mahimasabdam.tv@gmail.com
+91 9390209376

ఆయన రాకడను గూర్చిన వాగ్ధానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్లే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసి కొనవలెను. 2 పేతురు 3 : 4
ప్రజలు ప్రతి విషయమును అంచనా వేసికొందురు. రాజకీయ నాయకులు ఇన్ని ఓట్లు వచ్చునని అంచనా వేసుకొందురు. వ్యాపారస్తులు ఇంత లాభం వచ్చునని అంచనా వేసుకొందురు. పరీక్ష వ్రాయు విద్యార్థులు ఇన్ని మార్కులు వచ్చునని అంచనా వేసుకొందురు. అనేక సమయములలో ఆ అంచనాలు తప్పు అగుట మనము గమనించుచున్నాము.
అట్లే ప్రభువు రాకడను గూర్చి కూడ అనేకులు అంచనా వేయుచున్నారు. ఆయన మరల రాడని కొందరు తలంచుచున్నారు. ఫలాన సమయమున వచ్చునని మరికొందరు తలంచుచున్నారు. వారి అంచనాలు కూడ ఒక దినమున తప్పు అగుట మనము గమనించగలము.
ఇటీవల కాలంలో కంప్యూటర్ గురించి ఇతర టెక్నాలజీ గురించి కొందరి అంచనాలు ఎట్లు తారుమారయినవో గమనించిన ఎంతో ఆశ్చర్యముగాను ఆసక్తికరముగాను ఉండును. 1949లో కంప్యూటర్‌ను 2 టన్నుల బరువుకంటే తక్కువ బరువు కలదిగా చేయుట అసాధ్యము అని పాపులర్ మెకానిక్స్ వారు అంచనా వేసారు. ప్రస్తుతం కంప్యూటర్ బరువు 1.2 కేజీ. ఐ.బీ.ఎం. ఛైర్మన్ థామస్ వాల్సన్ గారు 'ప్రపంచంలో ఐదుగురు స్వంత కంప్యూటర్‌లు కలిగి ఉంటారు' అని అన్నారు. కెన్ వోల్సన్ అనే పారిశ్రామిక వేత్త 'ఇంటిలో కంప్యూటర్ ఉంచుకోవాలన్న చెత్త ఐడియా ఎవరికీ రాదు' అనెను. 1876లో ఎక్కడో ఉన్న మనిషితో మాట్లాడవలసిన అవసరం ఏమొస్తుంది? టెలిఫోన్ ఒక వృధా పరికరము అని అనుకొనేవారు.
రేడియో వలన ఏ విధమైన ఉపయోగము లేదు. మీరు ఒక సందేశం పంపుతున్నారు. అది ఏ వ్యక్తికీ ప్రత్యేకముగా ఉద్దేశించినది కాదు. అటువంటి యంత్రమును ఎవరు కొనుక్కొంటారు? కనుక రేడియో తయారీకి పెట్టుబడి పెట్టుట వృథా అని 1920లో అనేకులు రేడియో తయారీకి పెట్టుబడి పెట్టుట మానివేసిరి. నటుల యొక్క నటన చూస్తాను కాని వారి మాటలు ఎవరు వింటారు? మూకీ చిత్రాలు చాలు అని 1927లో వార్నర్ బ్రదర్స్‌లో ఒకడైన ఎం.వార్నర్ టాకీ చిత్రాలకు పెట్టుబడి పెట్టుటకు నిర్లక్ష్యం చూపాడు.
గాలికంటే బరువైనది గాలిలో ఎలా ఎగురుతుంది? విమానం తయారీ అసాధ్యం అని అనేకులు రైట్ సోదరులను నిరుత్సాహ పరిచారు. 1859లో నూనె కోసం భూమిని త్రవ్వాలా? భూమిలో నూనె ఉంటుందా? అని పెట్రోలియం గనుల కోసం త్రవ్వకాలు సాగించిన ఎడ్విన్ డ్రేక్‌ను అందరూ నిరుత్సాహ పరిచారు. విమానం ఆస్తికరమైన ఆట వస్తువే. కాని దానితో యుద్ధం చేయలేము అని ఫెర్డినాండ్ ఫోర్భ్ అనే స్పెయిన్ దేశ యుద్ధ మంత్రి అన్నాడు.
గాన్ విత్ ది విండ్ Gone with the wind నవలా రచయిత మార్గరేట్ Margaret Mitchell తన పుస్తకమును లూయిస్ మేయర్ అనే హాలీవుడ్ నిర్మాతకు చూపినప్పుడు అతడు ఇది ఏమి బాగోలేదు అని దానిని సినిమాగా తీయుటకు నిరాకరించాడు. తరువాత మరొక నిర్మాత దానిని సినిమాగా తీసి 400 మిలియన్ల ఆదాయం పొందాడు. ఫోర్డుకార్ తయారు చేయుటకు మొదటిగా పెట్టుబడి పెట్టిన వ్యక్తి తన షేర్లు అన్నిటిని 1906లో అమ్మివేశాడు. అతడు కొద్ది కాలం వేచియుంటే అనేక కోట్లు సంపాదించేవాడు.
వాచీలు, ఆభరణములు అమ్మే రోబక్ Roebuck తన వ్యాపారమును Richard Warren Sears రిచార్డు వారెన్ సియర్స్‌కు 25 వేల డాలర్సుకు అమ్మివేశాడు. ఈ రోజు సియర్స్ కంపెనీ 16 సెకండ్లలలో 25వేల డాలర్ల వ్యాపారము చేయుచున్నది.
ఏదైతే కని పెట్టబడ వలసి ఉన్నదో వాటన్నిటినీ శాస్త్రవేత్తలు కనిపెట్టేసారు. ఇంకా కనిపెట్టవలసింది ఏమీ లేదు అని ఛార్లెస్ డ్యూయెట్ 1899లో అన్నారు. ఆయన అమెరికాలో పేటెంట్‌లను రిజిస్టర్ చేసుకొనే ఆఫీసరు.
వీరందరి అంచనాలు ఏ విధముగా తప్పిపోయినవో నేడు మనము చూస్తున్నాము. అలాగే దేవుడు లేడు ఆయన తిరిగి రాడు అని అను వారి ఆలోచనలు కూడ ఒకనాడు తప్పిపోవుట మనం చూడవచ్చును.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)






 dad.png)



.jpg)








.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech