Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

మనకు బదులుగా
01 March 2019

మనకు బదులుగా

మన యతిక్రమక్రియలనుబ్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బ్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. యెహోవా మన మందరి దోషమును అతనిమీద మోపెను. - యెషయా 53:5,6చాలా కాలము క్రితము గ్రీకు దేశంలో అనేక చిన్న చిన్న సంస్థానములు ఉండేవి. క్రేతు సంస్థానమును బాసిల్‌ అనే రాజు పరిపాలించేవాడు. అతని తండ్రి యాంబ్రస్‌. బాసిల్‌ ప్టుిన తరువాత  యాంబ్రస్‌ భార్య చనిపోయి నందువలన అతడు తబిత అనే స్త్రీని మరలా వివాహము చేసుకొన్నాడు. తబితకు కడే అనే కుమారుడు జన్మించాడు.  తల్లి లేని బాసిల్‌ను సవతి తల్లి అయిన తబిత ప్రేమగా పెంచింది.

యాంబ్రస్‌ అనంతరం బాసిల్‌ రాజు అయ్యాడు. జ్యేష్ఠుడు అయినందువల్ల బాసిల్‌ ప్టాభిషిక్తుడు కావడం కడేకు నచ్చ లేదు. అందుచేత ప్రక్క రాజ్యములోని రాజుతో చేతులు కలిపి అన్న పైనే యుద్ధము చేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకొన్నాడు. ప్రక్క  రాజైన పాబ్లో అందుకు సమ్మతించాడు. సహకరిస్తానని అన్నాడు. కానీ బాసిల్‌ను యుద్ధములో జయించాలంటే సైనిక వివరాలు ఉన్న పుస్తకము సంపాదించమని పాబ్లో కోరాడు.

కడే రాజ్యాధికారము కోసము కలవరిస్తూ ఆ పుస్తకము ఎలాగైనా తీసుకొని రమ్మని తన తల్లిని పురమాయించాడు. తబితకు ఆ పని ఇష్టము లేకపోయినా కడేను సంతోష పరచుటకు ఆ పుస్తకమును దొంగిలించింది. పుస్తకము పోయిన విషయం బాసిల్‌కు తెలిసింది. కానీ ఎవరు దొంగిలించారో తెలియ లేదు. తన సభలో 'ఆ పుస్తకము మన శత్రు రాజుల చేతిలో పడితే మన రాజ్యానికి ఎంతో ప్రమాదము. శాంతి భద్రతలు లోపిస్తాయి. యుద్ధము జరిగితే సైనికులతో పాటు అనేక మంది పౌరులు కూడ మరణిస్తారు. ఆ పుస్తకము ఎవరు దొంగిలించారో వారిని పట్టుకొని ప్రజలందరి ముందు 50 కొరడా దెబ్బలు క్టొాలి. వారు ఎవరైనా సరే క్షమాపణ ఉండదు' అన్నాడు.

చారులు దర్యాప్తు మొదలు ప్టోరు. రాజ భవనాన్ని కాపలా కాసే భటులను విచారించారు. ఎవరెవరు ఆ గదిలోనికి వెళ్లారో దర్యాప్తులో తెలిసింది. చివరికి రాజ మాత తబిత ఈ దొంగతనము చేసినదని స్పష్టంగా తెలిసింది. రాజ్యమంతా ఈ వార్త దానావలంలా వ్యాపించింది. ప్రజలందరూ బాసిల్‌ ఏమి చేస్తాడో అని చర్చించు కుంటున్నారు. రాజ్య క్షేమాన్ని కోరి తన స్వంత కుటుంబము వారినే శిక్షిస్తాడా? లేక క్షమిస్తాడా?

తబితను బంధించి రాజు ముందు నిలువబ్టెారు. తబిత ఏడుస్తూ ఆ పుస్తకము తన వద్దే ఉన్నదనీ, ఇక ముందు ఎన్నడూ పొరపాటు చేయననీ, విశ్వాస పాత్రంగా ఉంానని చెప్పింది. కడే కూడ రాజ్య కాంక్ష లేకుండా జీవిస్తానని ప్రమాణం చేసాడు. వారి కంఠంలోని నిజాయితీనీ, పశ్చాత్తాపమునూ బాసిల్‌ గుర్తించాడు. కుటుంబ సభ్యునిగా వారిని శిక్షించ లేడు. రాజ్యాధికారిగా వారిని విడుదల చేయలేడు.

తీర్పు మరునాికి వాయిదా వేసాడు. ఆ రోజంతా బాసిల్‌ ఏమీ తినలేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. తల్లిని శిక్షించ లేడు, ఒక వేళ శిక్షిస్తే వృద్ధురాలైన తల్లి 50 కొరడా దెబ్బలను తట్టుకొన లేదు, అవమానంతోనూ, బాధతోనూ ఆమె మరణించ వచ్చును. క్షమించి వదిలిపెడితే రాజ్యమంతా తనను దోషి అంటుంది. రాజ్య క్షేమము కంటే కుటుంబ క్షేమమే బాసిల్‌కు ముఖ్యమైనది అని నింద వేస్తారు. శత్రువుల ముందు తల వంపులుగా ఉంటుంది. ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే తరువాత రాజ్య నిర్వహణ కష్టమవుతుంది. మరునాడు రాజు ఆస్థానము ప్రజలతో నిండిపోయింది. బాసిల్‌ సింహాసనముపై కూర్చున్నాడు. అతని ముందు తబిత, కడే తలవంచుకొని నిలబడ్డారు. కొరడా పట్టుకొని కొట్టే వ్యక్తిని రమ్మని బాసిల్‌ చెప్పాడు. కండలు తిరిగిన ఒక వ్యక్తి కొరడా పట్టుకొని రాజు ముందు నిలబడ్డాడు. బాసిల్‌ అతనితో 'నా రాజ్యంలో బంధు ప్రీతి లేదు. న్యాయం, ధర్మం నేను తప్పను. నీవు నా తల్లి అయిన తబితను 50 కొరడా దెబ్బలు కొట్టు. ప్రజలందరూ ఈ శిక్ష అమలు అగుటను చూడాలి' అన్నాడు. అతని గొంతు గద్గదమైనది. తీర్పు చెప్పిన వెంటనే బాసిల్‌కు దుఃఖం వచ్చింది. అతడు రెండు చేతులతో తన ముఖము కప్పుకొని తన కన్నీరు ఇతరులకు కనబడకుండా దాచుకొన్నాడు.

కొరడా పట్టుకొన్న వ్యక్తి తబితను కొట్టుటకు ఆమెను సమీపించాడు. అతడు కొరడా ఎత్తగానే బాసిల్‌ లేచి 'ఆ 50 దెబ్బలు నన్ను కొట్టు' అన్నాడు. హాలంతా నిశ్శబ్దం అయిపోయింది. కొరడా పడుతున్న శబ్దము తప్ప అరగంట వరకు మరి ఏ శబ్దము అక్కడ వినబడ లేదు. అరగంట తరువాత రక్తము ఓడుతున్న బాసిల్‌ను వైద్యులు రాజ భవనము లోనికి తరలించారు. అక్కడ ఉన్న వారందరూ కన్నీరు ప్టోరు.

బాసిల్‌ చాల కాలము తరువాత కోలు కున్నాడు. ఈ చర్య వల్ల అతని ప్రతిష్ఠ ఎంతో ఇనుమడించింది. తన న్యాయ తీర్పు ద్వారా ప్రజల యొక్క విశ్వాసాన్ని బాసిల్‌ చూరగొన్నాడు. పాపము వలన మనము కూడ తబితవలె శిక్షను పొందవలసిన వారము. మన పాప శిక్షను మనకు బదులుగా యేసు ప్రభువు కల్వరి సిలువలో భరించెను.

- డాక్టర్‌ పి.బి.మనోహర్‌, 98 48 36 36 38

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech