Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

పనిలో శ్రద్ధ
17 November 2014

పనిలో శ్రద్ధ

తన పనిలో నిపుణత గల వానిని చూచితివా ? అల్పులైన వారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.

సామెతలు 22:29

అపోలో ఆసుపత్రిలో కుమారి నర్స్ గా జాయిన్ అయింది. రెండవ రోజు ఒక పేషెంటుకు ఆపరేషన్ జరుతున్నది. డాక్టర్ దీపక్ ''కుట్లు వేయాలి'' అన్నాడు. కుమారి వెంటనే ''డాక్టర్ గారూ ! మీరు పేషెంట్ కడుపులో 12 స్పాంజీలను పెట్టారు. 11 బయటకు తీశారు'' అన్నది. దీపక్ చిరాకుగా ముఖము పెట్టి ''నేను అన్నీ తీసేశాను. ఈ కోతను ఇప్పుడు క్లోజ్ చేయాలి. Sutures సూచర్స్ వేయాలి'' అన్నాడు. డాక్టర్ గారూ ! మనం 12 స్పాంజీలను ఉపయోగించాము. మీరు 11 బయటికి తీశారు'' అన్నది కుమారి.
''నీకెందుకు ? డాక్టర్ ని నేనా నీవా ?'' అని కోపంగా అన్నాడు దీపక్. ''అది కాదండీ'' అని కుమారి చెబుతుండగా ''నేను పూర్తి బాధ్యతవహిస్తాను. నీకెందుకు కంగారు ? సూచర్స్ వేయాలి'' అన్నాడు దీపక్. ''కుదరదు. పేషెంట్ కు ఏమైనా అయితే ?'' అని కుమారి గట్టిగా అన్నది. దీపక్ నవ్వుతూ తన కాలిని పైకెత్తాడు. 12వ స్పాంజ్ అతని కాలిక్రింద ఉన్నది. ''నీకు పనిలో చాలాశ్రద్ధ ఉన్నది. నీవు చేరి ఒక్కరోజే అయినా నీకు హెడ్ నర్స్ ప్రమోషన్ ఇస్తున్నాను'' అన్నాడు.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech