mahimasabdam.tv@gmail.com
+91 9390209376
 dad.png)
మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. ఎఫెసీ 4 : 25.
రవి కాలువ వద్ద రోజంతా గాలం వేసి కూర్చున్నా ఒక్క చేప కూడ పడలేదు. చేపలు పట్టకుండా ఇంటికి వెళితే తన భార్య లత ఎగతాళి చేస్తుందేమోనని భయపడ్డాడు. అందువల్ల దారిలో చేపల దుకాణమునకు వెళ్లి 4 రాగండి చేపలను బేరం చేసాడు. అమ్మేవ్యక్తితో 'ఈ నాలుగు చేపలను నా వైపు విసురు' అన్నాడు.
చేపలను అమ్మేవ్యక్తి 'ఎందుకు విసరమంటున్నారు సార్?' అన్నాడు. అందుకు రవి 'నా భార్య చేపలు పట్టుటకు వెళ్లి ఏమీ పట్టకుండా వచ్చావా? అని నన్ను ఎగతాళి చేస్తుంది. అందువల్ల నీవు చేపలను నా వైపు విసిరితే నేను పట్టుకుంటాను. నా భార్యతో ఇవి నేను పట్టుకున్న చేపలు అని చెప్పుతాను, అది నిజమే కదా? నీవు విసిరితే నేను పట్టుకున్నాను' అన్నాడు.
చేపలను అమ్మేవ్యక్తి 'అలా అయితే మీరు కొరమీనులను తీసుకోండి' అన్నాడు. రవి 'కొరమీనులు ఎందుకు?' అని ఆశ్చర్యంగా అడిగాడు. చేపలను అమ్మేవ్యక్తి 'ఎందుకంటే ఉదయమే అమ్మగారు వచ్చారు. మీరు వస్తారనీ, చేపలను కొంటారనీ చెప్పింది. మీరు వస్తే కొరమీను చేపలనే కొనమని మీతో చెప్పమన్నది. అమ్మగారికి ఆ రాగండి చేపలకంటేఈ కొరమీను చేపలంటే ఎక్కువ ఇష్టమట. అందుచేత వాటిని తీసుకొని వెళ్లండి' అన్నాడు.
డాక్టర్ పి.బి.మనోహర్.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)









.jpg)









.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech