Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

పులిని చూచి
16 May 2014

పులిని చూచి

శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. 1 కొరింథీ 12 : 17

పాస్టర్లు ఎలా ప్రసంగం చేయాలి అనే అంశముపై తర్ఫీదు ఇచ్చుటకు ఒక సెమినార్‌ను ఏర్పాటు చేశారు. ప్రవీణ్‌ ఆ సెమినార్‌కు హాజరయ్యాడు. వారికి బోధించుటకు వచ్చిన డోనాల్డ్‌ గారు ప్రసంగంలో హాస్యము కూడా అవసరం. అప్పుడప్పుడు చెప్పే కొన్ని జోక్‌లు నీ ప్రసంగమును శ్రద్ధగా వినునట్లు చేయును' అని చెప్పాడు. అందుకు ఉదాహరణగా  డోనాల్డ్‌ గారు ఒక కథను చెప్పారు. 'నా జీవితంలో అతి సంతోషకరమైన సంవత్సరములు ఒక స్త్రీ కౌగిలిలో గడిచాయి. కాని ఆమె నా భార్య కాదు' అన్నాడు. ఈ మాటలను వింటున్న పాస్టర్లందరు ఉలిక్కిపడ్డారు.

డోనాల్డ్‌ గారు ఎంతో గొప్ప ప్రసంగికులు. పేరు ప్రతిష్టలు ఉన్నవారు. ఆయన పబ్లిక్‌గా వేరే స్త్రీ కౌగిలిలో ఉన్నాను అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. గుసగుసలు తగ్గిన తరువాత  డోనాల్డ్‌ గారు 'ఆమె ఎవరంటే నా తల్లి' అన్నారు. అక్కడ ఉన్నవారంతా ఫకాలున నవ్వారు. తరువాత ఆయన ప్రసంగం కొనసాగింది.

 ఈ జోక్‌ను విన్న ప్రవీణ్‌ తన చర్చిలో కూడా ఈ సంగతి చెప్పి అందరిని ఆశ్చర్య చకితులను చేయాలని అనుకున్నాడు. డోనాల్డ్‌ గారు అన్నట్లే 'నా జీవితంలో అతి సంతోషకరమైన సంవత్సరములు ఒక స్త్రీ కౌగిలిలో గడిచాయి కాని ఆమె నా భార్య కాదు' అన్నాడు. సంఘస్థులందరు ఆశ్చర్యపోయారు. రెండు నిమిషములు ఆగిన తరువాత   ప్రవీణ్‌ పూర్తి చేయాలని అనుకున్నాడు. కాని ఏమి చెప్పాలో అతనికి గుర్తు రాలేదు. ఎంత ఆలోచించినా డోనాల్డ్‌ గారు చెప్పిన రెండవ మాట అతనికి గుర్తుకు రాలేదు.

ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్న సంఘస్తులతో 'ఆమె ఎవరో నాకు గుర్తు లేదు'అన్నాడు. మనలో చాలామంది ఇతరులను అనుకరించాలని అనుకుంటూ ఉంటారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తము సృష్టించాడు. మనకప్పగించిన పనిని మనము జాగ్రత్తగా చేయాలి. ఇతరులను అనుకరించుటకు పూనుకున్నచో పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు అభాసు పాలగుదురు. - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తనను నమ్మినవాడు నశించకుండా నిత్యజీవము పొందవలెను.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech