mahimasabdam.tv@gmail.com
+91 9390209376

యథార్థముగా ప్రవర్తించు వాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. సామెతలు 14 : 2
మైఖేల్, స్మిత్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగస్తులు. మంచి వారినీ, యదార్ధపరులనీ బ్యాంకులో వారికిద్దరికీ మంచి పేరు ఉన్నది. ఒకరోజు బ్యాంకు వారు కొన్ని లక్షల రూపాయలను వేరొక నగరమునకు తరలించుటకు ఏర్పాటు చేసిరి. డబ్బు అంతటినీ 4 పెట్టెలలో పెట్టి తాళములు వేసి సీలు వేసిరి. వాటిని గుర్రపు బగ్గీలలో పెట్టి వాటికి రక్షణగా మైఖేల్‌నూ, స్మిత్‌నూ పంపిరి. పగలంతయు ప్రయాణించి రాత్రి అగుసరికి వారు ఒక గ్రామమును చేరిరి.
ఆ రాత్రికి ఆ గ్రామములో బసచేయవలెనని వారు ఒక ఇంటి వారిని సమీపించి ఒక గదిని తమకు కేటాయించమని వేడుకొనిరి. ఆ గృహస్తు వారికి ఒక గదిని ఇచ్చెను. డబ్బు ఉన్న 4 పెట్టెలను ఆ గది లోనికి చేర్చిరి. పోలీసు వారును, బగ్గీలను తోలువారును బగ్గీలలోనే నిద్రించుటకు సిద్ధపడిరి.
తమ వద్ద నున్న ఆహారమును తినిన తరువాత మైఖేల్ నిద్రకు ఉపక్రమించుచూ 'స్మిత్! ఇప్పుడు టైము తొమ్మిది గంటలు అయినది. నీవు మెలకువగా ఉండి పెట్టెలను కాపలా కాయుము. ఒంటి గంటకు నన్ను లేపు. అప్పటి నుండి తెల్లవారే వరకు నేను కాపలాగా ఉంటాను. ఈ ఇంటి వారిని నమ్మలేము. వారు మనకు హాని చేసి ధనము దొంగిలించవచ్చును. ఏదైనా ప్రమాదం వస్తే పిస్టల్‌తో గాలి లోనికి కాల్పులు జరుపు. అప్పుడు మన పోలీసులు లోనికి వస్తారు' అని చెప్పెను. స్మిత్ సమ్మతించి నిద్ర పోకుండా ఉండుటకు గదిలో అటూ ఇటూ తిరుగుచుండెను.
మైఖేల్‌కు హఠాత్తుగా మెలకువ వచ్చింది. టైము చూస్తే 5 గంటలు అయినది. 'అయ్యో నన్ను లేపకుండానే స్మిత్ తెల్లవారూ కాపలా కాసాడా?' అనుకొంటూ స్మిత్ వైపు చూసే సరికి అతడు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. మైఖేల్‌కు కంగారు పడ్డాడు. అతనికి బి.పీ. పెరిగింది. పెట్టెల వైపు చూసాడు. అన్ని పెట్టెలు భధ్రముగా ఉన్నవి. స్మిత్‌ను లేపాడు. 'నన్ను లేపకుండా నీవు నిద్ర పోతున్నావేమి?' అని ప్రశ్నించాడు.
స్మిత్ చిరునవ్వు నవ్వుతూ 'ఏమీ ఫర్వాలేదు. రాత్రి నీవు నిద్రపోయిన తరువాత పది గంటలకు ఇంటి వారు ఇంకా దీపము ఆర్పలేదు. కిటికీకి ఉన్న రంధ్రము ద్వారా వారు ఏమి చేస్తున్నారా? అని చూసాను. ఈ కుటుంబము వారు కూర్చుని కుటుంబ ప్రార్థన చేసుకొంటున్నారు. భార్య బైబిలు చదువుచుండగా భర్త ఆ భాగములను వివరిస్తున్నాడు. తరువాత అందరూ ప్రార్థన చేసుకొన్నారు. ఇటువంటి వారి వలన మనకు అపాయము లేదని నేను లైటు ఆర్పి నిద్రపోయాను. నా అంచనా కరక్టే' అన్నాడు. - డా||పి.బి.మనోహర
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)








.jpg)
 dad.png)










.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech