Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

దొంగ చాటుగా
15 November 2014

దొంగ చాటుగా

నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను. నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.

యోహాను 14:6

1985 జనవరి 11వ తేదీన లాస్ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు ఒక పెద్ద సూట్ కేసును కనుగొన్నారు. దానిని తెరచినప్పుడు దానిలో ఒక యువతి మృత దేహము ఉన్నది. ఆమె దుస్తులపై ఉన్న లాండ్రీ మార్కుల ద్వారా పోలీసులు దర్యాప్తు జరిపి ఆమె అమెరికాలో నివసిస్తున్న ఒక ఇరాన్ దేశస్థుని భార్య అని కనుగొన్నారు. ఆమె పేరు కాటున్ సఫి. [Kataun Safaie] వయస్సు 20 సంవత్సరములు. ఆమె భర్తపేరు మహమ్మద్అయాజీ [Mahmoud Ayazi] ఆమెకు వీసా లభించనందు వలన తన భర్తను చేరుకొనుటకు తనను తానే ఒక సూట్ కేసులో పెట్టుకుని కార్గో విమానంలో దొంగ చాటుగా అమెరికా చేరాలని ప్లాన్ వేసింది. ఆమె ప్లాన్ వికటించి ఆ ప్రయత్నంలో ఆమెమరణించింది. ఆమె మరణించినదని తెలిసికొన్న ఆమె భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు. సూట్ కేసులో రెండు రోజులు ఉండగలిగినను దొంగచాటుగాఅమెరికాలో ప్రవేశించుటలో విజయం సాధించగలనని ఆమె ఎలా అనుకున్నదో ! అని అధికారము విస్తుపోయిరి.

ఆమె దొంగ చాటుగా అమెరికా చేరగలనని ఎట్లు అనుకున్నదో అట్లే అనేకులు తమ సొంత పద్దతుల ద్వారా పరలోకం చేరగలమని తలంచుచున్నారు. తాము మంచి వారమనీ, ఎవరికి కీడు చేయుట లేదనీ, చర్చికి క్రమముగా వెల్లుచున్నామనీ అందువలన తాము పరలోకమునకు వెల్లుదుమని తలంచుచున్నారు. దొంగ చాటుగా సూట్ కేసులో అమెరికా చేరుట ఎంత కష్టమో మన సత్క్రియల వలన పరలోక రాజ్యం చేరుదుమని అనుకొనుట కూడ అంతే మూర్ఖత్వము.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తనను నమ్మినవాడు నశించకుండా నిత్యజీవము పొందవలెను.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech