mahimasabdam.tv@gmail.com
+91 9390209376

ఆ సమయమున యేసు చెప్పినదేమనగా - తండ్రీ, ఆకామునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. మత్తయి 11 : 25
వారంతా 12 సంవత్సరాల లోపు బాలలు. వారు క్రిస్మస్ నాటకము వేయాలని అనుకున్నారు. వారి పెద్దలు ఎవరూ చదువు కోలేదు. వారికి ఎవరూ సలహాలు ఇవ్వలేదు. వారిలో కొందరు వేరే గ్రామములకు వెళ్లినప్పుడు క్రిస్మస్ నాటకములను చూశారు. వారే డైలాగులు వ్రాసుకున్నారు. పుస్తకములలోని బొమ్మలను చూచి గొర్రెల కాపరులు ఎటువంటి దుస్తులను వేసుకోవాలో నిర్ణయించుకున్నారు. తమ పెద్ద వారి షర్ట్‌లను వేసుకున్నారు. తమ చిన్న చేతులకు సరిపోయేటట్లు అయిదు, ఆరుసార్లు వాటిని మడత పెట్టారు. ధర్మాకోల్ అట్టలను రెక్కల షేప్‌లో కత్తిరించి దేవదూతలకు అమర్చారు.
తెల్లని చీరలను ముసుకుగా వేసుకున్నారు. మూడు అడుగుల ఎత్తు ఉన్న గాడిద బొమ్మను తయారు చేశారు. దానికి తాడు కట్టి ఒక అబ్బాయి మెల్లగా లాగాడు. అతడు స్టేజ్ పైకి గాడిద వచ్చినట్లుగా భ్రమ కల్పించాడు. ఒక అబ్బాయి సెల్‌ఫోన్ తీసి 'ఇది రిబ్కా సత్రమేనా? నాకు రెండు రూములు కావాలి' అని అంటున్నాడు. మరియకు పొట్టపై ఒక తలగడను ఉంచారు. ఇప్పుడు ఆమె 9 లేక 10 నెలలు నిండిన గర్భవతిలా కన్పిస్తున్నది. ఆ అమ్మాయికి నవ్వు వస్తున్నది. కాని నవ్వు ఆపుకొని బాధ పడుతున్నట్లుగా మూలుగుతున్నది. యోసేపు మూసిన తలుపులను తట్టుచున్నాడు. కొందరు తలుపు తెరచి ఖాళీ లేదు పో అంటున్నారు.
మరికొందరు తలుపు తెరవ కుండానే ఖాళీ లేదు అని అరిచారు. స్టేజ్‌పై ఒక ప్రక్కన కొన్ని గడ్డి కట్టలను ఒకదానిపై ఒకటి పేర్చారు. ఒక సత్రపు యజమాని నెలలు నిండిన మరియను చూచి అక్కడకు తీసుకొని వెళ్లి 'అక్కడ ఉండండి' అన్నాడు. తన చేతికి ఉన్న వాచీని చూసుకొని 'ఉదయము 9 గంటలకు ఒక గది ఖాళీ అవుతుంది. ఖాళీ కాగానే మీకు ఇస్తాను'అన్నాడు. వారిద్దరూ గాడిదను స్టేజ్‌పై వదిలి, గడ్డి చాటుకు వెళ్లారు. మరియ అరుపులు వినపడ్డాయి. ఒక గొర్రెల కాపరి మైకు ముందుకు వచ్చి 'ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా?' అని అడిగాడు.
అంతవరకు ముందు వరుసలో కూర్చున్న ఆ మూడవ తరగతి విద్యార్థిని ఎవరూ చూడలేదు. అతడు తెల్లని కోటు వేసుకున్నాడు. కళ్లద్దాలు పెట్టుకొన్నాడు. (అవి జారిపోతుంటే సరిగ్గా పెట్టుకొంటున్నాడు) మెడలో స్టెతస్కోపు వేసుకున్నాడు. 'నేను డాక్టర్‌ని. మీకు సహాయం చేయగలను' అని నల్లని బ్యాగ్ పట్టుకొని స్టేజ్ పైకి ఎక్కాడు. అతడు వస్తుంటే దేవదూతలు గొర్రెల కాపరులు ప్రక్కకు తొలిగి అతనికి దారి ఇచ్చారు. అతడు గడ్డి వెనుకకు వెళ్లాడు.
'ఏమీ కంగారు పడకు. నేను డాక్టర్‌ను. నీకు సహాయము చేస్తాను' అని గట్టిగా అన్నాడు. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉంది. కెవ్వుమని కేక వినబడింది. తరువాత పాప ఏడ్చిన అరుపు. డాక్టర్ తెల్లని గుడ్డలో ఒక బొమ్మను చుట్టి స్టేజ్ పైకి తెచ్చాడు. అందరికి చూపిస్తూ 'ఇదిగో దేవుడు' అన్నాడు. ఆ నాటకం చూస్తున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. అందరూ లేచి నిలబడ్డారు. చప్పట్లు కొట్టారు. నేను అనేక క్రిస్మస్ నాటకాలను చూశాను. నాకు అన్నిటికంటే ఇదే బాగా నచ్చింది.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.






























Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech