Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

గర్వము
27 October 2014

గర్వము

ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. సామెతలు 29 : 23

హిరున్‌డపస్‌ కాడకుపస్‌Hirundapus caudacupusఅను పక్షి చాలా వేగముగా ఎగురునని పక్షి శాస్త్రజ్ఞులుచెప్పుదురు. అది గంటకు 170 కిలోమీటర్లు అనగా వంద మైళ్ళ వేగముతో ఎగురును. అవి ఎక్కువ సమయము ఎగురుచునే గడుపును. వీటిని దక్షిణ సైబీరియాలోను, మధ్య ఆసియాలోను చూడవచ్చును. అవి శీతాకాలములో హిందూదేశమునకు ఆస్ట్రేలియాకు వలస వెళ్ళును. ఒకనాడు హిరున్‌డపస్‌ పక్షి గర్వముగా మిగిలిన పకక్షులను చూచి 'ప్రపంచములో నా అంత వేగముగా ఎగురు పక్షి లేనే లేదు' అని అహంకారముతో పల్కెను. అప్పుడు ఫెమింగో అను పక్షి 'మన వలే అనేక పకక్షులు దక్షిణానికి ఎగిరి వస్తున్నాయి. నేను కూడా చాలా వేగముగా ఎగురగలను కాని మేము చాల బరువు. అందువల్ల మేము నీ అంత వేగముగా ఎగరలేము' అన్నది.

హిరున్‌డపస్‌ ఆ మాటలకు వినిన తరువాత కొంచెము ఆలోచించినది. నేను బరువు తగ్గితే ఇంకా వేగముగా ఎగురగలను. నేను బరువు తగ్గించుకోవాలి. కాని నేను బొద్దుగా, లావుగా లేనే. బరువు తగ్గాలంటే ఏమి చేయాలి?అని ఆలోచించినది. దానికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. తన రెక్కలలోని పెద్ద పెద్ద ఈకలను కొన్నిటిని తొలగించుకుంటే మరింత వేగముగా ఎగరగలనని అనుకొని తన రెక్కలలోని చాలా ఈకలను పెరికి వేసుకొన్నది. తరువాత ఏమైదో మీకు తెలిసింది కదా! ఆ పక్షి అసలు ఎగరలేక పోయినది. మనకు అహంకారము ఉన్న యెడల మనమే నశిస్తాము. - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech