mahimasabdam.tv@gmail.com
+91 9390209376

ఉప్పు
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు (మత్తయి 5:13).
ఈ కథను జెకొస్లొవేకియాకు చెందిన బోజెనా నెమ్కోవా గారు వ్రాసారు.
చాలా కాలము క్రితము ఒక రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. కుమారులు లేనందువలన తన తదనంతరము వీరిలో ఎవరిని రాణిగా చెయ్యాలని రాజు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక రోజు వారి ముగ్గురిని పిలిచి “నా కుమార్తెలారా! నేను మీ ముగ్గురిని సమానంగా ప్రేమించాను. మీ ముగ్గురిలో ఒకరు నా తదనంతరం రాణి కావాలి. నెల రోజులలో నా పుట్టిన రోజు వస్తుంది. మీ ముగ్గురిలో ఎవరు నాకు మంచి బహుమతిని ఇస్తారో వారిని రాణిగా ప్రకటిస్తాను. అయితే మీరు తెచ్చే బహుమతి మానవ జీవితానికి బాగా అవసరమైన వస్తువై ఉండాలి" అని చెప్పాడు.
పుట్టిన రోజు రానే వచ్చింది. పెద్ద కుమార్తెలు ఇద్దరూ ఖరీదైన బహుమతులను తెచ్చారు. చిన్న కుమార్తె చిన్న పాత్రలో ఉప్పు తీసుకొని వచ్చింది. ఉప్పును చూడగానే రాజుకు చాలా కోపం వచ్చింది. వెంటనే చిన్న కుమార్తెను రాజ్యము నుండి బహిష్కరించారు. చిన్న కుమార్తె ఏడుస్తూ ప్రక్క దేశమునకు వెళ్లింది.
అక్కడ ఒక సత్రములో పని చేయుటకు అంగీకరించింది. అక్కడ పని చేసే వంట మనిషి దగ్గర సహాయకురాలిగా కుదిరింది. వంట చెయ్యటం నేర్చుకొని కొద్ది రోజుల లోనే వంట మనిషి కంటే బాగా వంట చేయసాగింది. అక్కడ ఆహారం చాలా రుచిగా ఉ ంటుందనే వార్త బాగా వ్యాపించింది. ఆ దారిన వెళ్ళే ప్రతి ఒక్కరు అక్కడ ఆగి భోజనం చేసి వెళ్లేవారు.
మహారాజుకు సత్రములోని వంట మనిషి గురించి తెలిసింది. ఆమె తన కుమార్తె అని తెలియక వెంటనే తన వంట శాలలో పని చేయుటకు రమ్మని పిలిచాడు. చిన్న కుమార్తె రాజుగారి వంట శాలలో పని చేయుట ప్రారంభించింది. ఇలా ఉండగా రాజు గారు పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయించారు. రకరకాల వంటకాలు తయారు చేయబడ్డాయి. అతిధులందరూ ఆహార పదార్థములు అద్భుతముగా ఉన్నాయని వంట మనిషిని మెచ్చుకొంటూ భోజనం చేస్తున్నారు. చివరిగా రాజు భోజనం చేయుటకు కూర్చోగానే ఆయనకు వడ్డించిన కూరలో కొంచెం కూడా ఉప్పు లేదు. రాజుకు కోపం వచ్చింది. “ఈ కూరలో ఉప్పు లేదు. వంట మనిషిని తీసుకు రండి” అని ఆజ్ఞాపించాడు. చిన్న కుమార్తెని రాజు ముందు ప్రవేశపెట్టారు.
రాజు ఆమెను గుర్తించ లేదు. “నా కూరలో ఉప్పు లేదు. ఇంత ఆశ్రద్దగా నీవు వంట చేసావు" అని రాజు కోపంగా అడిగాడు. వంట మనిషి “మహారాజా! నీ చిన్న కుమార్తె ఉప్పు చాలా అవసరము అంటే మీరు ఆమెకు దేశ బహిష్కార శిక్ష విధించారు. మీ చిన్న కుమార్తె సరియైన వస్తువు తెచ్చిందని ఇప్పుడైనా మీరు గుర్తించారని అనుకుంటున్నాను" అని అన్నది. వెంటనే రాజు తన చిన్న కుమార్తెను గుర్తు పట్టాడు.
ఉప్పు మానవ జీవితమునకు చాల అవసరమైనది. "మీరు లోకమునకు ఉప్పె ఉ న్నారు” అని యేసు ప్రభువు చెప్పారు. ఉప్పు తయారు చేయాలంటే సముద్రపు నీటిని సముద్రము నుండి వేరు చెయ్యాలి. మనము లోక ఆశలకు వేరై జీవించవలెను. మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండవలెను. పూర్వకాలములో ఫ్రిజ్లు, కోల్డ్ స్టోరేజ్లు లేని రోజుల్లో చేపలు, చర్మములు మొదలగు వాటిని భద్రపరచుటకు ఉప్పు ఉ పయోగించారు. అలాగే మన తోటివారిని రక్షణ మార్గము లోనికి నడిపించి వారు నాశనము కాకుండా భద్రపరచవలెను.
డా || P B మనోహర్ 98483 63638
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
















 dad.png)












Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376