Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ఫలించని ప్రసంగం
01 December 2014

ఫలించని ప్రసంగం

ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు ప్రకటన 1 : 3.

ఒక లాయరు, ఒక పాస్టరు, ఒక డాక్టరు కలసి ఒక నదీతీరములో ఉన్న బాతులను వేటాడుటకు వెళ్లారు. అక్కడ చాల బాతులు ఉన్నవి. ముగ్గురూ తమ తుపాకీలను గురి పెట్టి కాల్చారు. ఒకే బాతు పడిపోయింది. మిగిలిన బాతులన్నీ ఎగిరిపోయాయి. ముగ్గురూ పరుగెత్తి పడిపోయిన బాతు దగ్గరకు చేరారు. 'నేను కొట్టిన తుపాకీ దెబ్బకే ఇది చచ్చిపోయింది. కాబట్టి ఇది నాది' అన్నాడు లాయరు. డాక్టర్‌ 'నేను కొట్టిన బుల్లెట్‌తో ఇది చచ్చింది' అన్నాడు. పాస్టరు 'కాదు నేను ఈ బాతుకే గురిపెట్టాను' అన్నాడు.

 బాతుకు ఒకే బుల్లెట్‌ తగిలింది. ఎవరి బుల్లెట్‌ వల్ల తగిలిందో నిర్ణయించడం ఎలా? ఆ దారిన ఒక మహా జ్ఞాని వెళ్లుచూ వీరి కలహం విని 'ఎందుకు మీరు కలహించుకుంటున్నారు?' అని అడిగాడు. వారు ముగ్గురూ జరిగింది చెప్పారు. 'నేను నిర్ణయిస్తాను. ముందు దానికి బుల్లెట్‌ ఎక్కడ తగిలిందో నన్ను చూడనివ్వండి' అన్నాడు. ఐదు సెకన్ల తర్వాత ఆ జ్ఞాని 'ఈ బాతును కొట్టినది పాస్టర్‌' అని నిర్ణయించాడు.

 అంత త్వరగా ఎలా కనిపెట్టారని ముగ్గురూ ఆశ్చర్యపోయారు. అందుకా జ్ఞాని 'అది చాల ఈజీ. బుల్లెట్‌ ఒక చెవి నుండి దూసుకువెళ్లి మరొక చెవి నుండి బయటకు వచ్చింది. పాస్టర్ల ప్రసంగములను కూడ చర్చి సభ్యులు ఒక చెవితో విని మరొక చెవితో వదలి వేస్తారు. అందువలననే దీనిని పాస్టర్‌ గారు కొట్టానని నిర్ణయించాను' అని అన్నాడు.

మనము కూడ ఎవరైనా తిడితే ఆ మాటలను సంవత్సరముల తరబడి గుర్తుంచు కుంటాము. సినిమాలలోని పాట వినబడగానే ఇది ఫలానా సినిమా లోనిది అని జ్ఞాపకం చేసుకుంటాము. కాని దైవ వాక్యమును ధ్యానిస్తున్నామా? హృదయములో భద్రపరచు కొంటున్నామా? మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసుకొనుచూ భద్రము చేసికొనెను లూకా 2 : 19 దావీదు భక్తుడు కూడ నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను కీర్తన 119 : 11 అనుచున్నాడు.

బై ది బై పోయిన ఆదివారం మీ పాస్టరు గారు ప్రసంగం ఏ సబ్జెక్ట్‌పై చేసారో మీకు జ్ఞాపకం ఉన్నదా?

- డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆదికాండము 2: 7 అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ధూళి మనిషిని ఏర్పరుచుకున్నాడు మరియు అతని నాసికా రంధ్రాలకు జీవన శ్వాసను ఇచ్చాడు, మరియు మనిషి ఒక జీవి అయ్యాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech