mahimasabdam.tv@gmail.com
+91 9390209376

ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. యాకోబు 4 : 10
మనము ఎదురు చూచునది మనకు దక్కనిచో ఎంతో దిగులు చెందుతాము. అది దక్కకుండా చేసిన వారిపై ఎంతో కోపపడతాము. కాని సెంట్రల్ పసిఫిక్‌లోని మార్షల్ ద్వీపమునకు వెళ్ళిన సువార్తికులు అటువంటి పరిస్థితి ఎదురైనా ఎంతో ప్రశాంత చిత్తముతో ఉండిరి.
మార్షల్ ద్వీపమునకు వెళ్లిన సువార్తికులు తమ కుటుంబ సభ్యుల నుండి వచ్చే ఉత్తరాలను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందుకునే వారు. అందువలన తమ ఇంటి వారి విషయములు వారికి సంవత్సరానికి ఒక్కసారే తెలిసేవి. వారికి వచ్చే ఉత్తరములు అన్నీ దక్షిణ పసిఫిక్ వచ్చి అక్కడ నుండి ప్రత్యేక బోటు ద్వారా మార్షల్ ద్వీపమునకు పంపబడేవి.
ప్రతి సంవత్సరము మే 15 న ఆ బోటు వచ్చేది. అందుచేత మే 15 కొరకు మిషనరీలు ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు. అయితే ఒక సారి ఆ బోటు మే 13వ తేదీన వచ్చినది. మిషనరీలు అందరూ సువార్త ప్రకటించుటకు వెళ్లి యుండగా ఆ బోటు కెప్టెన్ పెద్ద పెట్టెను మార్షల్ ద్వీప వాసులకు ఇచ్చి మిషనరీలకు అంద జేయమని చెప్పి వెళ్ళి పోయెను.
20 కేజీలు బరువు ఉన్న ఆ అట్టపెట్టె ద్వీపవాసుల చేతులో పడగానే వారందరూ దాని చుట్టూ మూగారు. 'ఇది ఏదో అద్భుతమైన వస్తువు. దీని గురించి మిషనరీలు అస్తమానం మాట్లాడుతూ ఉంటారు. దీని కోసం ఎంత గానో ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటి దీని లోని విశేషం?' అనుకొని వారు ఆ పెట్టెను తెరిచారు. వాటిలో కొన్ని కాగితములు ఉన్నవి.
ద్వీపవాసులు ఆ కాగితములు చూచి ఇది తినుటకు పనికి వచ్చే ఆహార పదార్ధమని అనుకొన్నారు. అందుచేత ఆ ఉత్తరములన్నిటినీ చిన్నముక్కలుగా చించి పాత్రలో వేసి ఉడకబెట్టారు. తరువాత అందరూ దానిని కొంచెం కొంచెం తిన్నారు. ఆ కాగితములు ఏమీ రుచిగా లేవు. వారు ఈ రుచిగా లేని దాని కోసం మిషనరీలు ఎందుకు ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు? అని ఒకరితో ఒకరు చర్చించు కొన్నారు. మిషనరీలు తిరిగి వచ్చి ద్వీప వాసులు తమ ఉత్తరాలన్నీ చించి ఉడక బెట్టుకొని తిన్నారని తెల్సుకొని విస్తుపోయారు కానీ ఒక్కరు కూడా ఆ ద్వీప వాసులను తిట్టలేదు. వారిపై కోపపడలేదు. అనాగరికులైన ద్వీప వాసులకు ఉత్తరములంటే ఏమిటో తెలియజెప్పుటకు ప్రయత్నించారు..
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)





 dad.png)






.jpg)






.jpeg)





.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech