Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

దొంగ
24 October 2014

దొంగ

ప్రేమను వృద్ధి చేయు గోరువాడు తప్పిదములను దాచిపెట్టును. సామెతలు 17 : 9

ఈజిప్టులో ఉన్న ఒక సన్యాసుల మఠమునకు అనాస్టాషియస్‌(Anastasias)అనే సాధువునాయకుడిగా ఉండే వాడు. అతడెంతో మంచివాడు. మహాజ్ఞాని. అతని వద్ద విద్య నేర్చుకొనుటకు అనేక మంది అతని వద్దకు వచ్చేవారు. ఆ మఠంలోని గ్రంథాలయంలో అనేక గ్రంథములు ఉండేవి. అవి ఎన్నో లక్షల రూపాయల విలువైనవి. ఒక సన్యాసి ఒక ప్రాచీన గ్రంథమును చూసి దొంగిలించి తీసుకొని పోయాడు.

అనాస్టాషియస్‌ దొంగ ఎవరో చాల తేలికగా ఊహించాడు. అయినా అతడు దొంగ ఎవరో ఎవరికీ చెప్పలేదు. ఒక వేళ చెబితే నేను దొంగిలించలేదని ఆ సన్యాసి అబద్ధమాడి మరొక పాపం చేస్తాడని అనాస్టాషియస్‌ నిశ్శబ్ధంగా ఊరుకొన్నాడు. ప్రాచీన గ్రంథమును దొంగిలించిన సన్యాసి పేరు అర్టిక్రో. అర్టిక్రో ప్రాచీన గ్రంథములను కొని సేకరించే ఒక వర్తకునిని కలుసుకొని తన వద్ద నున్న పుస్తకమును ఒక బంగారు నాణెముకు అమ్మ చూపాడు.

ఆ వర్తకుడు 'ఒక్క రోజు నీ పుస్తకము నా వద్ద ఉంచు. నేను దాని విలువను తెలుసుకొని నీవు కోరిన బంగారు నాణెం ఇస్తాను' అన్నాడు. అర్టిక్రో సమ్మతించి మరునాడు వస్తానని వెళ్లిపోయాడు. వర్తకుడు వెంటనే ఆ గ్రంథమును తీసుకొని అనాస్టాషియస్‌ వద్దకు వెళ్లాడు. ఆ గ్రంథమును చూడగానే అది తన మఠం నుండి దొంగిలించబడినదని గ్రహించాడు. కాని అతడు ఏమీ మాట్లాడలేదు.

వర్తకుడు 'ఒక సన్యాసి ఈ గ్రంథమును నాకు అమ్మాలని వచ్చాడు. దీని ఖరీదు ఒక బంగారు నాణెం అని చెప్పాడు. దయచేసి ఈ గ్రంథాన్ని పరిశీలించి దీని విలువ ఎంతో చెప్పండి. ఈ గ్రంథమునకు బంగారు నాణెం ఇవ్వవచ్చునా? మీకు పుస్తకముల గురించి ఎంతో జ్ఞానం ఉంది కదా!' అన్నాడు. అనాస్టాషియస్‌ 'ఇది చాల విలువైన గ్రంథము. ఒక బంగారు నాణెముకు మీకు దొరికితే మీరు చాల అదృష్టవంతులు. ఇది కనీసం 20 బంగారు నాణెముల ఖరీదు చేస్తుంది' అన్నాడు.

వర్తకుడు సంతోషంగా వెళ్లిపోయాడు. మరునాడు అర్టిక్రో వర్తకుని వద్దకు రాగా 'నీవు చెప్పిన ధర ఇస్తాను' అన్నాడు. అర్టిక్రో సంతోషంగా 'ఎవరికి చూపించారు?' అని అడిగాడు. వర్తకుడు 'అనాస్టాషియస్‌కు. ఆయనకు పుస్తకముల గురించి బాగా తెలుసు కదా!' అన్నాడు. అర్టిక్రో మోహం పాలిపోయింది.

'ఆయన ఏమన్నారు?' అని అర్టిక్రో బలహీనంగా అడిగాడు.

'ఈ గ్రంథము చాలా విలువైనది అన్నారు' అని అన్నాడు ఆ వర్తకుడు.

'ఇంకా ఏమన్నారు?

'ఇంకేమీ అనలేదు'

అర్టిక్రో ఆశ్చర్యపోయాడు. తాను దొంగనని తెలిసినా అనాస్టాషియస్‌ ఆ విషయం బయటపెట్టలేదు. అతడు పుస్తకమును చేతిలోకి తీసుకొని 'నేను ఈ పుస్తకమును అమ్ముట లేదు' అన్నాడు. వర్తకుడు 'నేను పది బంగారు నాణెములు ఇస్తాను' అన్నాడు. అయినా అర్టిక్రో మాట్లాడకుండా లేచి తిన్నగా మఠమునకు వెళ్ళాడు. పుస్తకమును అనాస్టాషియస్‌ ముందు పెట్టి కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు.

అనాస్టాషియస్‌ 'ఈ పుస్తకం నీదే. నీవు దొంగిలించనప్పుడే అది నీకివ్వాలని నిశ్చయించుకున్నాను' అన్నాడు. అయ్యా! నాకు ఈ పుస్తకం వద్దు కాని, నన్ను మీ శిష్యునిగా ఉంచుకుని జ్ఞానాన్ని ప్రసాదించండి' అని వెక్కిళ్ళ మధ్య అన్నాడు. గురువు అతని తలపై చేయి వేసి నిమిరాడు. అర్టిక్రో ఆ మఠంలోనే ఉంటూ మహాజ్ఞాని అయ్యాడు.- డా||పి.బి.మనోహర

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 12:25 తన జీవితాన్ని ప్రేమించేవాడు దానిని కోల్పోతాడు, మరియు ఈ లోకంలో తన జీవితాన్ని ద్వేషించేవాడు దానిని నిత్యజీవము కొరకు ఉంచుతాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech