Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

పడవలో నిద్ర
22 October 2014

పడవలో నిద్ర

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీ 5 : 14.

కొన్ని సంవత్సరముల క్రితము నయాగరా జలపాతం వద్ద ఒక యువకుడు గైడ్‌గా నియమించ బడ్డాడు. ఒక రోజు అతనికి పని ఏమీ లేనందువల్ల తన పడవను ఒడ్డుకు కట్టివేసి పడవలో పడుకొని నిద్రకు ఉపక్రమించాడు. నీటిలో ఉన్న పడవ అలలకు అటు ఇటు ఊగుచున్నందు వలన పడవ ఊయల వలె యుండి అతనికి చక్కని నిద్ర వచ్చింది.

అతడు పడవను ఒడ్డుకు ఉన్న బొంగుకు గట్టిగానే కట్టాడు. కానీ పడవ అటు ఇటు ఊగుట వలన ఆ త్రాడు ముడి వదులై బొంగు నుండి జారిపోయి పడవ జలపాతంవైపు వెళ్లుచున్నది. ఒడ్డున ఉన్న ప్రజలు గమనించి అతనిని మేల్కొల్పుటకు గట్టిగా అరిచారు. కానీ అతనికి మెలుకువ రాలేదు. పడవ వెళ్లే దారిలో ఒక పెద్ద బండ ఉన్నది. పడవ ఆ బండకు గుద్దుకొని ఆగింది. అప్పుడైనా అతడు లేచి బండ మీదకు దూకి తన ప్రాణాన్ని రక్షించుకుంటాడేమో అని ఒడ్డున ఉన్న ప్రజలు కేకలు వేసారు.

అయితే అతడు నిద్రలో ఉన్నాడు. జరగబోయే ప్రమాదం అతనికి తెలియ లేదు. కొంతసేపటికి పడవ బండను తప్పించుకుని మరలా నీటి ప్రవాహంలో కొట్టుకొని పోసాగింది. జలపాతం యొక్క పెద్ద శబ్దము అతనికి వినబడి మెలకువ వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం అయింది. అతని పడవ జలపాతంలో పడి అతడు మరణించాడు. ఎంత విచారకరము!

అనేకులు అట్లే తమ పాపమునందు కూడా నిద్రించుచున్నారు. నెమ్మదిగా తెలియకుండా అనాలోచితముగా మరణమునకు లోనగుచున్నారు. ఈ లోక సుఖ భోగములు వారిని ఊయలలో ఉంచినట్లును, అంతయూ సుఖముగా ఉన్నది అను భ్రమకు లోనగునట్లును చేయుచున్నది. మురికి గుడ్డల వంటి తమ నీతి తమకు రక్షణ ఇచ్చునని కొందరి ఉద్దేశ్యము. తన పూర్వికులు అనుసరించిన మతము తమకు రక్షణ ఇచ్చునని కొందరి ఉద్దేశ్యము. అందరూ పడవలో నిద్రపోవుచున్న వ్యక్తిని పోలియున్నారు.

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. 2 కొరింథీ 4 : 4. మీరు క్షేమముగా స్థిరులైయున్నారా? లేదా అలలచే ఇటు అటు కొట్టబడుచున్నారా? యేసు ప్రభువుని అంగీకరించినారా? లేదా రాబోవు వినాశనమునకు చేరువగా ఉన్నారా? ఇంకను రక్షించబడనిచో మీరు నిద్రనుండి వెంటనే మేలుకొనండి. తరువాత ఎప్పుడో అంగీకరించ వచ్చును అనుకుంటే అప్పటికి ఆలస్యమై మీరు నిద్రమేలుకొనే సరికి మరణము మిమ్ములను మ్రింగ వచ్చును.

ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటి వారును రక్షణ పొందుదురు అపొస్త. కార్య. 16 : 31. - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

సామెతలు 27:19 నీరు ముఖాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఒకరి జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech