mahimasabdam.tv@gmail.com
+91 9390209376

మోసపోకుడి దేవుడు వెక్కిరింబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7.
శౌరికి చాల ఆస్తి ఉన్నది. ఇటీవలే కోటి రూపాయలు వెచ్చించి ఒక ఇల్లు కట్టించారు. ఈ మధ్య తరచుగా జ్వరం వస్తున్నది. ఆ ఊరిలో పేరు పొందిన డాక్టర్ల అందరి వద్దా చూపించు కొన్నాడు. వారు అన్ని పరిక్షలూ చూసి చివరికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నదని తేల్చారు.
బ్లడ్ క్యాన్సరని తెల్సినప్పటి నుండి సౌరి చాల కృంగిపోయాడు పాస్టర్ యబ్బేజు శౌరిని కల్సుకుని "అయ్యా, మీ వ్యాధిని డాక్టరులు నయం చేయలేరు. పరమ వైద్యుడైన యేసు ప్రభువు మాత్రమే తగ్గించగలడు. స్వస్థపరచమని మీరు ప్రార్ధన చేసుకోండి. నేను కూడ ప్రార్ధన చేస్తాను" అన్నాడు. పాస్టర్ యబ్బేజు వెళ్లిపోయిన తరువాత శౌరి ఆయన మాటలను గురించి ఆలోచించాడు. శౌరి ఇలా ప్రార్ధన చేసాడు.
"ప్రభూ, నాకు వచ్చిన కేన్సర్ వ్యాధిని స్వస్థపరచు, నా వ్యాధి నయమైతే నా ఇల్లు అమ్మి ఆ డబ్బంతా నీ సేవ కొరకు ఇస్తాను"
పది రోజులు గడిచేసరికి వ్యాధి తగ్గుముఖం పట్టింది. నెల రోజులు గడిచేసరికి శౌరి పూర్తి స్వస్థుడయ్యాడు. అతనికి అనేక సార్లు మరల టెస్టు లు జరిపి అతను పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడని డాక్టర్లు అందరూ తేల్చారు.
తన ఇంటిని అమ్మి వేయాలంటే శౌరికి దిగులు పట్టుకొన్నది. కోటిరూపాయాలు వెచ్చించి ఎంతో అందంగా తన అభిరుచులకు అనుగుణంగా ఈ ఇంటిని నిర్మించుకొన్నాడు. అటువంటి ఇంటిని వదలి వెళ్ళిపోవటం ఒక బాధ అయితే ఆ ధనాన్ని చర్చిలో ఇవ్వవలసి రావటం మరొక బాధ అయింది. చివరికి అతడు ఆలోచించి ఒక దిన పత్రికలో ఈ ప్రకటన వేయించాడు.
"నా ఇంటిని అమ్మదలచుకొన్నాను. దాని వెల కేవలం 100 రూపాయలు. ఆసక్తి గలవారు సంప్రదించండి"
ఈ ప్రకటన చదివిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఇది అచ్చు తప్పు ఏమో అని కొందరు అనుకున్నారు. కొందరు శౌరిని సమీపించి "నిజమేనా" అని అదిగారు. "నిజమే. నా ఇంటిని వంద రూపాయలకు అమ్ముతాను. కాని ఇంటిని కొనుక్కొనే వాళ్లు నా పెంపుడు కుక్క కుడా కొనుక్కోవాలి. కుక్క ఖరీదు కోటి రూపాయలు" అన్నాడు.
వచ్చిన వారందరూ నిరాశ పడ్డారు. శౌరి తన తెలివిని తానే అభినందించుకొన్నాడు. "ఇంటిని అమ్మగా వచ్చిన 100 రూపాయలను చర్చిలో కానుకగా వేస్తాను. కుక్క నా స్వంతం కనుక ఆ కోటిరూపాయలు నావే" అనుకున్నాడు.
ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన జగపతికి శౌరి ఇల్లు ఎంతగానో నచ్చింది. అతడు కొనటానికి ముందుకు వచ్చాడు. జగపతి చాల ఆస్తిపరుడు. మాట తప్పని వాడని ఊరిలో మంచి పేరున్నది. అతడు శౌరితో "నేను నీ ఇంటిని 100 రూపాయలకు, కుక్కను కోటి రూపాయలకు కొంటానని" అన్నాడు. ఆ మేరకు ఇధ్దరూ అగ్రిమెంటు వ్రాసుకొన్నారు. జగపతి హైదరాబాదులో ఉన్న తన కుమారునితో కోటి రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసి తెమ్మని సెల్ ఫోనులో చెప్పాడు. శౌరితో "రేపు ఉదయమే మా అబ్బాయి కోటి రూపాయలు తెస్తాడు. వాటిని మీకిచ్చి మీ కుక్కను తీసుకుపోతాము. ఈ రోజు మీ ఇంటిని మాకు రిజిస్టర్ చేయండి"అన్నాడు.
శౌరి ఒప్పుకొని ఇంటిని 100 రూపాయలకు అమ్మినట్లుగా రిజిస్ట్రార్ ఆఫీసు లో రిజిస్టర్ చేయించాడు. రేపు ఉదయమే జగపతి కోటి రూపాయలిస్తాడు అని శౌరి సంతోషించాడు.
అన్నమాట ప్రకారం జగపతి కోటి రూపాయలు తీసుకొని శౌరి ఇంటికి వచ్చాడు. జగపతిని చూడగానే శౌరి తన పనివాడిని పిలిచి "ఒరేయ్ కుక్కను తీసుకురా!" అన్నాడు. పనివాడు లోనికి వెళ్లి తిరిగి వచ్చి "అయ్యా, కుక్క చనిపోయింది" అన్నాడు. "చచ్చిన కుక్క నాకు అక్కర లేదు" అని జగపతి తన కోటి రూపాయలు తిరిగి తీసుకొని "మీరు వెంటనే ఇల్లు ఖాళి చెయ్యండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
శౌరికి కళ్ళు తిరిగాయి. అతడికి జ్వరం వచినట్లు అనిపించింది. ఆ జ్వరం ఇక తగ్గలేదు.
సణుగుకొనకయు, బలవంతముగా కాక్యు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకోనిన ప్రకారము ఇయ్యవలెను. 2కొరింథీ 9:7.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)






 dad.png)





.jpg)






.jpeg)





.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech