mahimasabdam.tv@gmail.com
+91 9390209376

మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీని నుండి ఏమియు తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తి పొంది యుందము. - 1 తిమోతి 6 : 8.
రామస్వామికి చక్కని ద్రాక్షతోట ఉన్నది. ఆ తోట అరణ్యమునకు సమీపమున ఉండుట వలన అనేక నక్కలు వచ్చి ఆ తోటలోని ద్రాక్ష పండ్లను తినేసేవి. అందువల్ల రామస్వామి తన తోట చుట్టూ కంచె ఏర్పరచాడు.
ఒక రోజు ఒక నక్క వచ్చి విరగ కాసిన ద్రాక్ష పండ్లను చూసింది. ఎలాగైనా ఆ ద్రాక్ష పండ్లను తినాలని, లోపలకు వెళ్లుటకు కంత కోసం అది కంచె చుట్టు చాలా సేపు తిరిగింది. చివరికి ఒక చోట చిన్న కంత కనబడింది. నక్క ఆ కంతలో తల దూర్చింది. కాని ఎంత ప్రయత్నించినా ఆ కంత లోనికి వెళ్లలేక పోయింది. అది కంతలోనే తల ఉంచి బాగా పండిన ద్రాక్షలను చూస్తూ మూడు రోజుల పాటు అలాగే ఉన్నది. మూడు రోజుల పాటు నక్క ఏమీ తినకపోవుట వలన అది బాగా సన్నబడింది. అతి కష్టం మీద అది లోపలకు దూరగలిగింది.
నక్క ఆనందానికి హద్దులు లేవు. అది ఇష్టం వచ్చినట్లు ద్రాక్ష పండ్లను తనివి తీరా తిన్నది. రామస్వామి పది రోజులకు ఒక్కసారే వస్తాడు. రామస్వామి వచ్చేలోగా తోటలోనుండి వెళ్ళిపోవాలని నక్క అనుకొన్నది. అది కంత వద్దకు వచ్చి బయటకు వెళ్ళుటకు ప్రయత్నించింది. అయితే తోటలో రెండు రోజుల పాటు బాగా తినడం వలన నక్క బాగా బలిసింది. ఎంత ప్రయత్నించినా ఆ కంతలో నుండి బయటకు రాలేకపోయింది. మరలా అదే స్థితిలో మూడు రోజుల పాటు ఏమీ తినకుండా ఉన్నది. ఇప్పుడు అది మరల సన్నగా అయింది. అందువలన ఆ కంతలో నుండి దూరి బయటకు రాగలిగింది.
బయటకు వచ్చిన తరువాత నక్క ఆ తోట వైపు చూచింది. మరలా ద్రాక్ష తోట ఎంతో అందంగా కనబడింది. నక్క 'ద్రాక్షా తోటా! నీ పండ్లు నీ గుత్తులు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. తినటానికి ఎంతో రుచిగా ఉన్నవి. అయితే నాకు ఏమి లాభము? నేను ఎలా మీ యొద్దకు వచ్చానో అలాగే మీ దగ్గర నుండి బయటకు వచ్చాను' అన్నది.
మనకు కూడ ఈ లోకం అటువంటిదే. ఈ లోకములోనికి మనము వట్టి చేతులతో వచ్చాము. వట్టిచేతులతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము. కాని మనం అనేక ప్రలోభాలకు లోబడి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాము.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)








 dad.png)

.jpg)









.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech