mahimasabdam.tv@gmail.com
+91 9390209376

ధర్మ శాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై యున్నది. గలతీ 5:14
జపాన్ లో ఈ సంఘటన యదార్ధముగా జరిగెను. ఒక వ్యక్తి తన ఇంటిని బాగు చేసుకొను చుండెను. ఆ ఇంటిగోడకు పైన ఒక పలుచని చెక్క తాపడము చేసి యుండెను. అతడు ఆ చెక్కను తొలగించినప్పుడు గోడకు ఒక బల్లి అతుకుకొని ఉండుట గమనించెను. బల్లి ప్రాణముతోనే ఉన్నది. కాని కదలలేక పోవుచున్నది. పరిశీలించి చూడగా ఒక చిన్న మేకు దాని కాలిగుండా గుచ్చుకొని గోడకు బిగించబడి యున్నది. అతడు దానిని చూచి జాలిపడెను. తాను ఆ ఇంటిలోనికి వచ్చి అయిదు సంవత్సరములయినది. తాను వచ్చిన తర్వాత ఒక్క మేకును కూడ కొట్టలేదు. అనగా దాదాపు అయిదు సంవత్సరముల క్రితమే ఆ మేకు కొట్టబడినది. మేకు కొట్టబడినప్పుడు బల్లి కాలు దానితో బిగించబడినది.
ఇదే భంగిమలో ఆ బల్లి సుమారు అయిదు సంవత్సరములు బ్రతికినది. ఒక్క అంగుళము కూడ కదలలేని స్థితిలో ఆ బల్లి అయిదు సంవత్సరములెట్లు జీవించినది? అతడు దానిని పరిశోధించుటకు పూనుకొనెను. అది ఆహారము ఎట్లు సంపాదించు కొనుచున్నదో కనుగొనవలెనని ఆశించెను. అతడు దానిని గమనించు చుండగా మరియొక బల్లి అతనికి కన్పించెను. ఆ బల్లి నోటిలో ఆహార మున్నది. అతదు ఆశ్చర్యముతో తలమునకలయ్యెను. గత అయిదు సంవత్సరములుగా ఆ బల్లి మేకు దిగబడుట వలన కదలలేని బల్లికి ఆహారము అందించుచున్నది. ఎంత ప్రేమ! ఎటువంటి త్యాగము? ఇటువంటి సంఘటన బల్లి వంటి చిన్న ప్రాణులలో జరుగునా ?
నిస్వార్ధముగా ప్రేమను చూపి సహాయము చేయుచున్న ఆ బల్లికి ఉన్న మనస్సు మానవులకు ఉండునా ? మనలను కని పెంచి పోషించిన తల్లి దండ్రులకు మనము వారి వృద్ధాప్యమందు సహాయపడుచున్నామా ? ప్రస్తుత సాంకేతికాభివృద్ధి వలన ప్రపంచమంతయూ చిన్న గ్రామము వలె మారుచున్నది. ఎక్కడో జరిగిన విషయము సెకన్లలో మనము తెలుసుకొన గలుగుచున్నాము. సుదూర ప్రాంతములకు గంటలలో చేరగలుగుచున్నాము. కాని అదే నిష్పత్తిలో సాటి మానవుల మధ్య గల దూరమును అధిగమించ గలుగుచున్నామా? మానవుల మధ్య గల అంతరము దినదినము పెరుగుట ఎంత విచారకరము
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)






 dad.png)



.jpg)








.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech