Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

అనుమానము
09 November 2014

అనుమానము

నీ మాటను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు . నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదురు . మత్తయి 12:37

ఒక అంబాసిడర్ కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్నది. ఆ కారు వెనకే ఒక మారుతి జెన్ వచ్చి ఆగినది. రెడ్ లైట్ ని చూస్తూ మారుతిలో ఉన్న స్త్రీ "ఈ వెధవ సిగ్నల్స్ ఒకటి. ప్రయాణాన్ని సజావుగా సాగనివ్వవు' అని గట్టిగా అన్నది. అంతలో గ్రీన్ లైట్ వెలిగింది. అంబాసిడర్ కారులో ఉన్న వ్యక్తి సీరియస్ గా ఏదో కాగితాన్ని చూస్తున్నాడు. అందువలన అతడు వెంటనే స్టార్ట్ చేయలేదు. వెనుక ఉన్న మారుతిలో ఉన్న స్త్రీ గట్టిగా హారన్ నొక్కింది. 'స్టార్ట్ చేయరా సన్నాసీ ' అని అరచింది. కొన్ని కార్లు, స్కూటర్లు తమను దాటుకొని వెళ్లిపోతున్నాయి. అంబాసిడర్ వెనుకనే తన కారు ఆపినందుకు ఆమె తనను తానే నిందించుకొనుచూ ముందు ఉన్న కారు స్టార్ట్ చెయ్యనందుకు అతనిని బూతులు తిట్టసాగింది. అంతలో గ్రీన్ లైట్ఎల్లోగా మారినది. 'ఈ దుర్మార్గుడు ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. మరల రెడ్ లైట్ వస్తుందేమో. ఒరే, సన్నాసీ త్వరగా స్టార్ట్ చెయ్యరా వెధవా' అని మరల అరచింది.
ఇంతలో ఆ యువకుడు ఎల్లో లైట్ చూసాడు. వెంటనే తన కారు స్టార్ట్ చేసాడు. అతడు వెళ్లాడో లేదో, డేంజర్ లైట్ పడింది. ఆమె అసహనంగా 'వెధవ కారులో కూర్చుని నిద్రపోతున్నాడు. పనికి మాలిన వెధవలందరూ డ్రైవర్లయితే ఇలాగే ఉంటుంది' అంటూ ఇంకా బూతులు తిట్టుచుండగా ఆమె 'హేండ్సప్' అనే మాట విని తల ఎత్తి చూసింది. ఒక పోలీసు ఆఫీసరు, ఒక లేడీ కానిస్టేబుల్ ఆమెకు కన్పించారు. పోలీసు ఆఫీసరు చేతిలో రివాల్వరు ఉన్నది. ఆయన తీక్షణంగా చూస్తూ 'ఇంజన్ ఆపుచేసి కారు దిగు' అన్నాడు. ఆమె బిత్తర పోయింది. ఏమి మాట్లాడాలో ఆమెకు తోచలేదు. కారు ఆపుచేసి క్రిందకు దిగింది. లేడీ కానిస్టేబుల్ ఆమెను తోసుకుంటూ పోలీసు జీపులోకి ఎక్కించారు. 5 నిముషాలలో ఆమె పోలీసు స్టేషన్ లో ఉన్నది. ఇద్దరు అధికారులు వచ్చి ఆమె చేతి వ్రేలి ముద్రలను తీసుకున్నారు. ఆమెను ఫోటో తీసారు. ఆమెను ఒక సెల్ లోనికి నెట్టి తాళం వేసారు.
రెండు గంటల తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి ఆమెను బయటకు తీసుకొని వచ్చినది. అతడు ఆమె బేగ్, కారు తాళం చేతులు ఇస్తూ 'జరిగిన దానికి మేము చాలా చింతిస్తున్నాము. నేను మీ కారు వెనుకనే జీపులో ఉన్నాను. 'యేసే నా రక్షకుడు' అనే స్టిక్కర్ చాలా బాగుంది అనుకొంటున్నాను. దాని క్రిందే మీరు 'యేసు అయితే ఏమి చేస్తారు?' [what would Jesus do] అనే స్టిక్కర్ అంటించారు. మీ కారు స్టీరియోలో నడిపించు నా నావ అనే పాట వస్తున్నది. కాని మీరు ముందు ఉన్న కారు డ్రైవరును తిట్టుచున్నపుడు మీరు పలికిన మాటలు అన్నీ బండబూతులు. అందువలన మీరు కారు దొంగిలించారని అనుకొన్నాను. అయామ్ వెరీ సారీ, మీరిక వెళ్లవచ్చు' అన్నాడు.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

మత్తయి 16:26 మనిషి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? లేదా మనిషి తన ఆత్మకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి?

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech