mahimasabdam.tv@gmail.com
+91 9390209376

తాత్కాలిక విజయములు కొంత సంతోషమిచ్చిననూ అవి పూర్తి తృప్తిని ఇవ్వజాలవు. నిత్యత్వముతో పోల్చుకొనిన యెడల ఈ విజయములు బహు అల్పమైనవిగా తోచును. దేవుని యందు భక్తి లేకుండా ఈ లోక సంబంధమైన విజయములు నిరర్ధకములు.
ప్రపంచములో పేరుగాంచిన ఐదుగురు రాజులను గమనించిన యెడల ఈ విషయము అర్ధమగును. మహా అలెగ్జాండర్ అనేక దేశములను జయించెను. అయిననూ చిన్న వయస్సునందే మరణించి నేను రిక్తహస్తములతో పోవుచున్నాను అనెను. హనిబాల్ అనేక రాజులను చంపి వారి రాజ ముద్రికలతో మూడు కుంచములు నింపెను. అయినను యితడు విషము తాగి ఆత్మహత్య చేసుకొనెను. అతనిని గూర్చి దుఃఖించువారే లేరు. పది లక్షల మంది శత్రువుల రక్తములో తన వస్త్రమును ముంచిన జూలియస్ 800 నగరములను జయించెను. కానీ తన మిత్రుని చేతనే హత్య చేయబడెను. నెపోలియన్ ఐరోపా ఖండమంతటినీ జయించెను కానీ తన చివరి దినములు ప్రవాసములో బ్రతుకవలసి వచ్చెను. హిట్లర్ అనేక వేల మందిని చంపెను. కానీ చివరకు ఆత్మహత్య చేసుకొనెను.
దేవునితో సంబంధము లేని ప్రతి జీవితము వ్యర్ధము. నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును [సామెతలు 10:20] అని సొలోమోను వ్రాయుచున్నాడు.
మనము దేవుని చిత్తమును నెరవేర్చు వారముగా ఉన్నామా ? లేదా పైన ఉదహరించిన రాజుల వలె దుష్టతలంపులో ఉన్నామా ? ప్రభువు చేత నిర్దేసింప బడనిచో మనకు కలిగినది సమస్త వ్యర్ధము.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)








 dad.png)

.jpg)








.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech