mahimasabdam.tv@gmail.com
+91 9390209376

దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. కీర్తన 14 : 1
రామన్న దేవుడు లేని వాదించేవాడు. ఆయన ఎంతో తెలివైనవాడు. ఆయన వాదన వలన అనేకులు దేవుడు లేని ఒప్పించబడి నాస్తికులుగా మారారు. వారంతా తరచు సభులు, సమావేశాలు నిర్వహిస్తూ దేవుడు లేని ప్రచారం చేయసాగారు. అతని ప్రక్క గ్రామంలో ప్రతాప్ అనే పాస్టరు గారు ఉండేవారు. రామన్న ఒకరోజు ప్రతాప్‌తో ''దేవుడు లేు, మీరు అనవసరంగా ప్రజలను అజ్ఞానంలోనికి నెట్టి వేస్తున్నారు. మీరు నాతో వాదించుటకు రాగలరా?'' అని సవాలు విసిరారు. అందుకు ప్రతాప్‌గారు ''నేను మిమ్ములను ఒప్పించగలనని అనుకొనుట లేదు. వాదనల వలన ఎవరూ మారరు. అయినా మీరు పిలిచారు గనుక నా అభిప్రాయములను తెలియజేయుటకు వస్తాను'' అని జవాబిచ్చారు. సోమవారం ఉదయం పదిగంటలకు తమ గ్రామంలోని రచ్చబండ వద్దకు రావలెననీ, ఒకవేళ ప్రతాప్ రాకపోతే అతు ఓడిపోయినట్లు భావించవలసి వస్తుంది అనీ ప్రతాప్‌కు కబురు చేసారు. సోమవారం ఉదయం 10 గంటలకు నాస్తికులంతా రచ్చబండ వద్దకు చేరుకున్నారు. 11 గంటలయినా ప్రతాప్ రాలేదు. 12 గంటలయింది. ప్రతాప్ రాలేదు. ఒంటి గంటకు రామన్న లేచి ''ప్రతాప్ ఇంకా రాలేదు. గ్రామస్తులారా! ఆయన ఎందుకు రాలేదో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. మాతో వాదించలేక ఆయన రాలేదు. కాబట్టి ఆయన ఓడిపోయాడు. మేము గెలిచాము'' అన్నాడు. అంతలో ప్రతాప్ వచ్చారు. ప్రజలంతా ''మీరు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? మీరు ఓడిపోయారు'' అని అరిచారు. గ్రామ పెద్ద ''ప్రతాప్ గారూ, మీరెందుకు ఆలస్యంగా వచ్చారు?'' అని అడిగాడు. అందుకు ప్రతాప్ ''నేను సరియైన సమయంలోనే ఇంటి నుంచి బయల్దేరాను. మీ ఊరు రావాలంటే నది దాటాలి కదా? నది వద్దకు వచ్చేసరికి ఒక్క బోటు క్బడ లేదు. నేను ఎదురుచూచి, ఎదురుచూచి ఏమి చేయాలా? అని ఆలోచిస్తున్న సమయంలో కొన్ని చెక్కలు నీటిలో కొట్టుకొని వస్తున్నాయి. ఆ చెక్కలు నాకు ఎదురుగా వచ్చి నీటిలో ఆగాయి.....'' వెంటనే రామన్న లేచి నిలబడ్డాు. ''అబద్ధం, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఇది నమ్మశక్యంగా లేదు'' అన్నాడు. అతని మాటలను ప్రతాప్ పట్టించుకోకుండా ''చెక్క వెంబడి చెక్క వచ్చి నాకు ఎదురుగా ఆగిన తరువాత అవన్నీ ఒడ్డుకు వచ్చినవి. వాటికవే ఒకదాని కొకటి అతుక్కున్నవి. అకస్మాత్తుగా కొన్ని మేకులు నీటిలో తేలుకుంటూ వచ్చి చెక్కలకు గుచ్చుకొని ఒక పవ తయారైనది. నేను ఆ పవలో క్బర్చొనగానే అది మెల్లగా ఇవతల ఒడ్డుకు వచ్చింది. నా ఆలస్యానికి కారణం ఇదే'' అన్నారు. ఈ మాటలను అక్కడ ఉన్న నాస్తికులెవరూ నమ్మలేదు. ప్రతాప్ ''నేను ఆలస్యంగా రావటానికి ఇదే కారణం'' అని పదే పదే చెబుతున్నా నాస్తికులంతా హేళనగా అరచి గొడవ చేసారు. అప్పుడు ప్రతాప్ ఇలా అన్నాడు. ''పవ దానికదే నిర్మితమైంది అని నేను చెబితే మీరెవరూ నమ్ముట లేదు. నమ్ముటకు అసాధ్యంగా ఉంది అంటున్నారు. అయితే నేనొక ప్రశ్న అడుగుతాను. న్యాయంగా సమాధానం చెప్పండి. మీరు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి నక్షత్రాలను చూస్తున్నారు కదా? అవన్నీ ఒక క్రమపద్దతిలో తమ తమ కక్ష్యలలో తిరుగుతున్నాయి కదా! సృషి్టకర్త లేకుండా వాటికవే అలా ఏర్పడ్డాయని మీరు అంటున్నారు. దేవుని యొక్క ఉనికిని నిరాకరిస్తున్నారు. మీ వాదన ఎంతవరకు సబబు? మీ వాదన న్యాయమైనదేనా? అన్నాడు. నాస్తికులంతా నిశ్శబ్ధమైపోయారు. గ్రామస్తులంతా హర్షధ్వానాలు చేసి ప్రతాప్ గారు గెలిచినట్లు ప్రకటించారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)





 dad.png)





.jpg)






.jpeg)





.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech