Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

పాత బకెట్‌
25 October 2014

పాత బకెట్‌

అన్యజనులు ఏల గల్లత్తు చేయుచున్నారు? జనములు ఏల వ్యర్ధమైన దానిని తలంచుచున్నవి?

(కీర్తనలు 2 : 1)

మనము మానవ సంబంధమైన ఆలోచనలను, తప్పుడు సిద్ధాంతములను నిజమని నమ్మిన యెడల ఉపయోగము లేని లక్ష్యములను సాధించు వారముగా ఉందుము. నిత్యత్వముతో పోల్చిన యెడల అవి ఎందుకూ పనికి రానివిగా (ఎన్నిక లేనివిగా) ఉండును. దీనికి చక్కని ఉదాహరణగా బకెట్‌ యుద్ధము గురించి చెప్పుకొన వచ్చును.బకెట్‌ యుద్ధము 1176 లో ప్రారంభమై 1529 వరకు కొనసాగినది. చరిత్రలో ఇంత తెలివి తక్కువ యుద్ధము మరొకటి లేదు. యుద్ధకారణము ఒక బకెట్‌. ఇటలీ లోని బొలొగ్నా ఔళిజిళివీదీబి అనే ఊరిలో నీరు త్రాగుటకు వచ్చిన సైనికులు ఒక పాత బకెట్‌ను మొదీనాకు ఖళిఖిలిదీబి తీసుకొని పోయిరి. బొలొగ్నా ప్రజలు ఆ బకెట్‌ను తిరిగి ఇమ్మని కోరిరి. అందుకు మొదీనా సైనికులు నిరాకరించిరి. అందువలన బొలొగ్నా ప్రజలు యుద్ధమునకు దిగిరి. బొలొగ్నా వారు మొదీనా రాజైన రెండవ హెన్రీ యొక్క కుమారుడిని బంధించిరి. కుమారుడిని విడిపించుటకు బొలొగ్నా నగరమును చుట్టి వచ్చునంత పొడవైన బంగారపు గొలుసును ఇచ్చుటకు హెన్రీ సిద్ధపడెను. ఆ బంగారపు గొలుసు పొడవు ఏడు మైళ్లు. కాని బొలొగ్నా ప్రజలు నిరాకరించి బకెట్‌ కావలెనని పట్టు పట్టిరి. మరునాడు మొదీనా ప్రజలు విజృంభించి రాకుమారుడిని విడిపించు కొనిరి. ఈ యుద్ధములో ఇరు పక్షములలోను సుమారు రెండు వేల మంది చని పోయిరి. బొలొగ్నా ప్రజలు తమ బకెట్‌ను తిరిగి పొందలేక పోయిరి.


మీరు ఇటలీలోని మొదీనా లోని టౌన్‌ హాల్‌ను సందర్శిస్తే అక్కడ నగషీ చెక్కిన చెక్క పీఠముపై గాజు పలకల మధ్య బద్రపరచబడిన ఆ చెక్క బకెట్‌ను ఇప్పటికీ చూడవచ్చును. దాని క్రింద దొంగిలించబడిన బకెట్‌ అను అర్ధమిచ్చు ఐలిబీబీనీరిబి ష్ట్రబిచీరిశిబి అను మాట ఇటలీ భాషలో వ్రాయబడి యున్నది.
మనము కూడ ఇటువంటి నిరర్ధకమైన విషయముల గురించి ఆరాట పడుచుందుము. అటువంటి దురాలోచనలలో పడకుండా ఉండుటకు మనము క్రైస్తవ సహవాసములో ఉండుచూ, బైబిలును అనుదినము చదువుచుండవలెను.- డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

రోమీయులు 6:23 పాపపు వేతనం మరణం, కాని దేవుని ఉచిత బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసులో నిత్యజీవము.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech