mahimasabdam.tv@gmail.com
+91 9390209376

తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహనబలులను, బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుకంటే మాట వినుటయు శ్రేష్టము. 1 సమూ 15 : 22
అనేకసార్లు ప్రభువు మనలను ఒక పనిని చేయమని ఆజ్ఞాపించినప్పుడు నేను ఆ పని చేయలేను. నాకు అంత సామర్ధ్యము లేదు.
ఇతరులు ఏమనుకుంటారో అని కుంటిసాకులు చెప్పుచూ ప్రభువు యొక్క మాటకు అవిధేయత చూపుతాము. బలులు అర్పించుటకంటే, కానుకలిచ్చుటకంటే ఆయన మాట వినుట ముఖ్యము.
రోజర్ సిమ్స్(Roser Sims)మే 7వ తేదీన రోడ్డుపై నడచి వెళ్లుచుండగా హనోవర్‌గారు(Hanover)తన కారులో అదే రోడ్డుపై చికాగో వెళ్లుచున్నారు. రోజర్ గారు కూడ చికాగోకు ముందు ఉన్న ఊరు వెళ్లాలి గనుక కారులో వస్తున్న హనోవర్‌ను లిఫ్ట్ ఇమ్మని అడిగారు. హనోవర్ గారు రోజర్ గారిని కారు ఎక్కించుకున్నారు.
కొంత దూరం వెళ్లిన తర్వాత ప్రభువు హనోవర్‌కి సువార్త చెప్పమని రోజర్ గారిని ప్రేరేపించారు. సువార్త ప్రకటిస్తే అతను ఏమనుకుంటాడో అని చాలా సేపు రోజర్ గారు ఆ మాటకు లోబడలేదు. చివరికి ఏమైనను దేవుని మాటకు లోబడవలెనని అతనికి సువార్తను ప్రకటించారు. సువార్త విన్న వెంటనే హనోవర్ గారు కారు ప్రక్కకు తీసి ఆపి కన్నీళ్ళతో ప్రార్థిస్తూ ప్రభువును రక్షకునిగా అంగీకరించారు.
గంట తర్వాత రోజర్ దిగవలసిన ఊరు వచ్చినప్పుడు హనోవర్ గారు తన విజిటింగ్ కార్డును రోజర్ గారికి ఇస్తూ 'మీరు చికాగో వచ్చినప్పుడు మా ఇంటికి రండి' అని ఆహ్వానించారు. 5 సంవత్సరముల తర్వాత రోజర్ చికాగో వెళ్ళవలసిన అవసరం కల్గింది. హనోవర్ గారిని కలుసుకోవాలని ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డు ప్రకారం ఆ అడ్రసుకు వెళ్ళారు. ఆయన ఇంటిని సమీపించి గేట్‌మేన్‌ను 'హనోవర్ గారు ఉన్నారా?' అని అడిగాడు. గేట్‌మేన్ 'అమ్మగారు ఉన్నారు' అని అన్నాడు.
50 సంవత్సరముల పైబడిన ఒక స్త్రీ వచ్చి 'మీకు మా వారు తెలుసునా?' అని అడిగింది. అందుకు రోజర్ '5 సంవత్సరముల క్రితం మే 7వ తేదీన నాకు ఆయన లిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు నాకు ఎందుకు బాగా గుర్తు ఉన్నదంటే మేమిద్దరం కారులో వస్తున్నప్పుడు దేవుడు ఆయనకు సువార్త ప్రకటించమని నన్ను ప్రేరేపించారు. నేను గంట సేపు కుంటిసాకులు చెప్పాను. చివరికి దేవుని మాటలకు లోబడి సువార్త ప్రకటించాను. హనోవర్ గారు వెంటనే కారు ప్రక్కకు తీసి ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. నా మాటలకు ఎవరైనా అంత త్వరగా ప్రభువును అంగీకరించటం అదే మొదటిసారి. అందువలన నాకు ఈ సంగతి బాగా గుర్తు ఉన్నది' అన్నాడు.
వెంటనే ఆ స్త్రీ ఏడవటం ప్రారంభించింది. చాల సేపు ఏడ్చిన తర్వాత ఆమె తెప్పరిల్లి 'నా భర్త రక్షణను గురించి అనేక సంవత్సరములు ప్రార్థన చేసాను. మే 7వ తేదీన మీరు దిగిపోయిన తర్వాత ఒక లారీ ఆయన కారును గుద్దినందు వలన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన రక్షణ కోసం నేను ఎంతగా ప్రార్థించినా ఆయన రక్షింపబడలేదని నేను దుఃఖముతో ప్రార్థించుట మానివేసాను.
ఈ 5 సంవత్సరముల నుండి నేను ఒక్కరోజు కూడ చర్చికి వెళ్లలేదు. బైబిల్ చదవలేదు. ప్రార్థన చేయలేదు. ఈరోజు నుండి నేను ప్రభువును ప్రార్థిస్తాను. క్షమించమని వేడుకొంటాను' అని అన్నది. రోజర్ గారు తాను దేవునికి విధేయుడు అగుట వలన ఇద్దరిని రక్షణలోనికి నడిపించి నానని ఎంతో సంతోషించినారు. - డా||పి.బి.మనోహర
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)








.jpg)
 dad.png)










.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech