mahimasabdam.tv@gmail.com
+91 9390209376

సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.- యోహాను 8 : 32.
1960లో జనవరిలో ఉక్రెయిన్ లోని సిర్‌కునీ అనే కుగ్రామంలో ఒక ఆశ్ఛర్యకరమైన విషయం జరిగినది. రెండవ ప్రపంచ యుద్ధములో జర్మనీ వారితో పోరాడుచూ చనిపోయాడని తలంచిన గ్రీషా అనే సైనికుడు ఆగ్రామంలో ప్రత్యక్షమైనాడు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యపోయిరి.
అసలు జరిగిన విషయం ఏమనగా ఆ రాత్రి అందరూ యుద్ధమునకు వెళ్లుచుండగా గ్రీషా యుద్ధ రంగమునుండి తప్పించుకొని దొంగచాటుగా తన ఇంటికి వెళ్లెను. మిలటరీ నుండి పారిపోయి వచ్చిన సైనికులను మరల బలవంతముగా యుద్ధమునకు తీసుకొని పోవుదురని తలంచెను. అతని తల్లి అతనిని రహస్యముగా దాచి పెట్టెను. తన ఇంటిలో మేకలను కట్టివేయు శాల ప్రక్కనే ఉన్న ఎరువుల కొట్టములో అతడు పద్దెనిమిది సంవత్సరములు దాగుకొనెను. దినమునకు రెండు మారులు అతని తల్లి అతనికి ఆహారము ఇచ్చు చుండెడిది. శీతాకాలంలో అతడు చలికి గజగజా వణికెడివాడు. వేసవి కాలములో ఉక్కపోతకు ఇబ్బంది పడెడివాడు. తనకు తానే నిర్మించుకున్న ఆ జైలులో అతడు 18 సంవత్సరములు గడిపెను.
18 సంవత్సరముల తరువాత ఇక అక్కడ నివసించలేక ఎట్టి శిక్షనైననూ భరించుటకు సిద్ధపడి అతడు బయటకు వచ్చెను. కాని అతని భయము అనవసరమైనది. ప్రభుత్వములు మారినందు వల్ల అతడు ఏ శిక్షను అనుభవించ కుండా స్వేచ్ఛగా ఉండెను. మనము కూడా గ్రీషావలె అనేక విషయములకు అనవసరముగా భయపడుదుము. క్రీస్తునకు భయపడినచో ఇక లోకములో దేనికి భయపడనక్కర లేదు. - డా||పి.బి.మనోహర్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)





 dad.png)






.jpg)






.jpeg)





.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech