Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

సృష్టి కర్త
16 October 2015

సృష్టి కర్త

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 46 : 1.

ఒక ఊరిలో ఒక పెద్ద చర్చి నిర్మించారు. చర్చి ముందు పెద్ద గోపురమును కట్టారు. గోపురముపై ఒక గడియారమును అమర్చాలని కమిటీ వారు తలంచారు.ఆ ఊరిలో గడియారములను తయారు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గోపురమునకు సరిపడే గడియారమును తయారు చేస్తానని అన్నాడు. చర్చి సభ్యులందరూ ఎంతో సంతోషించారు.

అతడు గడియారం తయారు చేయటం ప్రారంభించాడు. ప్రతీ గంటకు ఒక తలుపు తెరచుకొని పెద్ద కోడి పుంజు బయటకు వచ్చి 'కొక్కురొకో' అని అరిచేది. టైము పది గంటలైతే కోడి పదిసార్లు అరిచేది. వెంటనే ప్రక్కన ఉన్న చిన్న తలుపును తెరచుకొని ఒక ఆవు, మేక, గొఱ్ఱె, నాలుగు పిచ్చుకలు బయటకు వచ్చి ఆవు అంబా అని, మేక మే మే అని, పిచ్చుక కిచ కిచమని అరిచేవి. గడియారం యొక్క చిన్నముల్లు ఏడు అడుగుల పొడవు ఉంది. ఆ ఊరిలో అందరికంటే పొడవైనవారు కూడా దాని కంటే పొట్టిగా ఉన్నారు.

అతడు ఆ విధంగా గడియారం తయారుచేసి గోపురంపై అమర్చాడు. అది ఎంతో సుందరముగా ఉన్నది. ఆ గడియారం చూచుటకు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆ ఊరికి వచ్చేవారు. ముఖ్యంగా గంటలు కొట్టే సమయంలో ప్రజలంతా కోడిపుంజును, ఆవును, మేకను, పిచ్చుకలను చూచుటకు వేచి యుండేవారు. రోజూ చూచేవారు కూడాఆ దృశ్యాన్ని చూచిన తరువాతే తమ పనులకు వెళ్లేవారు.

పది సంవత్సరముల పాటు ఆ గడియారం చక్కగా పని చేసింది. ఒక రోజు ఒంటి గంటకు కోడిపుంజు అరవలేదు. కానీ ఆవు, మేక, పిచ్చుకలు అరిచినవి. వెంటనే ఈ విషయాన్ని కమిటీ వారు రాజుకు తెలియజేసారు. రాజు వెంటనే బయలుదేరి వచ్చారు. రెండు రోజులుగా పుంజు శబ్దం వినబడుట లేదు అని తెలుసుకొన్న రాజు 'సరేలే! నేను దీనిని బాగుచేస్తాను' అని గోపురం పైకి ఎక్కాడు. ప్రజలంతా క్రింద ఎదురు చూస్తూ ఉన్నారు.

గంట తరువాత రాజు క్రిందికి వచ్చాడు. అతని చేతుల నిండా గ్రీజు మరకలు ఉన్నవి. 'పుంజు ఉన్న అర యొక్క తలుపు బిగుసుకొని పోయింది. అందువల్ల పుంజు బయటకు వచ్చుట లేదు. నేను దానిని బాగుచేసాను' అన్నాడు. అప్పుడు సమయం నాలుగు గంటలు అయ్యింది. గడియారం బాగు అయ్యిందా? లేదా? అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కోడి పుంజు బయటకు వచ్చి నాలుగు సార్లు 'కొక్కురొక్కో' అని అరిచింది. ప్రజలంతా హర్ష ద్వానాలు చేసారు. రాజు చాలా గర్వ పడ్డాడు.

కానీ ఆవూ, మేకా, పిచ్చుకా బయటకు రాలేదు. రాజు వెంట వచ్చిన మంత్రి 'రాజుగారు చెప్పినట్లు వాటి తలుపులు కూడ బిగుసుకొని ఉంటాయి. నేను వెళ్లి వాటిని సరిచేసి వస్తాను' అని గోపురము పైకి ఎక్కాడు. గంట తరువాత మంత్రి దిగాడు.5 గంటలకు కోడి కూసినది. ఆవు 'అంబా' అని, మేక 'మే మే' అని అరిచినవి. కానీ పిచ్చుకలు అరవ లేదు. సేనాధిపతి 'ఈసారి నేను బాగుచేస్తాను' అని పైకి ఎక్కాడు. గంట తరువాత క్రిందికి దిగి వచ్చాడు. 6 గంటలకు కోడి బయటకు వచ్చింది. కానీ కూయలేదు.

ప్రజలంతా నిరీక్షిస్తున్నారు. కానీ ఆవు, మేక, పిచ్చుకలు బయటకు రాలేదు. పది నిముషాలు గడిచినా పెద్ద ముల్లు 12 మీదే ఉన్నది. గడియారం ఆగిపోయింది అని అందరికీ తెలిసింది. ఆ సమయంలో ఆ గడియారమును నిర్మించిన వ్యక్తి చర్చికి చాలా సమీపంలోని తన కార్ఖానాలోని పనిచేసికొంటూ ఉన్నాడు. ఎవరికీ అతన్ని పిలవాలని తట్టలేదు.

మనం కూడ అనేకసార్లు ఆ ఊరి వారివలె ఉంటాము. మనకు వచ్చే సమస్యలను ధనం ద్వారా (రాజు), తెలివి తేటల ద్వారా (మంత్రి), బలం ద్వారా (సేనాధిపతి) పరిష్కరించుకోవాలి అని చూస్తాము కానీ మనలను సృష్టించిన దేవుని దగ్గరకు వెళ్లి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి అని తలంచం. వీటి ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తే ఒక సమస్య పోతే మరొక సమస్య ఎదురవుతుంది. సృష్టి కర్త వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే మనలను సృజించిన ఆయన మాత్రమే మన సమస్యలను పరిష్కరించగడు.

యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కీర్తన 121 : 1. - డా||పి.బి.మనోహర

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech