Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

బడాయి
30 May 2014

బడాయి

కొంతమంది అనేక బడాయి మాటలను చెప్పుదురు. తెలుగు వారు ఈ బడాయి మాటలను హెచ్చులు అని, యగష్ట్రాలని అందురు. టెన్నీస్‌ రాష్ట్రములో ఒక చర్చి వారు ఈ విధముగానే బడాయికి పోయి తరువాత ఎంతో కష్టపడవలసి వచ్చింది. కార్టర్‌ అనే గ్రామంలోని ఒక చర్చి వారు చర్చి నిర్మాణం కొరకు ఒక స్థలమును కొన్నారు. చర్చి సభ్యులలో ఒకడైన లాయరు దస్తావేజును వ్రాయునప్పుడు యజమాని అని వ్రాయవలసిన చోటులో యేసు ప్రభువు అని వ్రాసెను. అప్పటి రిజిస్ట్రేషన్‌ రూల్స్‌ ప్రకారం ఆస్తి కొనునప్పుడు కొనుక్కునే వారు రిజిష్ట్రారు ఆఫీసుకు రాకన్కరలేదు. అమ్మువారు వస్తే చాలును.

కొన్ని సంవత్సరముల తరువాత చర్చి సభ్యత్వము పెరిగి పాత చర్చి వారికి సరిపోనందువలన మరియొక చోట ఇంకా ఎక్కువ విస్తీర్ణము గల భూమిని కొనిరి. పాత చర్చిని అమ్ముటకు ప్రయత్నించగా అమ్ము వ్యక్తి రిజిష్ట్రారు ఆఫీసుకు రావలసిన అవసరత ఏర్పడెను. మరల ఆ లాయరు గారే దానికొక పరిష్కారము చెప్పిరి.

 'అసలు యజమాని ఏడు సంవత్సరాలుగా కనబడుటలేదు గనుక ఆ భూమిని వేరొక వ్యక్తికి బదిలీ చేయమని కోర్టుకు దరఖాస్తు చేసికొనవలెను. దీనిపై ఎవరును అభ్యంతరం లేవనెత్తనిచో నెలరోజులలో కోర్టు క్రొత్త వ్యక్తికి ఆస్తిని బదిలీ చేయవచ్చును' అని చెప్పెను.  అందువలన కార్టర్‌ నగరంలో గత 7 సంవత్సరములుగా యేసు ప్రభువు కనబడుట లేదని వార్తా పత్రికలలో ప్రచురించిరి.

కొందరు నేడు కూడ ఇటువంటి బడాయి మాటలను చెప్పుచున్నారు. మీరు ఏ సహవాసం అని అడిగితే 'యేసయ్య సహవాసం' అని చెప్పుట  బడాయి మాటలకు ఒక ఉదాహరణ. కొందరు సైకిల్‌, కారు కొనుక్కున్నప్పుడు యేసు ప్రభువుకు చెందినదని స్టిక్కర్లు అంటించుటయు ఇటువంటిదే. బడాయి డంబములు పలుకుట క్రైస్తవులకు తగదు.- డా||పి.బి.మనోహర

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

రోమీయులు 6:23 పాపపు వేతనం మరణం, కాని దేవుని ఉచిత బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసులో నిత్యజీవము.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech