొరకు దరఖాస్తు చేసాను. టీనాకు నేను వస్తున్నానని టెలిగ్రాము ఇచ్చాను. నాతో పాటు నాకు తెలిసిన కేరిలీన్ అనే ఆమె కూడ జర్మనీ బయలుదేరింది. రైలు బయలుదేరింది. అప్పట్లో రైలు వేగం చాల తక్కువ. గంటకు 15 మైళ్ల వేగం కంటే తక్కువ ఉండేది. రైలు బయలు దేరిన గంటసేపటికి వడగండ్ల వాన కురియుట ప్రారంభించింది. చీకటి పడేసరికి జర్మనీలో ప్రవేశించాము.
కేరిలీన్ దిగవలసిన స్టేషన్ వస్తున్నది. ఆమె నాతో 'అన్నా నీవు కూడ ఇక్కడ దిగిపో. ఈ రాత్రి వేళ, వర్షం కురుస్తున్న వేళ నీవు ఒక్క దానివే వెళ్లలేవు' అన్నది. నిజమే. స్టేషను నుండి పదిమైళ్లు వెళ్లితే గాని మా చెల్లెలు ఇల్లు చేరలేను. కాని నేను ఈ రాత్రికి రాకపోతే ఆమె చాల కంగారు పడుతుంది. 'నేను రాకపోతే టీనా చాల కంగారు పడుతుంది. నాకు ఏదైనా బండి దొరక వచ్చు. లేదా కూలి ఇచ్చి ఎవరినైనా తోడు తీసుకొని వెళ్తాను' అన్నాను. కేరిలీన్ దిగిపోయింది. స్టేషన్‌కు ఆమె కొడుకు వచ్చాడు. టీనా నా కోసం ఎవరినైనా పంపవచ్చును అని నా హృదయంలో చిన్న ఆశ. రైలు కదిలింది. కేరిలీన్‌తో దిగి పోవలసింది అని అన్పించింది. మరల ఒంటరితనం.
రాత్రి 8 గంటలకు నేను దిగవలసిన స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్‌లో ఎవరూ దిగలేదు. నేను దిగిన రెండు నిముషాలలో రైలు బయలుదేరి వెళ్లి పోయింది. అంతా నిశ్శబ్దం. భయంకరమైన నిశ్శబ్దం. స్టేషన్‌లో లైట్లు లేవు. రైలు వెళ్లిపోగానే అంతా చీకటి అయిపోయింది. అక్కడ ఉన్న ఒక చెక్క బెంచీపై కూల బడ్డాను. ఈ చీకటిలో చలిలో పదిమైళ్లు నడవాలి.
నన్ను తీసుకొని వెళ్లుటకు ఎవరూ రాలేదు. స్టేషన్ బయట బండ్లు ఏమీ లేవు. అసలు నర సంచారమే లేదు. నేను లేచి స్టేషన్ మాస్టారు గదికి వెళ్లాను. ఆయన వెళ్లిపోవుటకు అన్నీ సర్దు కొంటున్నాడు. 'అయ్యా నేను ఇక్కడ ఉండవచ్చునా?' అని భయంగా అడిగాను. 'క్షమించండి మేడమ్. ఇక్కడ ఉండుటకు వీలులేదు. నేను తాళం వేసి వెళ్లాలి' అన్నాడు. నేను భయంతో వణికాను. భయంకరమైన చీకటి. నావద్ద టార్చిలైటు లేదు. ఆ చీకటిలో నా త్రోవ వెదుక్కుంటూ ద్రాక్షతోటలు, అడవి, స్మశానం దాటి వెళ్లాలి. పైగా ఒక వాగు దాటాలి. అక్కడక్కడ ఇళ్లు ఉన్నా రాత్రి వేళ ఎవరూ తలుపు తీయరు. నా చేతిలోని సూట్‌కేస్‌తో నేను బయటకు వచ్చాను.
స్టేషన్ మాస్టారు తన గదికి తాళం వేసి చకచకా నడుస్తూ వెళ్లిపోయాడు. ఆయన బూట్లు చేసే శబ్దం క్రమేపీ దూరమైనది. నాకు సహాయం చేయగలిగే ఒక్క వ్యక్తి కూడ దూరంగా వెళ్లిపోయాడు. నేను ఆకాశం వైపు తల ఎత్తాను. నాకు ఎప్పుడూ సహాయం చేస్తానని మాట ఇచ్చిన వ్యక్తితో మాట్లాడాను. నన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అన్నాడాయన. 'తండ్రీ' అని పిలిచాను. భయంతో నా గొంతు పెగల లేదు. 'నాకు చాల భయంగా ఉంది. నాలోని భయం తొలగించు. నాకు తోడుగా రా ప్రభువా' అని ప్రార్థించాను.
అకస్మాత్తుగా ఒక వెలుగు ఆకాశంలో మెరిసింది. బాంబర్ విమానములు వస్తున్నాయి. స్టేషన్‌పై బాంబులు పడతాయి అనుకొని నేను స్టేషన్‌కు దూరంగా పరుగెత్తాను. కాని ఆ వెలుగు బాంబర్ విమానముల నుంచి వచ్చినది కాదు. నేను ఆశ్చర్యపోతూ ఆ వెలుగు చూపించే దారిలో నడుస్తున్నాను.
దద్దరిల్లే బాంబులు పడతాయని నేను అనుకొంటే ఎంతో నిశ్శబ్దం. నా హృదయంలోని భయం పూర్తిగా మాయమైనది. ఏదో శాంతి నన్ను ఆవరించింది. అనుకోకుండా నా నోటి వెంట పాట వచ్చింది. 'నా చేయి పట్టుకో నా తండ్రీ' ఆ పాట తరువాత మరొక పాట. అప్పుడు నేను వర్షం, గాలి ఆగిపోయినట్లు కనుగొన్నాను.
స్టేషన్‌లో దిగినప్పుడే వర్షం కురుస్తున్నది. అది డిసెంబరు మాసం. నాకు చలి లేదు. పైగా వేసవి కాలంవలె నాకు ఉక్కగా ఉంటే నేను మెడకు కట్టిన రుమాలును తీసాను. చివరికి వాగును సమీపించాను. నేను బూట్లు తీసి చేతితో పట్టుకొని అక్కడక్కడ ఉన్న రాళ్లపై కాళ్లు వేస్తూ వాగు దాటి మా ఇంటిని సమీపించాను. వెనక్కి తిరిగి చూస్తే నేను వచ్చిన దారి సాగదీసిన రిబ్బన్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)







.jpg)
 dad.png)










.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech