Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ప్రార్థన - రాని జవాబు
01 June 2014

ప్రార్థన - రాని జవాబు

ఇరాక్‌లో ఉన్న ఒక అమెరికా సైనికులు క్రిష్టియన్‌ రేడియో స్టేషన్‌కు ఫోన్‌ చేసి తమ ప్రార్థన మనవిని తెలియజేశారు. ప్రెయిసీ 97.5 (Praisy 97.5) అనే క్రైస్తవ కార్య క్రమము నిర్వహిస్తున్న మెల్లిస్సా సమ్మర్‌ (Melissa Summer) గారు ఇరాక్‌లో ఉన్న ఒక అమెరికా సైనికుడు చెప్పిన ప్రార్థన మనవిని ఆ రేడియో కార్యక్రమమును చూస్తున్న వారికందరికి తెలియజేసిరి.  ఇరాక్‌లో ఇసుక తుఫానులు అధికముగా వచ్చుట వలన అమెరికా సైనికులు యూఫ్రటీస్‌ నదిని దాటలేకపోవుచున్నారు. గనుక ఇసుక తుఫానులు,  వేగముగా వీచు గాలులు ఆగిపోవాలని ప్రార్థన చేయమని కోరారు.

ఆ రేడియో కార్యక్రమమును వినిన వారందరు ఎంతో పట్టుదలగా ప్రార్థన చేయుచుండిరి. తుఫాను ఆగుటకు బదులుగా మరింత తీవ్రమై రెండురోజుల పాటు అమెరికా సైనికులు కదలలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి తుఫాను ఆగిపోయినప్పుడు సైనికులు నదీ తీరమునకు వచ్చినప్పుడు వేగముగా వీచిన గాలి వలన నదీ తీరమందలి ఇసుక కొట్టుకొనిపోయి వందల కొలది ల్యాండ్‌ మైన్స్‌ (Land Mines) వారికి కనబడెను.

వేగముగా వీచిన గాలి వలన వాటిని కప్పి ఉంచిన ఇసుక తొలిగిపోయి ఎండలో అవి మెరయుచు సైనికులకు కనబడెను. తుఫాను రానిచో లేదా వారు ప్రార్థించిన విధముగా ఆగిపోయినచో వందలాది బాంబులు పేలి అనేక మంది మరణించియుండెడివారు. తుఫాను వచ్చుట వలన వారందరూ క్షేమముగా ల్యాండ్‌మైన్స్‌ (Land Mines) ఎక్కడ ఉన్నవో గుర్తెరిగి క్షేమముగా నదిని దాటిరి. దేవుని వద్ద నుండి జవాబు లభించని ప్రార్థన నిమిత్తమై దేవునిని సుత్తించెదము.- డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 6:35 అప్పుడు యేసు, ‘నేను జీవితపు రొట్టె. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు ఎప్పుడూ ఆకలితో ఉండరు, నన్ను నమ్మిన వారు ఎప్పటికీ దాహం తీర్చుకోరు. ’

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech