mahimasabdam.tv@gmail.com
+91 9390209376
ఒక జ్ఞాపకం యొక్క బలమెంతో కొలవలేము. దాని బరువును తూచలేము. కాని మనిషి స్పందించే విదానాన్నిబట్టి, దాని గొప్పదనాన్ని గుర్తించవచ్చు. ఒకే ఒక జ్ఞాపకంతో వేయి ఆలోచనలను సంఘర్శించ వచ్చును. అలాంటి జ్ఞాపకాలు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వున్నాయి. వాటిలో స్త్రీలు చేసిన పరిచర్యలు కుడా ఆమోదయోగ్యముగా వున్నవి గాని, వాటిని ఆహ్వానించి వారి సేవలను మనస్పూర్తిగా కొనియాడుదాం. జ్ఞాపకం ఒక సందేశం, దాన్ని సావధానంగా చదవండి. జ్ఞాపకం ఒక హెచ్చరిక దానిని పాటించండి.
ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించినదే సంఘం. స్త్రీ పురుష సమ్మేళనమే సమాజం. సంఘంలో జీవించేది పురుషులేకాదు స్త్రీలు కుడా. ఫలించుటకు, ప్రకటించుటకు, పరిచర్య చేయుటకు ప్రభువు తగు స్వేచ్ఛనిచ్చియున్నాడు. దానిని సద్వినియోగం చేసుకొని నానా విధములైన పరిచర్యలు చేసిన జ్ఞానవంతురాండ్రులను జ్ఞప్తికి తెచ్చుకుందాం.
మొదటి ప్రార్ధనా పరిచర్య – “యుద్దము చేసిన వారికెంత ప్రతిఫలమో సామానుకాచిన వారికి అంతే ఫలమన్నాడు” దావీదు రాజు. అన్నా అనే ప్రవక్తి 84 ఏండ్లు వృద్ధురాలైయుండి కూడా దివారాత్రులు దేవాలయంలో ఉపవాస ప్రార్ధనలు చేసింది. ఇది చాలా గొప్ప పరిచర్య. మార్కు తల్లియైన మరియా ఇంటిలో జరిగిన ప్రార్ధనలనుబట్టి, పేతురు చెరసాలనుండి విడిపించబడ్డాడు. ఆనాడు ప్రార్ధించిన స్త్రీలను, ముఖ్యంగా పేతురు స్వరాన్నే గుర్తుపట్టగలిగిన రోదె అను చిన్నదాన్ని ఎలా మరువగలము? ఇది స్త్రీలతో చేయబడిన ప్రార్ధనా పరిచర్య. ప్రార్ధనాశక్తి అనంతమైనది, అపారమైనది.
తలాంతుల పరిచర్య – తనకున్న టాలెంట్స్ పది మందికి పంచిన స్త్రీ దోర్కా, ఈ పేరునకు అర్ధం ''లేడి''. స్త్రిలందరిలో ఈమె ఒక్కతే '' శిశ్యురాలు'' అనబడింది. ఆమెకున్నఒనరులు సూది దారం కాబట్టి వీటితోనే దొర్కా అంగీలు వస్త్రాలు కుట్టి, అనేకులకు సాయపడి ఘనతనొందింది . సత్క్రియలయందు ఆశక్తిగల ప్రజలను తనకోసం పవిత్రపరచుకొని ప్రభువు తనసోత్తుగా చేసుకుంటాడు. తన తలాంతులను దీన జనులకు పంచిన దొర్కాను మరువకూడదు. కృపావరములు నానా విధములు, అలాగే పరిచర్యలు కూడా నానావిధములని బైబిల్ సెలవిస్తోంది. వీటిని పాతిపెట్టక, వినియోగిస్తూ ఉండాలి. వివేచనా అనే వరాన్నివాడినట్లయితే, మన స్వంత కుటుంబాన్నేకాక సంఘాన్ని, సమాజాన్ని కూడా అభివృధిపదంలో నడిపించవచ్చు. తలాంతులను దాచిపెట్టి తీసుకునే విశ్రాంతి చావుతో సమానమని అంటారు పెద్దలు. తాలాంతులను వాడిన దొర్కా ఎంత ధన్యురాలు.
సువార్త పనిలో సహకరించిన స్త్రీలు: సువార్త పనిని తమ స్వంత ఇండ్లలోనె ప్రారంభించిన ఫీబే, సహ సేవకురాలిగా గుర్తింపు పొందిన ప్రిస్కిల్లా. ప్రభువు కొరకు బహుగా ప్రయాసపడిన పెర్సిస్, తల్లితో సమానమైన రూపుతల్లి వీరందరికీ రోమా 16వ అధ్యాయంలో పౌలు భక్తుడే వందనాలు చెల్లించగా మనమేటివారము? మనము కూడా వారికి వందనాలు చెల్లించుదాము. ఆదివారము మాత్రమే గుడి, మిగిలిన ఆరు రోజులు తన గృహాన్నే గుడిగా మార్చుకున్న మార్కు తల్లి మరియ. ఇంటిలోనికి వచ్చిన యేసయ్యను హృదయంలోనికి చేర్చుకున్న బెతనియ మరియ బయటవున్న యేసయ్యను ఇంటిలోనికి తెచ్చుకున్న బెతనియ మార్త (లూకా 10:38) మరియు లూదియ, ఫిలోమినా వీరంతా తమ గృహాలను మందిరాలుగా తెరచివుంచారు, గనుకనే వీరి సేవలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆతిధ్యం పొందిన బెతనియ గృహాన్ని ప్రేమించిన ప్రభువు బెతనియ వరకు వచ్చి ఆరోహనుడగుట గమనించదగ్గ విషయం. ప్రిస్కా, అంటే ప్రిస్కిల్లా తోడ్పాటు లేకుంటే రోమా పత్రిక వుండేది కాదేమో?... పౌలు భక్తుడు రోమా పత్రికను వ్రాసి ఆమె చేతికివ్వడం ఎంత ధన్యత.
ప్రభు సేవకై యిచ్చుట: యిచ్చుటలోనున్న ఆశీర్వాదాలను గ్రహిస్తే, ఇవ్వకుండా వుండలేము. వెదజల్లి అభివృద్ధి చెందినవారు కలరు. యేసయ్య అంగీలో డబ్బులున్నట్లు ఎవరూ చెప్పలేదుగాని, ప్రజలే అన్ని సమాకుర్చునట్లు మార్కు 8వ అధ్యాయంలో వ్రాయబడివుంది. ఇచ్చేటప్పుడు మనచేయి పైకి లేస్తుంది. మిగతా సమయమంతా ప్రభువు చేయి మన తలపైనే వుంటుందనే సత్యాన్ని గ్రహించిన వారు ఇవ్వకుండా వుండలేరు ఆయన సేవకై తమ ధనాన్ని, స్థలాన్ని, సమయాన్ని వెచ్చించిన మహిళలు ధన్యులు.
ఆనాటి మహిళలు ప్రభుని సేవలో అంతగా పాల్గొన్నప్పుడు ఈనాటి మహిళలైన మనము పరిచర్య చేయడానికి వెనకాడవచ్చునా? పెండ్లికెదిగిన ఆకుల్లో పిందెల్లా ఒదిగి ఉండాలి గాని మగరాయుడిలా మైక్ ముందు నిలబడి హల్లెలూయా అంటూ పాడతావెందుకు? అని నాన్నగారంటే.. నోరునోక్కుకొని వుండక చక్కగా పాడి ప్రభువును స్తుతించాలి. పెళ్ళైన ఇల్లాలివి స్త్రీలకూడిక అంటూ ఇల్లిల్లూ తిరుగుతావెందుకు? ఇల్లు పిల్లల్ని చూచుకో అని నీ భర్తగారు హుకూం జారిస్తే.. నిరాశ చెందక బాలుడు నడవవలసిన త్రోవలను ఇంటిలోనే నేర్పించు. వృద్ధమహిళవు నివు పెట్టింది తిని ఓ మూలన కూర్చో అని నీ కొడుకు బెదిరిస్తే కరక్టే, నేను ముసలిదాననని నిరాశ చెందక సమాజ శ్రేయస్సుకై ప్రార్ధించు. తండ్రి, భర్త, కొడుకంటు నీ ఆలోచనలను ప్రక్కకు నేట్టివేయజూచినా ప్రభువు ఇచ్చిన స్వేచ్ఛను వాడుకొని ఆయన పరిచర్యలో పాల్గొనాలనే తపన స్త్రీలంతా ముందడుగు వేతురుగాక! ప్రభువు మిమ్ములను దీవించును గాక!
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech