Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

కాపాడు హస్తములు
08 May 2018

కాపాడు హస్తములు

1979 లో సువార్తికులు డెన్నిస్ వెయిల్ లీ [Dennis Waitley] గారు చికాగో జిని నుండి లాస్ ఏంజల్స్ కు విమానములో వెళ్ళవలసి ఉండెను. ఆయన సాధారణముగా విమానము బయలు దేరుటకు గంట ముందే ఎయిర్ పోర్టుకు చేరుకునే వారు. కాని ఆ రోజు చాలా పనులు ఉండుట వలన డీసీ - 10 ఫ్లైట్ 191ను అందుకోలేక పోయారు. ఆయన ఎయిర్ పోర్టుకు వచ్చే సరికి గేట్ వద్ద ఉన్న స్త్రీ గేటు మూసి తాళం వేసింది. ఎంత బ్రతిమాలినను ఆమె తాళం తెరువలేదు. చేయునది లేక తాను కొన్న టిక్కెట్టును వాపస్ ఇచ్చి డబ్బు తీసుకొందామని ఆయన బుకింగ్ కౌంటరు వద్దకు వెళ్లారు. ఆయన ఎయిర్ పోర్టులో ఉండగానే టేకాఫ్ Take up అయిన విమానం కూలిపోయి దానిలో ఉన్న 271 మంది ప్రయాణికులు మరణించారు. అప్పటి వరకు కోపంగా ఉన్న డెన్నిస్ గారు కన్నీళ్ళతో దేవునికి కృతజ్ఞత తెలిపారు. టికెట్ ను వాపస్ ఇచ్చి డబ్బులు తీసుకొనుటకు బదులు ఆటికెట్ ను ఫ్రేమ్ కట్టించి తన ఆఫీసు గదిలో తగిలించారు.

ఆయనకు ఏ విషయములోనైన కోపము వచ్చినపుడు ఫ్లైట్ 191 టిక్కెట్టును చూచి తన కోపాన్ని మర్చిపోయేవారు. మనము కూడా అనేకసార్లు మనకు జరిగే నష్టములను గూర్చి, మనకు వచ్చే కష్టములను గూర్చి మనసులో బాధపడుతుంటాము. అయితే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని గుర్తించము.

యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలి యుండి రక్షించును.

కీర్తన 34:7

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech