Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

అగాపే
13 November 2014

అగాపే

విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథి 13:13 1960లో హాలెండ్ కు చెందిన ఆండ్రూగారు రుమేనియా దేశం లోనికి కొన్ని బైబిళ్లను దొంగతనముగా తీసుకొని వెళ్లిరి. ఆయన ఒకహోటల్ లో గది తీసుకుని రహస్య క్రైస్తవులను కలుసుకొనుటకు మార్గము తెరువమని ప్రార్థించిరి. వారం దినములు గడిచిన తర్వాత హోటల్ గుమస్తా వద్దకు వెళ్లి 'ఇక్కడ ఏదైన చర్చి ఉన్నదా? అని ప్రశ్నించిరి.
అందుకతడు 'ఇక్కడ చర్చి ఏమీ లేదు. పైగా వీరి భాష నీకు తెలియదు' అనెను. క్రైస్తవులందరూ ఒక భాష మాట్లాడుకొందురని నీకు తెలియదా? అని ఆండ్రూ అనెను. అందుకు గుమాస్తా ఆశ్చర్యముతో 'అటులనా! నాకు తెలియదే? ఆ భాష ఏమి?' అని ప్రశ్నించెను. 'దాని పేరు అగాపే' అని ఆండ్రూ గారు సమాధానమిచ్చిరి. అది ప్రపంచంలో అత్యంత సుందరమైన భాష అని ఆండ్రూ గారు చెప్పిరి.

ఆండ్రూగారు ఆ గ్రామమంతయూ తిరిగి చివరకు ఒక సంఘమును కనుగొనిరి. ఆండ్రూగారికీ ఆ సంఘసభ్యులకూ అనేక యూరపు భాషలు వచ్చిననూ ఇద్దరికీ వచ్చిన భాష ఏదీ లేనందువలన వారందరూ ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచూ కూర్చొనిరి. తాను ఎంతో కష్టపడి తెచ్చిన బైబిళ్లను వీరికి ఇవ్వవలెనా? వీరు నిజముగా క్రైస్తవులేనా? లేక గవర్నమెంటు వారి ప్రత్యెక గూడాచారులా? అని అండ్రూ గారు ఆలోచించుచుండిరి.

అంతలో అండ్రూగారికి ఒక వ్యక్తి వద్ద బైబిలు కనపడెను. అండ్రూగారు తన జేబులో నుండి డచ్ బైబిలు బయటకు తీసి 1 కొరింథీ 16:20 తెరచి ఆ రిఫరెన్సు వారికి చెప్పెను. వారందరూ అతని మాటను అర్థం చేసికొనిరి. గబగబ తమ రుమేనియా బైబిళ్లను తీసి ఆ వాక్యమును చదివిరి.

'పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకొనుడి' వారందరి ముఖములు వెలిగెను. వారిలో ఒకడు సామెతలు 25:25 తీసి ఆండ్రూ గారికి చూపెను. దప్పిగొనినవారికి చల్లని నీరు ఎట్లుండునో దూరదెసములనుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును'.

ఈ విధముగా 30 నిముషాల పాటు బైబిలులోని వాక్యములను ఒకరికి ఒకరు చూపుకొనుచు వారు సంభాషించుకొనిరి. వారు ఆనందము పట్టలేక కన్నీళ్లు వచ్చు వరకు నవ్విరి. ఆండ్రూ గారు తాను నిజక్రైస్తవులను కనుగొంటినని గ్రహించి దేవునికి వందనములు చెల్లించి తాను తెచ్చిన బైబిళ్లను చూడగానే వారు ఆనందముతో గంతులు వేసిరి.

ఆ రోజు రాత్రి ఆండ్రూగారు తమ హోటల్ కు వెళ్లినప్పుడు గుమాస్తా ఆయనను సమీపించి 'అయ్యా నిఘంటువులో అగాపే అంటే ఏమిటో చూచినాను. ఆ పేరుతో ఏ భాషా లేదు. ఆ మాటకు అర్థం గ్రీకు భాషలో ప్రేమ అని నిఘంటువులో ఉన్నది' అనెను. అందుకు ఆండ్రూ గారు 'కరెక్ట్, మేము మధాహ్నం అంతా ఆ భాషలోనే మాట్లాడుకొన్నాము' అనెను.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆదికాండము 2: 7 అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ధూళి మనిషిని ఏర్పరుచుకున్నాడు మరియు అతని నాసికా రంధ్రాలకు జీవన శ్వాసను ఇచ్చాడు, మరియు మనిషి ఒక జీవి అయ్యాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech