Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

చివరికి వచ్చిన వెలుగు
04 September 2026

చివరికి వచ్చిన వెలుగు

ఒక చిన్న గ్రామంలో దానియేలు అనే యువకుడు ఉండేవాడు. అతను కష్టపడి వ్యవసాయం చేసేవాడు,ప్రతిరోజు చర్చికి వెళ్లేవాడు,పాస్టర్ గారి ప్రసంగాలు ఆయన్ని ప్రభావితం చేశాయి. పాస్టర్ గారి ప్రసంగా: కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. జీవితములో బాధకరమైన పరిస్థితి ఆశాభంగం, సిగ్గుపడే పరిస్థితి. అనగా, చేయగలనని నమ్మకముతో ముందుకు వెళ్ళి చేయలేక నవ్వులు పాలైన పరిస్థితి. నిన్ను ఓర్వలేక కావాలనే నీకంటే కింద స్థాయి వ్యక్తిని నీపైన అధికారిగా పెట్టినప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఎదురౌతుంది. అందుకనే దావీదు నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుమని ప్రార్ధించాడు. పౌలు అయితే నాకు కలిగిన శ్రమలలో దేవుడు విడిపిస్తాడని నిరీక్షణ కలుగియున్నాను కాబట్టి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని చెప్తున్నాడు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం ఊహించలేము. దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరిని చెరిపాడు. దావీదుని తన కుమారుడే చంపుటకు వచ్చినప్పుడు రాజ్యం వదిలిపెట్టి పారిపోయాడు. దావీదు ఉపపత్నులను అందరు చూస్తుండగ తన కుమారుడైన అబ్షాలోము చెరిపాడు. ఈ పరిస్థితులలో దావీదు గురించి ఇశ్రాయేలు ప్రజలు ఏవిధముగ మాట్లాడుకున్నారో బైబిల్ లో వ్రాయబడిలేదు కాని, ఎక్కడ చూసిన దావీదు కుటుంబము గురించి తెలిసి తెలియక రకరకాలుగా మాట్లడుకొనియుండి ఉంటారు. దావీదు జీవితములో ఇది అవమానకరమైన, సిగ్గుకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుండి భయటకు వచ్చే అవకాశమే లేదు. తప్పు చేసిన దావీదు పశ్చాత్తాపపడి దేవుని మీద నిరీక్షణ కలిగియున్నాడు. ఆ నిరీక్షణ దావీదును సిగ్గుపరచలేదు కాని తిరిగి అదే రాజ్యం మీద రాజుగా పరిపాలన చేసాడు. ప్రియ విశ్వాసి! అనుకోని పరిస్థితుల వలన శ్రమలలో చిక్కుకున్నావా? నీ శత్రువు నీ పైన అధికారం చెలాయిస్తున్నాడా? నిందలకు, అవమానముల వలన తలదించుకున్నావా? భయపడకు అద్భుతమైన వాగ్ధానం నీకొరకు ఉంది. సామెతలు 23:18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు. కీర్తన 22:4-5 మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి. ప్రతికూల పరిస్థితులలో దేవుని పైన నమ్మకము ఉంచుటవలన రక్షణ కలుగుతుంది, విడుదల పొందుకుంటాము, సిగ్గుపడే పరిస్థితి నుండి విడిపించబడతాము. ఒకవేళ నీకున్న సమస్తము కోల్పోవచ్చు. ఆరోగ్యం, ఆస్తి, ఆత్మీయ జీవితం మొదలగు అన్నింటిలో క్షీణించిపోవచ్చు కానీ, క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే తిరిగి పొందుకుంటాము. మన నిరీక్షణకు ఆధారం యేసే. కొద్ది రోజుల్లో... ఒక సంవత్సరం వరుసగా కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. అప్పులు పెరిగాయి. అతనిపై గ్రామస్థులు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. "నీ దేవుడు నిన్ను కాపాడతాడని చెప్పావు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?" అని అవమానించారు. అంతేకాకుండా అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. కుటుంబ సభ్యులు నిరాశలో మునిగిపోయారు. అన్నీ కోల్పోయినట్లు కనిపించినా, దానియేలు మాత్రం ప్రతి ఉదయం మోకాళ్లపై నిలబడి ప్రార్థించేవాడు. "ప్రభువా! నా నిరీక్షణ నీవే. నేను నిన్ను విడువను" అని కన్నీళ్లతో దేవుని ఎదుట మొరపెట్టుకునేవాడు. కొన్ని నెలల తరువాత ఊహించని విధంగా వర్షాలు కురిశాయి. అతని పొలంలో పంటలు సమృద్ధిగా పండాయి. ప్రభుత్వ సహాయం కూడా అందింది. అప్పులు తీర్చగలిగాడు. అతని ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగైంది. ఒకప్పుడు అతన్ని అవమానించినవారే ఇప్పుడు, "నీ విశ్వాసమే నిన్ను నిలబెట్టింది" అని ఒప్పుకున్నారు. అప్పుడు దానియేలు చిరునవ్వుతో ఇలా అన్నాడు: "నేను దేవుని సమయాన్ని ఎదురు చూశాను. ఆయన నన్ను సిగ్గుపడనివ్వలేదు. నా ఆశ భంగం కాలేదు." పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచినవారు చివరికి రక్షణను, విడుదలను, గౌరవాన్ని పొందుతారు.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

ఏది చేసినను హృదయపూర్వకముగా ప్రభువుకొరకే చేయుడి.
-కొలొస్సయులకు 3:23

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.