mahimasabdam.tv@gmail.com
+91 9390209376

చాలామంది ఏదైనా నష్టం జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు 'నా టైం బాగో లేదు' అంటూ ఉంటారు. నిజమునకు వారికి వచ్చిన కష్టం గానీ, నష్టం గానీ చాలా చిన్నది. అయినా వారు ఎంతో బాధతో 'నా టైం బాగో లేదు' అంటారు. నా దృష్టిలో టైం బాగో లేదు అని అనవలసిన వాడు శ్యాం జోన్స్. కాని అతడు అలా అనేలోగానే మరణించాడు.
శ్యాం జోన్స్ కాలిఫోర్నియాలో నివసించేవాడు. ఫసిఫిక్ సముద్రపు లోతుల్లోనికి వెళ్లి అక్కడ పెరిగే చెట్ల గురించి పరిశోధించాలని స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని, కాళ్లకు ఫ్లిప్పర్స్ (Flippers) కట్టుకొని, వీపు వెనుక ఆక్సిజన్ సిలిండర్ కట్టుకొని సముద్రం లోనికి దూకాడు. అదే సమయంలో సముద్ర తీరానికి 20 మైళ్ల దూరంలో ఉన్న అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. దానికి ఆర్పుటకు ఫైర్ డిపార్టుమెంట్ వారు అనేక హెలికాఫ్టర్లను ఉపయోగించారు. హెలికాఫ్టర్లు సముద్రపు నీటిని తెచ్చుటకు డిప్ (Dip) బక్కెట్లను ఉపయోగించారు.
ఒక హెలికాఫ్టరు తన బక్కెట్‌ను నీటిలో ముంచినపుడు ఆ బక్కెట్ లోనికి శ్యాం జోన్స్ వచ్చాడు. ఏమి జరిగిందో అతనికి తెలిసే లోపుగా 300 అడుగుల ఎత్తు నుండి ఆ నీటిని కార్చిచ్చుపై జారవిడిచారు. శ్యాం జోన్స్ వలన ఐదు అడుగుల పదంగుళాల కార్చిచ్చు ఆరిపోయింది కాని అతని ప్రాణం పోయింది.
ఇంతకంటే కష్టం జేమ్స్‌కు వచ్చింది. అతని భార్య వంటగదిలో ఉన్నది. జేమ్స్ తన మోటారు సైకిలును కడుక్కుంటున్నాడు. పెట్రోలు ట్యాంకు మూత తెరచి ఎంత పెట్రోలు ఉందో చూసాడు. పెట్రోలు ట్యాంకు మూత తెరచి యుండగానే స్డాండు వేసిన మోటారు సైకిలును స్టార్టు చేసాడు. పొరపాటున అతని కాలు గేరుకు తగిలి ఫస్ట్ గేర్ పడింది. మోటారు సైకిలు ముందుకు వెళ్లి గోడకు గ్రుద్దుకొని క్రింద బడింది. పెట్రోలు నేలపై కారింది. మోటారు సైకిలును ఆపుటకు ప్రయత్నం చేసినందున జేమ్స్‌కు చాలా గాయాలు అయ్యాయి.
ఈ శబ్దం విని అతని భార్య బయటకు వచ్చి నేలపై పడియున్న జేమ్స్‌ను చూసి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చింది. జేమ్స్‌ను స్ట్రెక్చర్‌పై తీసుకొని వెళ్లిన తరువాత అతని భార్య క్రింద ఒలికిన పెట్రోలును చూసింది. టాయిలెట్ పేపర్లు తెచ్చి ఆ పెట్రోలును శుభ్రంగా తుడిచింది. ఆ పేపర్లను టాయిలెట్‌లో వేసింది. కట్టు కట్టించుకొన్న జేమ్స్ ఇంటికి వచ్చి సిగరెట్ వెలిగించి టాయిలెట్‌కు వెళ్లాడు. కమోడ్‌పై కూర్చుని సిగరెట్ పీకను టాయిలెట్‌లో వేసాడు. పెట్రోలులో నానిన టాయిలెట్ పేపర్లు అంటుకొన్నాయి. జేమ్స్ పెద్దగా కేకవేసాడు.
అతని భార్య పరుగెత్తుకొని వచ్చింది. టాయిలెట్‌లో మంటలు చూచి ఆశ్చర్య పడింది. జేమ్స్ తొడలు, ఇంకా చెప్పరాని చోట్ల బాగా కాలింది. అతని భార్య మరల అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. వారు వచ్చి స్ట్రెక్చర్‌పై అతనిని తీసుకొని వెళ్తూ 'ఈ ప్రమాదం ఎలా జరిగింది?' అని అతని భార్యను అడిగారు. ఆమె చెప్పగానే స్ట్రెక్చర్ మోస్తున్న ఒకనికి బాగా నవ్వు వచ్చి గట్టిగా నవ్వసాగాడు.
అదే సమయంలో మెట్లు దిగుతున్న అతని చేయి జారి స్ట్రెక్చర్ క్రింద పడింది. మెట్లపై నుండి జారుకుంటూ క్రిందకు వచ్చిన జేమ్స్ అక్కడ నిద్ర పోతున్న కుక్కపై పడ్డాడు. అది కంగారు పడి అతని చేతిని గట్టిగా కరిచింది. మెట్ల మీద నుంచి జారిపడడటం వలన జేమ్స్ కాలు విరిగింది. ఇంతకన్నా కష్టం మీకు ఎప్పుడైనా వచ్చిందా? పాపం జేమ్స్‌కు ఎన్ని కష్టాలో !
అలస్కాలో 1989 మార్చి 24న 7 లక్షల పీపాల (పీపా అంటే సుమారు 200 లీటర్లు) క్రూడ్ (Crude) ఆయిల్‌తో వస్తున్న ఆయిల్ టేంకర్ ఒక కొండను ఢీకొని మొత్తం క్రూడ్ ఆయిల్ సముద్రం పాలయినది. అందువలన ఆ ప్రాంతంలో ఉన్న సముద్ర జీవులు ముఖ్యంగా సీలు జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఒక సీలు జంతువును తీసుకొనివచ్చి అది పెద్దదైన తర్వాత సముద్రంలో విడుచుటకు సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అగును.
పర్యావరణ రక్షకులు, వన్యప్రాణి సంరక్షకులు కలసి రెండు సీలు జంతువులను జాగ్రత్తగా పెంచి అవి స్వతంత్రముగా బ్రతుకగలవు అను నమ్మకము వచ్చిన తర్వాత వాటిని హెలికాప్టర్‌లో తీసుకొని ప్రజలందరూ చూచుచుండగా సముద్రంలో జారవిడిచారు. సరిగ్గా నిముషం తర్వాత ఒక తిమింగలము వచ్చి ఆ రెండింటినీ తినివేసినది. అప్పుడు టైమ్ బాగో లేదు అని చాలమంది అనుకున్నారు.
ఇరాకీ టెర్రరిస్ట్ ఖే Khay Rahnajet ఒక బాంబును కవర్లో పెట్టి అది తెరిస్తే పేలేలాగ ఏర్పాటు చేసాడు. అయితే దానికి తగినన్ని స్టాంపులు అంటించలేదు. అందువలన అది అతనికే తిరిగి వచ్చినది. దానిలో బాంబు ఉందని మరచిన ఖే, ఆ కవరును తెరవగానే బాంబు పేలి అతడు మరణించాడు.
క్రైస్తవులెవరూ నా టైమ్ బాగా లేదని అనుకొనకూడదు. మనకేది జరిగిననూ సమస్తము మన మేలు నిమత్తము సమకూడి జరుగుతున్నవని అనుకొనవలెను. ఒక వేళ మనకు కష్టములొచ్చిననూ అది కూడ మేలు నిమిత్తమే అని తలంచవలెను. - డా||పి.బి.మనోహర్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)







.jpg)
 dad.png)










.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech