Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ఉత్తుత్తి బహుమతి
14 November 2014

ఉత్తుత్తి బహుమతి

ఇదిగో తర్వాత వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

ప్రకటన 22:13

పారశీకరాజైన XERXUS క్సెరక్సస్ గ్రీసు దేశముపై దండెత్తి దానిని జయించి తిరిగి తన ఓడలో తన దేశానికి తిరిగి వస్తున్నాడు. ఆ ఓడలో అనేకమంది సైనికాదికారులు, సైనికులు ఉన్నారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను చెలరేగింది. నౌక కెప్టెన్ రాజైన క్సెరక్సెన్ వద్దకు వచ్చి ''ఓడను తేలిక చేయకపోతే ఈ తుఫానులో తప్పించుకొనుట అసాధ్యము'' అని చెప్పాడు. రాజు తన సైనికులు వైపు తిరిగి ''నా భద్రత, క్షేమము మీపై ఆధారపడి ఉన్నది. మీలో కొందరు మీ రాజు గురించి తమ ప్రాణమును త్యాగము చేయవలసి ఉంటుంది'' అన్నారు. వెంటనే అనేకమంది సైనికులు సముద్రములోనికి దూకివేశారు. ఓడ తేలికై క్షేమంగా హార్బర్ కు వచ్చింది.
రాజు వెంటనే సభ తీర్చి రాజు ప్రాణమును కాపాడినందుకు ఒక బంగారు కిరీటమును నౌక కెప్టెన్ కు బహుకరించాడు.నౌక కెప్టెన్ బంగారు కిరీటం ధరించి ఎంతో సంతోషముతో గర్విస్తుండగా రాజైన క్సెరక్సస్''రాజభక్తి గల అనేక సైనికుల మరణమునకు కారకుడైన కెప్టెన్ తలను నరకండి'' అని ఆజ్ఞాపించాడు. మరు క్షణములో బంగారు కిరీటమును పెట్టుకున్న అతని తల ఖండించబడింది.
యేసు ప్రభువు వచ్చినపుడు మనలో ప్రతివాడును మనం చేసిన క్రియలను బట్టి ఆయన వద్ద నుండి ప్రతిఫలముగా బహుమానము పొందెదము. కానీ క్సెరక్సస్రాజు వలె బహుమానము ఇచ్చినట్లే ఇచ్చి మరుక్షణమే మరణ శిక్ష విధించడు.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

సామెతలు 21:21 ఎవరైతే ధర్మాన్ని, ప్రేమను అనుసరిస్తారో వారు జీవితం, శ్రేయస్సు మరియు గౌరవాన్ని పొందుతారు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech