Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ప్రభురాత్రి భోజనం
01 January 2015

ప్రభురాత్రి భోజనం

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి యిది మీ కొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.1 కొరింథీ 11 : 23,24

ఉత్తర వియత్నాంలో యుద్ధము జరిగినప్పుడు అనేకమంది అమెరికా సైనికులు యుద్ధ ఖైదీలుగా వియత్నాం వారికి చిక్కారు. చిక్కిన వారు అనేక సంవత్సరముల పాటు అక్కడి జైళ్లలోనే మ్రగ్గిపోయేవారు. ఈ విషయమును అనేక మంది కథల రూపంలో వ్రాసారు. వీటిలో  డేవిడ్‌ మోరెల్‌  David Morrell వ్రాసిన ఫస్ట్‌ బ్లడ్‌ First Blood అనే నవల చాల ప్రసిద్ధి పొందినది. 1955 నుండి 1975 వరకు జరిగిన ఈ యుద్ధంలో సుమారు 19,42,000 మంది వియత్నాం ప్రజలు, 58,000 అమెరికన్‌ సైనికులు మరణించారు. ఒక క్యాంప్‌లో 12 మంది సైనికాధికారులను బంధించారు. వారు తమ దగ్గర ఉన్న సాధనములను ఉపయోగించి ఒక టైంబాంబ్‌ను తయారు చేసారు. వారికి ఆహారం అందించే వ్యక్తికి వేల డాలర్లను లంచంగా ఇచ్చి తాము తప్పించుకొని ఫలానా చోటుకు వస్తున్నామని అక్కడ ఒక హెలికాప్టర్‌ను ఉంచితే తాము క్షేమంగా అమెరికన్‌ సైన్యమును చేరుకుంటామని  వార్త పంపారు. అమెరికన్‌ సైనికాధికారి మీరు చెప్పినట్లే హెలీకాప్టర్‌తో అక్కడ ఉంటామనీ, మీరు అక్కడికి రాగలిగితే క్షేమంగా మమ్మల్ని చేరుకోవచ్చునని తెలియజేసారు. జైలు చుట్టు ఉన్న ఫెన్సింగ్‌ను పేల్చివేస్తే తాము క్షేమంగా జైలును దాటి వెళ్లిపోవచ్చునని వారు తలపోసారు. అయితే టైంబాంబ్‌ను ఫెన్సింగ్‌ వద్ద ఎవరు పెడతారు?

ఆ 12 మందిలో ఒక వ్యక్తికి వివాహము కాలేదు. అతడు తాను ముల్లు ఉన్న  బార్బ్‌డ్‌  వైర్‌ను (Barbed) దూకి రెండవ ప్రక్కకు వెళ్లి ఫెన్సింగ్‌ వద్ద టైంబాంబ్‌ను రహస్యంగా అమర్చి వస్తానని చెప్పాడు. బార్బ్‌డ్‌ వైర్‌కు, ఫెన్సింగ్‌కు మధ్య దూరము రెండు గజములు మాత్రమే. ఒక రాత్రి వేళ అతడు పరుగెత్తుకుంటూ వచ్చి ముళ్ల తీగపై నుండి దూకి ఫెన్సింగ్‌ వద్దకు చేరాడు. టైంబాంబ్‌ 24 గంటల్లో పేలేలా అమర్చాడు. అయితే అతడు తిరిగి వచ్చుటకు కష్టమైనది. 5 అడుగులు ఎత్తైన ముళ్ల తీగను దాటుటకు కనీసము 10 గజములు పరుగెత్తుకొని వచ్చి దూకవలెను. అయితే ముళ్ల తీగెకు ఫెన్సింగ్‌కు మధ్య దూరము కేవలం రెండు గజములే గనుక అతడు ముళ్ల తీగెను దాటి తన గుడారమునకు రాలేకపోయెను. అందుచేత ముళ్ల తీగె ఉన్న కంచెలో ఎక్కడైనా ఖాళీ ఉన్న దేమో, దానిలో నుండి దూరి పోవచ్చునేమో అని అతడు కంత కోసము వెదకుచూ ముళ్ల తీగె కంచె వెంబడి ప్రాకుచూ ఉండెను. గంట వెదకిననూ, తాను పట్టేటంత ఖాళీ అతనికి ఎక్కడా కనబడ లేదు. అంతలో వియత్నాం సైనికులు అతనిని చూసి వెంటనే కాల్చి చంపిరి. వియత్నాం సైనికులు అతడు ఏ గుడారము నుండి వచ్చినాడో గుర్తించి ఆ గుడారము వద్ద అతని శవమును పారవేసిరి. 11 మంది అమెరికా సైనికాధికారులు అతనిని చూసి ఎంతో దుఃఖించి అతనిని సమాధి చేసిరి. అతని మరణము వారికి ఎంతో దుఃఖము కలిగించెను. కానీ అతడు తన పనిని విజయవంతముగా పూర్తి చేసినాడు కనుక వారికి ఎంతో సంతోషముగా ఉండెను.

మరునాడు రాత్రి అతడు అమర్చిన టైంబాంబ్‌ పేలెను. సిద్ధముగా ఉన్న 11 మంది సైనికాధికారులు పరుగెత్తుకుంటూ వచ్చి ముళ్ల తీగను దూకి, ఫెన్సింగ్‌లో బాంబు ద్వారా ఏర్పడిన ఖాళీ గుండా పరుగెత్తి క్షేమంగా తాము చెప్పిన స్థలమునకు చేరిరి. సిద్ధముగా ఉన్న హెలికాప్టర్‌ ఎక్కి  క్షేమంగా తమ సైన్యమును చేరిరి. తమ స్నేహితుని ప్రాణ త్యాగము ద్వారా వారు జైలు నుండి తప్పించుకొనగలిగిరి. వారు అతనిని జ్ఞాపకం చేసికొనుచు అతని కుటుంబికులకు ప్రతి నెలా ఆర్థిక సాయం చేయవలెనని సంకల్పించిరి.

యేసు ప్రభువు యొక్క సమర్పణ ద్వారా మనకు రక్షణ కలుగుచున్నది. పాపము అనే ఫెన్సింగును యేసు ప్రభువు తన మరణము ద్వారా కూల్చివేసెను. అందువలన మనము దేవునిని సులభముగా చేరుకొనగలుగు చున్నాము. ఆయన మరణమును మనము జ్ఞాపకం చేసికొనుట ద్వారా ఆయనను ఎదుర్కొనుటకు మనలో సిద్ధపాటును, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచే నిరీక్షణను మనకు కలుగజేయును. నలుగగొట్టబడిన యేసు ప్రభువు శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను, చిందించబడిన ఆయన రక్తమునకు  సాదృశ్యముగా ద్రాక్షారసమును యేసు ప్రభువు మరణమును  జ్ఞాపకం చేసికొనుటకు తీసుకొను చున్నాము.

-  డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆదికాండము 2: 7 అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ధూళి మనిషిని ఏర్పరుచుకున్నాడు మరియు అతని నాసికా రంధ్రాలకు జీవన శ్వాసను ఇచ్చాడు, మరియు మనిషి ఒక జీవి అయ్యాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech