Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

గర్వ భంగము
04 July 2026

గర్వ భంగము

దరిద్రుని బాదించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు. బీదను కనికరించువాడు ఆయనను కనికరించువాడు (సామెతలు 14:31). విన్సెంట్కు 13 సంవత్సరములు. విన్సెంట్ తండ్రి పెద్ద వ్యాపార వేత్త. వారికి పెద్ద | తోట ఉన్నది. ఆ తోటలో అనేక ఫల వృక్షములు ఉన్నవి కానీ విన్సెంట్కు చాలా గర్వము. | తనకంటే పేద వారిని చూచి ఈసడించుకొనేవాడు. ఒక రోజు విన్సెంట్ తన తోటలో ఆడుకొనుచుండగా చెప్పులు లేని కాళ్ళతో ఒక అబ్బాయి గేటు వద్దకు వచ్చి “ఏవండీ! దాహంగా ఉంది. కొంచెం మంచి నీరు ఇస్తారా?" అని అడిగాడు. విన్సెంట్ గర్వంగా "నీ పేరేమిటిరా?” అని అడిగాడు. నా పేరు జోసఫ్ అండీ! దాహంగా ఉంది. కొంచెం నీళ్ళు ఇస్తారా?" అని అడిగాడు. అందుకు విన్సెంట్ “పోరా! జోసఫ్! నీలాంటి వాళ్లకి మా తోటలో ప్రవేశం లేదు. మీరు వస్తే తోట అంతా పాడుచేస్తారు. పోరా” అని దురుసుగా పలికాడు. “బాగా దాహంగా ఉందండి" అని జోసఫ్ మరలా అడిగాడు. విన్సెంట్కి కోపం వచ్చింది. “మర్యాదగా పోతావా లేదా? మా జాకీని పిలవనా?” అన్నాడు. జోసఫ్ నిశ్శబ్దంగా వెనుతిరిగాడు. జోసఫ్ చేతిలో చిన్న బుట్ట ఉన్నది. దాని నిండా నేరేడు పండ్లు ఉన్నవి. విన్సెంట్ అప్పటి వరకు వాటిని చూడలేదు. విన్సెంట్ “ఒరేయ్ | నీకు ఆ పండ్లు ఎక్కడివిరా” అని గట్టిగా అరిచాడు. "ఇవి మల్లయ్య గారి తోటలోనివి | అండీ. ఆయనే కోసుకోమన్నారు” అన్నాడు. ఆ నేరేడు పండ్లను చూడగానే తాను కూడా | ఆ పండ్లను కోసుకోవాలని విన్సెంట్ అనుకొన్నాడు. విన్సెంట్ గబగబా గేటు బయటకు వచ్చి మల్లయ్య గారి తోట వైపు నడిచాడు. దారిలో చిన్న గుంట ఉన్నది. విన్సెంట్ దానిని సులభంగా దూకగలను అనుకొన్నాడు. పరుగెత్తుకొంటూ వచ్చి దానిని దాటుటకు దూకాడు. ఆ గుంటను దాటగలను అనుకొన్నాడు. కానీ దాట లేక గుంటలో పడ్డాడు. నడుము వరకు మట్టిలో కూరుకుపోయాడు. ముందుకు కదలలేక పోతున్నాడు. కొంచెము కొంచెము లోపలికి దిగిపోతున్నాడు. విన్సెంట్ భయంతో గట్టిగా కేకలు పెట్టాడు. విన్సెంట్ కేకలు విన్న జోసఫ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. జోసఫ్ని చూడగానే "నన్ను బయటకు లాగవా నీకు పది రూపాయలు ఇస్తాను” అన్నాడు. జోసఫ్ “నీ పది రూపాయలు నాకు అక్కర్లేదు" అని పెద్ద కర్ర పట్టుకొని విన్సెంట్ వైపు చాపి "గట్టిగా పట్టుకో” అని అరిచాడు. విన్సెంట్ పట్టుకోగానే జోసఫ్ బయటకు లాగాడు. విన్సెంట్ ఒళ్ళు అంతా మట్టితో నిండిపోయింది. ఒక బూటు మట్టిలో పడిపోయింది. "జోసఫ్! చాలా థాంక్స్. నేను నిన్ను పొమ్మని అరిచినా నీవు నాకు సహాయం చేసావు" అన్నాడు. జోసఫ్ దగ్గరలో ఉన్న బావి దగ్గరకు విన్సెంట్ని తీసుకొని వెళ్లాడు. పది బక్కెట్లు | నీరు తోడి విన్సెంట్కి అంటుకున్న మురికి అంతటిని పోయేలా కడిగాడు. మరునాడు జోసఫ్ గేటు దగ్గర కనబడగానే విన్సెంట్ పరుగెత్తుకొని వెళ్లి గేటు తెరిచాడు. “లోపలికి రా” అని ఆహ్వానించాడు. "ఇప్పుడు మంచివాడవు అయ్యావు” అన్నాడు జోసఫ్. “నిన్ననే నేర్చుకొన్నాను" అన్నాడు విన్సెంట్. 98483 63638

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ముందుగా కూర్చొని లెక్క వేసికొనుము.
-లూకా 14:28

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech