Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

ADD
10
తాజా వార్తలు
• Live NEWS

మహిమ శబ్ద七√

Video's

100%

ఖాతాదారుల సంతోషం

2.86K

సందర్శకులు

151

మా చందాదారులు

143.19K

మా పత్రిక పాఠకులు
చివరికి వచ్చిన వెలుగు
వాక్యసందేశము

చివరికి వచ్చిన వెలుగు

ఒక చిన్న గ్రామంలో దానియేలు అనే యువకుడు ఉండేవాడు. అతను కష్టపడి వ్యవసాయం చేసేవాడు,ప్రతిరోజు చర్చికి వెళ్లేవాడు,పాస్టర్ గారి ప్రసంగాలు ఆయన్ని ప్రభావితం చేశాయి. పాస్టర్ గారి ప్రసంగా: కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. జీవితములో బాధకరమైన పరిస్థితి ఆశాభంగం, సిగ్గుపడే పరిస్థితి. అనగా, చేయగలనని నమ్మకముతో ముందుకు వెళ్ళి చేయలేక నవ్వులు పాలైన పరిస్థితి. నిన్ను ఓర్వలేక కావాలనే నీకంటే కింద స్థాయి వ్యక్తిని నీపైన అధికారిగా పెట్టినప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఎదురౌతుంది. అందుకనే దావీదు నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుమని ప్రార్ధించాడు. పౌలు అయితే నాకు కలిగిన శ్రమలలో దేవుడు విడిపిస్తాడని నిరీక్షణ కలుగియున్నాను కాబట్టి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని చెప్తున్నాడు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం ఊహించలేము. దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరిని చెరిపాడు. దావీదుని తన కుమారుడే చంపుటకు వచ్చినప్పుడు రాజ్యం వదిలిపెట్టి పారిపోయాడు. దావీదు ఉపపత్నులను అందరు చూస్తుండగ తన కుమారుడైన అబ్షాలోము చెరిపాడు. ఈ పరిస్థితులలో దావీదు గురించి ఇశ్రాయేలు ప్రజలు ఏవిధముగ మాట్లాడుకున్నారో బైబిల్ లో వ్రాయబడిలేదు కాని, ఎక్కడ చూసిన దావీదు కుటుంబము గురించి తెలిసి తెలియక రకరకాలుగా మాట్లడుకొనియుండి ఉంటారు. దావీదు జీవితములో ఇది అవమానకరమైన, సిగ్గుకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుండి భయటకు వచ్చే అవకాశమే లేదు. తప్పు చేసిన దావీదు పశ్చాత్తాపపడి దేవుని మీద నిరీక్షణ కలిగియున్నాడు. ఆ నిరీక్షణ దావీదును సిగ్గుపరచలేదు కాని తిరిగి అదే రాజ్యం మీద రాజుగా పరిపాలన చేసాడు. ప్రియ విశ్వాసి! అనుకోని పరిస్థితుల వలన శ్రమలలో చిక్కుకున్నావా? నీ శత్రువు నీ పైన అధికారం చెలాయిస్తున్నాడా? నిందలకు, అవమానముల వలన తలదించుకున్నావా? భయపడకు అద్భుతమైన వాగ్ధానం నీకొరకు ఉంది. సామెతలు 23:18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు. కీర్తన 22:4-5 మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి. ప్రతికూల పరిస్థితులలో దేవుని పైన నమ్మకము ఉంచుటవలన రక్షణ కలుగుతుంది, విడుదల పొందుకుంటాము, సిగ్గుపడే పరిస్థితి నుండి విడిపించబడతాము. ఒకవేళ నీకున్న సమస్తము కోల్పోవచ్చు. ఆరోగ్యం, ఆస్తి, ఆత్మీయ జీవితం మొదలగు అన్నింటిలో క్షీణించిపోవచ్చు కానీ, క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే తిరిగి పొందుకుంటాము. మన నిరీక్షణకు ఆధారం యేసే. కొద్ది రోజుల్లో... ఒక సంవత్సరం వరుసగా కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. అప్పులు పెరిగాయి. అతనిపై గ్రామస్థులు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. "నీ దేవుడు నిన్ను కాపాడతాడని చెప్పావు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?" అని అవమానించారు. అంతేకాకుండా అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. కుటుంబ సభ్యులు నిరాశలో మునిగిపోయారు. అన్నీ కోల్పోయినట్లు కనిపించినా, దానియేలు మాత్రం ప్రతి ఉదయం మోకాళ్లపై నిలబడి ప్రార్థించేవాడు. "ప్రభువా! నా నిరీక్షణ నీవే. నేను నిన్ను విడువను" అని కన్నీళ్లతో దేవుని ఎదుట మొరపెట్టుకునేవాడు. కొన్ని నెలల తరువాత ఊహించని విధంగా వర్షాలు కురిశాయి. అతని పొలంలో పంటలు సమృద్ధిగా పండాయి. ప్రభుత్వ సహాయం కూడా అందింది. అప్పులు తీర్చగలిగాడు. అతని ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగైంది. ఒకప్పుడు అతన్ని అవమానించినవారే ఇప్పుడు, "నీ విశ్వాసమే నిన్ను నిలబెట్టింది" అని ఒప్పుకున్నారు. అప్పుడు దానియేలు చిరునవ్వుతో ఇలా అన్నాడు: "నేను దేవుని సమయాన్ని ఎదురు చూశాను. ఆయన నన్ను సిగ్గుపడనివ్వలేదు. నా ఆశ భంగం కాలేదు." పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచినవారు చివరికి రక్షణను, విడుదలను, గౌరవాన్ని పొందుతారు. “నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును; నీ ఆశ భంగము కానేరదు.”

మరింత 5

డైలీ బ్రెడ్స్

యేసయ్యతో అనుదినము

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు (కీర్తనలు 46:1).

"దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు గదా" అని ప్రశ్నిస్తూ ఉంటాం కాని, ఆయన పద్ధతి అది కాదు.
నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను విడిపిస్తాడు.
"ఆపదలో నేను సహాయం చేస్తాను.
అతణ్ణి విడిపిస్తాను" అన్నదే ఆయన వాగ్దానం.
నీ ఆపదలో ఆయన పగలు, రాత్రంతా నీతో ఉంటాడు.
ఆ తరువాత నిన్ను దానిలోనుండి బయటకు నడిపిస్తాడు.
నువ్వు అసహనంగా, అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు.
నిమ్మళించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు.
చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు.
అవి మనలను జ్ఞానవంతుల్ని చేయ్యడానికి ఉపయోగపడతాయి.
ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దానిద్వారా మనకు కలుగుతుంది.
దానిలో నిజమైన ఆనందం ఉంది.
దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు.
ఆపదల్లోంచి ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా వాటిలోనే మన దేవునిలోనే మన శాంతి, మన విశ్రాంతి ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మరచిపోలేము.
"దేవుడు నిన్ను పరీక్షించే సమయం, ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ను నువ్వు పరీక్షించడానికి మంచి సమయం.
నీ శ్రమలవల్ల నువ్వెంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయననుండి రాబట్టడానికి అదే అదను" పరీక్షలనుండి బయటపడడానికి రెండు మార్గాలున్నాయి.
ఒకటి, ఆ ఆపదను వదిలించుకుని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం.
రెండోది, ఆ ఆపద దేవునినుండి వచ్చిన సవాలేనని గుర్తించి దానిద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం,దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం.
ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడౌతాడు.
మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైవవుతాయి.
మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం.
-id:252
ఎడారిలో సెలయేర్లు.
- శ్రీమతి చార్లెస్ కౌమన్.
సరిదిద్దుకొనుట
ఉపమానములు

సరిదిద్దుకొనుట

19వ శతాబ్దము ఆరంభములో జపాన్‌ దేశము కొరియాను ఆక్రమించుకొన్నది. అప్పటివరకు అనేక మంది కొరియాను ఆక్రమించుకొన్నను జపాన్‌ వారు బహుక్రూరముగా ప్రవర్తించిరి. స్త్రీల యెడలను, పిల్లల యెడలను బహుపైశాచికముగా ప్రవర్తించిరి. వారిలో ఎక్కువగా కష్టపడినది నష్టపోయినది క్రైస్తవులే. కొరియాను ఆక్రమించుకొన్న వెంటనే విదేశ మిషనెరీలందరూ కొరియాను విడిచి వెళ్ళవలెనని జపాన్‌ వారు ఆజ్ఞాపించిరి. జయించిన వారు చర్చిలను మూత వేసినచో క్రైస్తవ్యము అంతరించునని భావించిరి. రోమన్‌ ప్రభుత్వము వారు మొదటిగా ఆ పనిని చేసిరి. కాని ఎవరును క్రైస్తవ్యమును అంతమొందించలేక పోయిరి.

జపాన్‌ వాళ్ళు కొరియాలోనున్న సంఘ నాయకులను ఖైదు చేసిరి. సంఘస్తులను ఆరాధన చేసికొనుటకు కూడుకొనకూడదని ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞలు ధిక్కరించిన వారిపై ఎంతో పాశవికముగా దాడిచేసిరి. బాధించబడినవారి హృదయములో జపాన్‌ వారి యెడల ఏహ్యత కలిగెను. ఒక పాస్టర్‌ గారు జపాన్‌ పోలీసు అధికారి వద్దకు పదే పదే వెళ్ళి తాము సంఘముగా కూడుకొని ప్రభువును ఆరాధించుకొనుటకు అనుమతి ఇవ్వవలసినదని కోరెను. అతడు పదే పదే గోజాడుటవలన అతని మనవి అంగీకరించబడెను. ఆదివారమునాడు అనేక కొరియా కుటుంబముల వారు ఆరాధించుటకు వెళ్ళుచుండగా జపాన్‌ అధికారులు వారిని హేళనగా చూచుచుండిరి.

మరింత 542

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

మహిమ శబ్ద౦

ఆధ్యాత్మిక పత్రిక

Signup for Free

Subscribe Newsletter

Subscribe to our latest news to be updated

దయచేసి చెప్పండి మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం

మీరు మా సేవలు ఇష్టపడుతున్నారా?

వార్తలు

ఆశ్చర్యకరమైన, అద్భుతమైన

బైబిల్ వచనాలు

నిశ్శబ్దముగా ఉండుటకు ఒక సమయము, మాటలాడుటకు ఒక సమయము కలదు.
-ప్రసంగి 3:7

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.