Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

నిజమైన పశ్చాత్తాపము
01 February 2015

నిజమైన పశ్చాత్తాపము

దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్ధమైన మారుమనస్సు కలుగజేయును - 2 కొరింధి 7 : 10

యేసు ప్రభువు శిష్యులైన యూదా ఇస్కరియోతు, పేతురు ఇద్దరూ పాపము చేసారు. 30 వెండి నాణెములకు ఆశపడి యూదా యేసును పట్టి అప్పగించాడు. పేతురు ఆయన ఎవరో తెలియదని మూడుసార్లు అబద్దము ఆడాడు. తరువాత ఇద్దరూ పశ్చాత్తాప పడ్డారు. మత్తయి 27 : 3 లో యూదా  పశ్చాత్తాప పడి వెళ్లి ఉరి పెట్టుకొనెను. మత్తయి 26 : 75 లో పేతురు సంతాపపడి ఏడ్చెను. యూదా దుఃఖపడ్డాడు కాని ప్రభువును సమీపించి క్షమాపణ అడిగి యుంటే ప్రభువు తప్పక క్షమించి యుండేవారు. అలాగే చాలా మంది దుఃఖ పడతారు కాని నిజమైన మారుమనస్సు పొందరు.

అజయ్‌ ఒక కలప దుకాణములో పని చేస్తున్నాడు. వీలైనప్పుడల్లా ఆ  దుకాణములోని దుంగలు దొంగిలించేవాడు. ఒక రోజు ఒక పాస్టర్‌ గారి ప్రసంగము విని పశ్చాత్తాపడ్డాడు. పాస్టర్‌ గారిని సమీపించి 'నేను ఎన్నో దొంగతనాలను చేసాను. ఇప్పుడు పశ్చాత్తాపడ్డాను కనుక దానికి పరిహారంగా ఒక చర్చి కట్టుటకు సరిపడే కలపను ఇస్తాను' అని అన్నాడు.

 అందుకు పాస్టర్‌ గారు 'నీవు ఎవరి వద్ద కలప దొంగిలించావో వారికే తిరిగి ఇచ్చేయి' అన్నారు. అందుకు అజయ్‌ 'వారెవరూ నాకు తెలియదు. ఎవరి వద్ద ఎంత కలప దొంగిలించానో కూడ నాకు గుర్తు లేదు. అందుచేత మీకే ఇస్తాను' అన్నాడు. అందుకు పాస్టర్‌ గారు 'సరే' అన్నారు. అప్పుడు అజయ్‌ 'మీకు ఏ సైజు కలప కావాలో చెప్పండి. రేపు ఆ సైజు ముక్కలే దొంగిలించి తెస్తాను' అన్నాడు.

 అజయ్‌లో పశ్చాత్తాపము ఉన్నది కాని నిజమైన మారు మనస్సు లేదు. నిజమైన మారుమనస్సు మాత్రమే మనకు రక్షణ ఇస్తుంది.

-  డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

మత్తయి 16:26 మనిషి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? లేదా మనిషి తన ఆత్మకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి?

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech