Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

బాగా ఎత్తుకు వెళ్లండి
01 January 2015

బాగా ఎత్తుకు వెళ్లండి

ప్రతి విధమైన ప్రార్ధనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:18

ఆఫ్రికా నుండి స్పెయిన్‌ లోని ఒక జంతు ప్రదర్శన శాలకు అనేక విషసర్పాలు విమానం ద్వారా ఎగుమతి చేయబడుచున్నవి. ఒక పెద్ద పెట్టె నిండా అనేక విషసర్పాలు ఉన్నవి. దానికి తాళం వేశారు కాని ఆ తాళంపై మరొక పెట్టె పడుట వలన తాళం విరిగి మూత తెరుచు కున్నది. విమానం గాలిలోనికి ఎగురు చున్నప్పుడు ఈ పాములన్నీ పెట్టె నుండి బయటకు వచ్చి ప్రయాణికులు ఉన్న చోట విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించాయి. కొందరు వాటిని చూచి అరచారు. కేకలు పెట్టారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు.

ఎయిర్‌ హోస్టెస్‌ పరుగెత్తుకొని వెళ్ళి ఈ విషయాన్ని పైలెట్‌కు తెలియజేసినది. పైలెట్‌ వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి 'ఈ పాములు విషపూరితమైనవి. ప్రయాణికులను కాటు వేయడానికి ముందే విమానాన్ని ఎక్కడ దించాలో చెప్పండి' అని కంగారు పడిన గొంతుకతో అడిగాడు.

 వెంటనే కంట్రోల్‌ రూమ్‌ నుండి పైలెట్‌ను 'ఎంత ఎత్తులో ఉన్నారు?'  అని అడిగారు. పైలట్‌ '500 అడుగుల ఎత్తులో ఉన్నాము' అన్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుండి 'మీరు ఇంకా ఎత్తుకు వెళ్ళండి' అన్నారు. పైలెట్‌ తన విమానాన్ని ఇంకా ఎత్తుకు తీసుకొని వెళ్ళాడు. కంట్రోల్‌ రూమ్‌ నుండి 'ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నారు?' అని అడిగారు. అప్పుడు పైలెట్‌ '600 అడుగుల ఎత్తులో ఉన్నాము' అని పైలెట్‌ అన్నాడు. 'ఇంకా ఎత్తుకి వెళ్లండి' అని గ్రౌండ్‌ కంట్రోలర్‌ అన్నాడు.

 అప్పటికి పాములు ఇద్దరిని కాటు వేసాయి. గ్రౌండ్‌ కంట్రోలర్‌ 'మీరు ఇంకా ఎత్తుకి వెళ్లండి. 1200 అడుగుల ఎత్తుకు వెళ్లండి' అని చెప్పారు. పైలట్‌ 'నేను 1200 అడుగుల ఎత్తులో ఉన్నాను' అన్నాడు. 'మీరు అదే ఎత్తులో ఉండండి. మీరు మీ సిబ్బందికి చెప్పండి. ఆ ఎత్తులో ఉంటే పాములు కదలలేవు. కాటు వేయలేవు. మీరు ఆ పాములను చేతితో పట్టుకొని పెట్టెలో పడవేయండి. అన్ని పాములను పెట్టెలో వేసిన తరువాత తాళం వేయండి' అని అన్నాడు గ్రౌండ్‌ కంట్రోలర్‌. సిబ్బంది అందరికి ఆశ్చర్యంగా ఉంది. వారు ఒక పామును పట్టుకుంటే అది బిగుసుకుపోయి ఉన్నది. రెండు నిముషముల తరువాత ప్రయాణికులు అందరూ ఆ పాములతో ఆడుకోవడం ఆరంభించారు. వారిలో చాల మంది తమ జీవితములో మొదటి సారి పాములను చేతితో పట్టుకొన్నారు. 'కొంచెం ముందు ఈ నల్ల త్రాచు నన్ను భయపెట్టినది. ఇప్పుడు ఇది నా చేతిలో బంతిలా  ముడుచుకొని ఉన్నది' అంటూ ఆ పామును ఒక ప్రయాణికుడు తన పది సంవత్సరముల కుమారుని వైపు విసిరాడు.

ఆ అబ్బాయి ఆ పామును ధైర్యంగా పట్టుకొని పెట్టె లోనికి విసిరాడు. పాములన్నిటిని పెట్టెలోనికి విసిరిన తరువాత స్పృహ తప్పిన వారికి వైద్యం చేసారు. వారు కూడ కోలుకున్నారు. మొత్తానికి ఈ పాముల వల్ల ఎవరికీ హాని జరగకుండానే పాములన్నిటినీ పెట్టె లోనికి చేర్చారు.

మన జీవితములో కూడ ఈ పాముల వంటి సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు మన చుట్టూ చేరి మనలను గందరగోళానికి గురి చేయవచ్చును. అప్పుడు మనం మన ప్రార్ధనను ఎత్తుకు తీసుకొని వెళ్ళాలి. మనం ఎంత ఎక్కువగా ప్రార్ధన చేస్తామో అప్పుడు మన సమస్యలు అంత బలహీనమవుతాయి. జయించ లేని మన సమస్యల యొక్క బలం తగ్గిపోతుంది. ఎటువంటి సమస్యనైనా ప్రార్ధన ద్వారా అధిగమించగలము. మీరు ఈ విషయాన్ని నమ్మితే ఈ కథను మరొక్కరికి చెప్పండి. మీరు నమ్మక పోతే నాకు ఏమీ నష్టం లేదు కాని మీరు, మీ స్నేహితులు సమస్యల నుండి బయటకు రారు.

-  డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

మత్తయి 16:26 మనిషి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? లేదా మనిషి తన ఆత్మకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి?

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech