Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ఏది గొప్ప ?
04 March 2022

ఏది గొప్ప ?

సహోదరులారా , మీరందరు ఏకభావముతో మాటలాడ వలెననియు , మీలో కక్షలు లేక , ఏక మనస్సుతోను ఏక తాత్పర్యము తోను మీరు సన్నద్ధులై యుండవలెననియు , మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను ( 1 కొరింథీ 1:10 ) .

లూథరన్ శాఖకు చెందిన జాన్ , పెంతెకొస్తు శాఖకు చెందిన పాస్టర్ శ్యాంసన్ వద్దకు వచ్చారు . “ పాస్టర్ గారూ ! మీరు బైబిల్ను బాగా చదివారు కదా ? ఏ శాఖ మంచిది ? పెంతెకొస్తు , లూథరన్ , హెబ్రోను శాఖలలో ఏది మంచిది ? " అని అడిగాడు . పాస్టర్ శ్యాంసన్ కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యారు . పెంతెకొస్తు మంచిది అంటే జాన్ గారు బాధపడతారు . లూథరన్ మిషన్ మంచిది అంటే మీరు దానిని ఎందుకు అనుసరించుట లేదు అని ప్రశ్నిస్తారు . అందుకని పాస్టర్ శ్యాంసన్ " జాన్ గారూ ! ఒక ఉ పమానం చెప్తాను .

ఈ ఉపమానమును బట్టి మీరే అర్థం చేసుకొనవచ్చును .

చాలా కాలము క్రితము ఒక రాజు ఉండేవాడు . ఆయన దగ్గర అతి ఖరీదైన వజ్రపు ఉంగరం ఉండేది . వందలాది వర్ణములతో అది కాంతులీనేది . అయితే ఏ వ్యక్తి దేవుని చేతా , మనుష్యుల చేతా అధికంగా ప్రేమించబడతాడో , అటువంటి వ్యక్తి చేతిలో మరింత ప్రకాశమానం అవుతుంది . అనేక తరాలుగా ఆ ఉంగరం ఆ రాజు కుటుంబికుల వద్ద ఉం న్నది . అయితే ఈ రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు . ముగ్గురూ ఆ రాజుకు ఇష్టమే . ఈ ముగ్గురిలో ఎవరికి తన ఉంగరాన్ని ఇవ్వాలి ? రాజు బాగా ఆలోచించి తన కంసాలిని రహస్యంగా పిలిపించి తన చేతికి ఉన్న ఉంగరం వంటిదే మరో రెండు ఉంగరాలను తయారు చేయించాడు . ముగ్గురు కుమారులను విడి విడిగా పిలిపించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంగరాన్ని బహుకరించాడు . ముగ్గురు తమకు మాత్రమే నిజమైన ఉంగరం వచ్చింది కాబట్టి మేమే సింహాసనాన్ని అధిష్టించాలని ఆశించసాగారు .

” పాస్టర్ శ్యాంసన్ మాటలు పూర్తి చేయకుండానే జాన్ “ మీ ఉద్దేశములో మూడు డినామినేషన్లు సమానమే అంటారా ? వాటి మధ్య చెప్పుకోదగిన వ్యత్యాసం ఉన్నది కదా ? అన్ని డినామినేషన్లు బైబిలు ఆధారం చేసుకొనే ఉన్నవి కదా ? ఒక దాని కంటే మరొకటి ఉత్తమమైనదని ఎలా నిర్ణయించడం ? " అన్నాడు . పాస్టర్ శ్యాంసన్ " కరెక్ట్ గా చెప్పారు . జాన్ గారూ ! కొంచెం ఓపిక పట్టండి . ఈ కథ పూర్తిగా వినండి . మీ సందేహం తీరుస్తుంది . నా కథ పూర్తి కావచ్చింది .

ఆ ముగ్గురు రాకుమారులు సింహాసనం కోసం ఆశిస్తూ ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చారు . న్యాయాధిపతి తీర్పు చెప్పుటకు ముందు వారి వాద ప్రతివాదనలను ఓపికగా విన్నారు . ఆయన ఏమి తీర్పు చెబుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .

న్యాయాధిపతి " ఈ మూడు ఉంగరములలో ఏది అసలైన ఉంగరమో తెలుసుకొనుటకు ఒక మార్గము ఉన్నది . ఎవరు అసలైన ఉంగరమును ధరిస్తారో వారు దేవుని చేత మనుష్యుల చేత ప్రేమించబడాలి కదా ! కానీ మీరు ముగ్గురూ సింహాసనము కోసం కలహించు కొంటున్నారు . కనుక ఈ మూడు ఉంగరాలు నిజమైనవి కావు . మీలో ద్వేషము , కోపము , అసూయ , స్వార్థపరత్వము ఉన్నవి కనుక మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట లేదు . నిజమైన ఉంగరం మహారాజు గారి తోటే అంతమై ఉండవచ్చును . ఈ 3 ఉంగరములు నకిలీ ఉంగరములు కావచ్చును . లేదా మీ నాన్న గారు రెండు నకిలీ ఉంగరములు చేసి మీకు ఇచ్చి ఉండవచ్చును . ఆ ఉంగరం ధరించినవారు మనుష్యుల చేత దేవుని చేత ప్రేమించబడాలి గనుక మీ ప్రవర్తనను ఆ విధముగా మార్చుకొనండి . మీలో ఎవరు ఆ విధముగా ప్రవర్తించి ఋజువు చేసుకుంటారో వారి దగ్గరే నిజమైన ఉంగరం ఉన్నదని నేను తీర్మానించగలుగుతాను . వారే సింహాసనమునకు అర్హులు అవుతారు అని తీర్పు ఇచ్చాడు ”

అని పాస్టర్ శ్యాంసన్ తన కథను ముగించారు . జాన్ గారికి అప్పుడు అర్థమైంది . మా డినామినేషన్ గొప్పది మాది గొప్పది అని కలహించుకొనుట కంటే ఎవరు దేవునిని , తోటి ప్రజలను ఎక్కువగా ప్రేమిస్తారో , యేసు ప్రభువుని పోలి జీవిస్తారో ఆ డినామినేషనే ఉత్తమమైనదని గ్రహించాడు . - మీలో ఒకడు - నేను పౌలువాడను , ఒకడు నేను అపొల్లో వాడను , మరియొకడు నేను కేఫా వాడను , ఇంకొకడు - నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు , క్రీస్తు విభజింపబడియున్నాడా ? ( 1 కొరింథీ 1 : 12,13 ) -

డా || పి.బి . మనోహర్ , 98483 63638 

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

మత్తయి 16:26 మనిషి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? లేదా మనిషి తన ఆత్మకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి?

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech