mahimasabdam.tv@gmail.com
+91 9390209376
.jpeg)
కొన్ని సంవత్సరాల క్రితము పాస్టర్ స్టాంటన్ గారు ఒక గ్రీజు ఫ్యాక్టరీని దర్శించారు . ఆ ఫ్యాక్టరీలో అత్యంత నాణ్యమైన గ్రీజును తయారు చేస్తారని అతని స్నేహితుడు చెప్పుట వలన స్టాంటన్ గారు ఆ ఫ్యాక్టరీని దర్శించుటకు వెళ్లారు . ఫ్యాక్టరీ గైడ్ స్టాంటన్ గారికి గ్రీజు ఫ్యాక్టరీ అంతటిని తిప్పి చూపించారు . పెద్ద పెద్ద మిషన్లు గ్రీజును ఉత్పత్తి చేస్తున్నవి . పెద్ద పెద్ద చక్రములు అవిశ్రాంతంగా పరిభ్రమిస్తూ ఉన్నవి . ఫ్యాక్టరీ అంతా చూసిన తరువాత స్టాంటన్ గారు “ ఈ గ్రీజును ఎలా ఎగుమతి చేస్తారు ? " అని అడిగారు . అందుకు ఆ ఫ్యాక్టరీ గైడ్ " మేము ఉత్పత్తి చేసిన గ్రీజు అంతటిని మా మిషన్లు సాఫీగా నడుచుటకు ఉపయోగిస్తుంటాము ” అన్నాడు . పాస్టర్ స్టాంటన్ గారు ఆశ్చర్యపోయారు . వారు ఉత్పత్తి చేసే గ్రీజు అంతటిని మిషన్లు సాఫీగా నడుచుటకు ఉపయోగిస్తున్నారు . అలాగే మన సంఘములు కూడా నేడు ఉ న్నవి . సంఘము ఇతరులకు యేసు ప్రభువును పరిచయం చేయుటకు , ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించుటకు , సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటకు ఉద్దేశించబడినవి . కానీ సంవత్సరాల తరబడి సంఘము అభివృద్ధి చెందకుండా ఉన్నది . కొన్ని సంఘముల వారు ఇతర సంఘములోని విశ్వాసులను దొంగిలించి తమ సంఘము యొక్క సంఖ్యను పెంచుకొనుచున్నారు . కానీ యేసు ప్రభువును ప్రచురము చేయడము లేదు . గ్రీజు ఫ్యాక్టరీలో తయారైన గ్రీజు ఆ ఫ్యాక్టరీలోని మిషన్లు సాఫీగా నడుచుటకు ఉపయోగించిన యెడల ఏమి లాభము ? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక యితరుల కార్యములను కూడ చూడవలెను . క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి ( ఫిలిప్పీ 4 : 5 ) . - డా || పి.బి. మనోహర్ , 98483 63638
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




























































.jpg)
 dad.png)










.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech