mahimasabdam.tv@gmail.com
+91 9390209376

పదే పదే
వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిఫ్పీ 3 : 13-14
పాస్టర్ యేసుదాసుగారి దగ్గరకు దిగాలుగా ఉన్న పుష్పరాజ్ వచ్చాడు. అతనిని ఉత్సాహపరుచుటకు పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పి చివరిగా ఒక జోక్ చెప్పాడు. 'పుష్పరాజ్! నాకు ఈ జోక్ బాగా నచ్చింది. మెడ్రాస్‌లో ఒక సర్కస్ కంపెనీకి ఒక వ్యక్తి వచ్చాడు. నాకేదైనా ఉద్యోగం ఇవ్వండి! అని అడిగాడు. సర్కస్ యజమాని 'నీవు ఏం చేయగలవు?' అని ప్రశ్నించాడు. అందుకతడు 'నా పేరు శాండో భీమ్. నన్నందరూ యగ్ కింగ్ అంటారు. నా స్పెషాలిటీ ఏమిటంటే 30 కోడి గ్రుడ్లను 20 బాతు గ్రుడ్లను ఉడకబెట్టి ఇస్తే 10 నిమిషాలలో వాటినన్నింటినీ తినివేస్తాను. తరువాత లీటర్ పాలను ఆపకుండా త్రాగుతాను' అన్నాడు. సర్కస్ యజమాని 'మరి మేము ప్రతి రోజూ 3 ప్రదర్శనలు ఇస్తాము మరి నీవు 3 సార్లు తినగలవా?' అన్నాడు. ఈజీగా తినగలను అన్నాడు శాండో భీమ్.
శని ఆదివారాల్లో మేము 6 ప్రదర్శనలు ఇస్తాము. మరి నీవు 6 సార్లు 50 గ్రుడ్లు చొప్పున తిని 6 లీటర్ల పాలను త్రాగగలవా? అని అడిగాడు సర్కస్ యజమాని. నో ప్రాబ్లమ్ అన్నాడు శాండో భీమ్. 'ఒక్కోసారి ప్రేక్షకులు వన్స్ మోర్ అంటారు. అప్పుడు ఇంకా ఎక్కువ గ్రుడ్లను తినవలసి వస్తుంది. నీకు సమ్మతమైతే అగ్రిమెంట్ వ్రాసుకుందాం' అన్నాడు సర్కస్ యజమాని.
అందుకు శాండో భీమ్ 'మీరెన్ని ప్రదర్శనలు ఇవ్వమన్నా ఇస్తాను. కానీ నాకు మధ్యలో భోజనం చేయుటకు టైమ్ ఇవ్వాలి' అన్నాడు. ఈ జోక్ వినగానే పుష్పరాజ్‌కు నవ్వు వచ్చింది. పగలబడి నవ్వాడు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం సతీష్ తన వద్ద 3 లక్షల రూపాయలు తీసుకొని ఎగ్గిొట్టాడు. పుష్పరాజు అస్తమానం దానిని తలుచుకునే బాధ పడుతున్నాడు.
మరునాడు పుష్పరాజ్ దిగాలు ముఖంతో పాస్టర్ యేసుదాసు దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారు నిన్న చెప్పిన జోక్‌నే మరల చెప్పాడు. ఈసారి పుష్పరాజ్‌కు అంత నవ్వు రాలేదు. మూడవ నాడు పుష్పరాజు మరల దిగాలు ముఖంతో పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు యేసుదాసు గారు మొన్న చెప్పిన జోక్‌నే మరల చెప్పారు. ఈ సారి పుష్పరాజ్‌కు కొంచెం కూడ నవ్వు రాలేదు.
అప్పుడు యేసుదాసు గారు 'ఒక మంచి జోక్‌తో నీవు మూడు సార్లు నవ్వలేదు కానీ ఒక చెడ్డ విషయాన్ని గుర్తు చేసుకొని మూడు సంవత్సరాలుగా ఏడుస్తున్నావు. అది ఏమైనా బాగుందా? అది యుక్తమైనదేనా? అని ప్రశ్నించాడు. పుష్పరాజ్‌కు ఒకే జోక్‌ను పాస్టర్ గారు మూడు రోజులు ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైయింది. ఆనాటి నుండి అతడు తన నష్టం గురించి ఆలోచించుటం, దుఃఖ పడటం మానివేశాడు. - డా||పి.బి.మనోహర్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)






 dad.png)



.jpg)








.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech