mahimasabdam.tv@gmail.com
+91 9390209376

మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. 1 పేతురు 5 : 8.
సునీత ఇన్‌స్యూరెన్స్ కంపెనీలో పని చేయుచున్నది. ఒక రోజు పాస్టరు గారు 'నీవు పరలోకములో ఉంటావా? లేక నరకములో ఉంటావా?' అని ఆమెను అడిగారు. ఆ విషయం గురించి సునీత ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె రోడ్డు ప్రమాదములో మరణించినది. ప్రభువు కనబడి 'నీవు పరలోకమును కోరుకో' అన్నాడు. ప్రక్కనే సాతాను కనబడి 'నీవు నరకం కోరుకో' అన్నాడు. సునీతకు ఏమి కోరుకోవాలో తెలియలేదు.
'నేను ఒక సారి రెండు ప్రాంతములను చూచి అప్పుడు ఎక్కడ ఉండాలో నిర్ణయం తీనుకుంటాను' అని అన్నది. సాతాను అది 'చాల మంచిది. ముందు నరకం చూడు' అని అన్నాడు. సునీత సాతాను వెంట నరకమునకు వెళ్ళింది. నరకపు గేటు కనబడగానే చక్కని పచ్చిక బయలు కనబడింది. చాల మంది కేరింతలు కొడుతూ గోల్ఫ్ ఆడుతున్నారు. ప్రక్కనే చక్కని ఉద్యానవనము ఉన్నది. ఆ తోటలో సునీత స్నేహితులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
వారు సునీతను చూడగానే పరుగెత్తుకొంటూ వచ్చి 'సునీతా! నీవు కూడ ఇక్కడికి వచ్చావా? చాలా సంతోషం. మనము హాయిగా గడుపవచ్చును' అని తమ పాతకాలపు విషయాలన్నీ మాట్లాడుకొన్నారు. ఆమె వారితో సంతోషంగా మాట్లాడింది. కొంత సేపు గోల్ఫ్ ఆడింది. మధ్యాహ్నం చక్కగా రొయ్యల కూరతో భోజనం చేసింది. సాయంత్రం వరకు మిత్రులతో పేక ఆడింది. క్లబ్‌లో అందమైన సినిమా తారలు నాట్యం చేస్తుంటే ఆనందంగా చూసింది. మధ్యలో అపవాది వచ్చి చక్కని జోక్స్ చెప్పాడు. ఆమెతో కలసి డ్యాన్స్ చేశాడు. ఆమె అలసినప్పుడు తేనె వేసిన బత్తాయి రసాన్నీ లేదా యాపిల్ జ్యూస్‌ని త్రాగటానికి ఇచ్చారు.
రాత్రి అయ్యే సరికి అపవాది ఐస్ క్రీమ్ ఇస్తూ 'ఒక సారి పరలోకము కూడ చూచిరా!' అని అన్నాడు. సునీత ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నది. ఐస్ క్రీమ్ రుచి అద్భుతముగా ఉన్నది. మరొకటి తింటే బాగుండును అని అనుకొన్నది. ఆమె ఆలోచనలను గ్రహించినట్లు అపవాది ఇంకొక ఐస్‌క్రీమ్ తింటావా? అని అడిగాడు. ఆమె తల ఊపగానే పెద్ద ఐస్ క్రీమ్ ఇచ్చాడు.
ఆమెకు నరకం విడిచి వెళ్ళాలని లేదు. కాని అపవాది 'జస్ట్ ఒక సారి చూచి నిర్ణయం తీసుకో' అని ఆమెకు వీడ్కోలు పలికాడు. సునీత మిత్రులంతా ఆమెకు టాటా చెప్పి కరచాలనం చేశారు. ఆమె వాళ్లని విడువలేక దుఃఖపడుతూ గేటు వద్దకు వెళ్ళింది.
గేటు బయట ఒక దేవదూత ఉన్నాడు. ఆయన సునీతను పరలోకం తీసుకొని వెళ్ళాడు. ఆమెకు ఒక బంగారు సితారా ఇచ్చాడు. అక్కడ ఆమె స్నేహితులు ఎవరూ లేరు. ఆమె రోడ్లన్నీ బంగారముతో చేయబడి ఉండుట గమనించింది. అక్కడ పేకాట ఆడేవాళ్ళు లేరు. డ్యాన్స్ చేసేవాళ్ళు లేరు. రొయ్యలతో విందు లేదు. ఒక రోజు గడిచిన తరువాత ఆమెకు పరలోకము కంటే నరకమే బాగా నచ్చింది. అక్కడే ఉండాలని నిర్ణయించు కొన్నది. పేతురు గారు రాగానే 'అయ్యా! నాకు నరకమే నచ్చింది. నేను అక్కడే ఉంటాను' అని అన్నది. పేతురు గారికి కన్నీరు వచ్చింది. 'బాగా ఆలోచించుకో తల్లీ! ఒక సారి నిర్ణయించుకుంటే దానిని మరల మార్చుకొలేవు. అపవాది పన్నాగములకు మోసపోవద్దు. ఇక్కడ నీకు సంతోషముగా లేదా?' అని అన్నాడు. అందుకు సునీత 'ఇక్కడ బాగానే ఉంది కాని అక్కడ ఇంకా బాగుంది' అని అన్నది. చేయునది లేక పేతురు గారు ఆమెను గేటు వద్దకు తీసుకొని వెళ్ళాడు.
అక్కడ అపవాది చిరునవ్వు చిందిస్తూ నిలబడి ఉన్నాడు. 'రా తల్లీ' అని రెండు చేతులు చాపి సునీతను ఆహ్వానించాడు. సునీత సంతోషముగా అతనితో వెళ్ళింది. నరకపు గేటు తెరిచిన తరువాత ఆమెను విసురుగా లోపలికి నెట్టాడు. లోపల దృశ్యం చూడగానే సునీత ఆశ్చర్యపోయింది.
నిన్న చూచిన పచ్చిక బయలూ, ఉద్యానవనమూ ఇప్పుడు లేదు. ఆ ప్రదేశమంతా మురికిగా ఉండి దుర్గంధం వెదజల్లుతున్న చెత్తతో నిండియున్నది. ఆ మురికి కూపములో ఆమె స్నేహితులంతా చింపిరి దుస్తులు ధరించి మురికిగా ఉన్నారు. వారిపై పురుగులు ప్రాకుచున్నవి. వారు ఏడుస్తూ రొమ్ము కొట్టుకొంటూ శాపనార్ధ్దాలు పెట్టుచున్నారు.
సునీతకు ఏమీ అర్ధం కాలేదు. అపవాది వైపు తిరిగింది. నిన్న అపవాది ఎంతో అందంగా ఉన్నాడు. ఇప్పుడు కోర పళ్ళు. తలపై కొమ్ములు. పెద్ద తోక. చూడటానికి భయంకరంగా ఉన్నాడు. ఆమె భయపడి 'నిన్న గోల్ఫ్ ఆడాను, రొయ్యల కూరతో భోజనం చేశాను. చక్కని డ్యాన్స్‌లను చూశాను. మరి ఈ రోజు....' అన్నది. ఆమె మాటలకు సాతాను వికట్టహాసం చేస్తూ నిన్ను ఆకర్షించుటకు అవన్నీ ఏర్పాటు చేశాను. నీవు నా ఉచ్చులో పడ్డావు' అని అన్నాడు. సాతాను దూతలు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళి ఒక అగ్ని గుండములో పడవేశారు. ఒక సెకనులోనే బత్తాయి జ్యూస్, యాపిల్ జ్యూస్ అమెకు పదే పదే జ్ఞాపకము వచ్చింది. కాని ఆమెకు చుక్క నీరు కూడ దొరకలేదు.
సునీత భయపడి కెవ్వున అరచి మంచంపై లేచి కూర్చున్నది. తనకు వచ్చిన కల జ్ఞాపకమునకు రాగానే ఆమె వళ్ళంతా చెమటతో తడచి పోయింది. పాస్టరు గారు చెప్పిన మాట ఆమెకు జ్ఞాపకము వచ్చింది. సాతాను ప్రలోభమునకు లొంగరాదని నిశ్చయించుకున్నది. ప్రభువా నన్ను క్షమించు అని వేడుకొన్నది. ఇప్పుడు ఆమె మనసు ఎంతో ప్రశాంతముగా ఉన్నది.- డా||పి.బి.మనోహర్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)









.jpg)
 dad.png)








.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech