mahimasabdam.tv@gmail.com
+91 9390209376

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు ( రోమా 8:14 ) . ఒక పెద్ద ఓడ తీరమును సమీపించుటకు కొన్ని జాగ్రత్తలు తీసుకొనవలెను . ఓడ వచ్చుచుండగా హార్బర్ మాస్టర్ అను ఉద్యోగి చిన్న పడవలో ఆ ఓడను ఎదుర్కొనుటకు వెళ్లును . హార్బర్ మాష్టర్ ఓడను ఎక్కి ఓడను క్షేమముగా రేవుకు ( హార్బర్ ) నడిపించును . హార్బర్ మాస్టర్కు సముద్రము ఎక్కడ ఎంత లోతుగా ఉ న్నదో తెలియును . గాలి ఏ దిశలో వీచుచున్నదో , ఎంత బలంగా వీచుచున్నదో అతనికి తెలియును . ఓడ కెప్టెన్ చుక్కాని వద్ద కూర్చుండి హార్బర్ మాస్టర్ చెప్పినట్లు ఓడను నడిపించును . ఓడను క్షేమముగా హార్బర్కు నడిపించుటకు హార్బర్ మాస్టర్ ముఖ్య పాత్ర వహించును . మన జీవితము అనే సముద్రములో ప్రయాణించునప్పుడు మనకు ఒక హార్బర్ మాష్టర్ ఇవ్వబడినారు . ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ . ఆయనకు ఎక్కడ ప్రవాహము వేగముగా ఉండునో , ఎక్కడ కెరటములు వచ్చునో , ఎక్కడ ప్రమాదము ఉన్నదో తెలియును . మనము ఆయనకు లోబడినచో ఆయన క్షేమముగా ఈ లోకము నుండి పరలోకమనే హార్బర్కు మనలను చేర్చును . అట్టి మార్గదర్శకుడు మన అందరికి కావలెను . మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మననుసరించి క్రమముగా నడచుకొందము ( గలతీ 5:25 ) . -డా || పి.బి.మనోహర్ , 9848363638
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)









.jpg)
 dad.png)








.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech