Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

మాట్లాడే దేవుడు
29 October 2014

మాట్లాడే దేవుడు

డేవిడ్‌కి ఉద్యోగం పోయింది. ఎలా బ్రతకాలో తెలియుట లేదు. అతడు ప్రభువును ప్రార్ధించాడు. కాని ప్రభువు అతనికి సమాధానం చెప్పినట్లు డేవిడ్‌కు నమ్మకం కుదరలేదు. అందువల్ల అతడు పాస్టర్‌ ఇశ్రాయేలు వద్దకు వెళ్ళాడు.

పాస్టర్‌ ఇశ్రాయేలుగారు చాలా వృద్ధుడు. జుట్టంతా తెల్లగా నెరిసి పోయింది. డేవిడ్‌ అతని వద్దకు వచ్చి పాస్టర్‌ గారూ ! నేను దేవునిని ప్రార్ధించాను. కాని ఆయన ఏమీ సమాధానం చెప్పుట లేదు అన్నాడు. అందుకు ఇశ్రాయేలు గారు డేవిడ్‌కి మెల్లని స్వరంతో ఏదో ఒక సమాధానం చెప్పారు. కాని డేవిడ్‌కు వినపడలేదు. ఏమన్నారు? అని మూడు అడుగులు ముందుకు వేసి ఆయనకు దగ్గరగా వచ్చాడు.

మరల ఇశ్రాయేలు గారు ఏదో చెప్పారు. అయినా డేవిడ్‌కు వినబడలేదు. 'సారీ మీరు చెప్పింది నాకు వినబడలేదు' అని డేవిడ్‌ చాలా ముందుకు వచ్చి ఇశ్రాయేలు గారి నోటికి అంగుళం దూరంలో తన చెవిని పెట్టి 'ఏమన్నారు' అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు గారు ' ఒక్కొక్క సారి దేవుని స్వరం మనకు మెల్లగా వినబడుతుంది. అది వినుటకు మనం ఆయనకు దగ్గరకు వెళ్ళాలి' అన్నాడు.

డేవిడ్‌కు ఇప్పుడు అర్ధం అయినది. మనం కూడా మన సమస్యలకు దేవుడు ఉరిమే మేఘం వలె సమాధానం చెప్పాలని ఆశిస్తాం. కాని దేవుడు మృదువుగా మెల్లగా మాట్లాడుతాడు. ఎందుకు మెల్లగా మాట్లాడుననగా ఎవరైనా మెల్లగా మాట్లాడినప్పుడే మనము దానిని వినుటకు ఎక్కువ ఆసక్తిని చూపుతాం. దేవుని మాట వినుటకు మనము ఆయనకు దగ్గరగా వెళ్ళవలెను. అప్పుడు ఆయన మన సమస్యలకు చెప్పే జవాబు మనము వినగలము. అంతకంటే మరొక లాభము ఏమనగా దేవునికి సమీపముగా మనము ఉంటాము. - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

మత్తయి 16:26 మనిషి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? లేదా మనిషి తన ఆత్మకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి?

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech