mahimasabdam.tv@gmail.com
+91 9390209376

క్రిస్మస్ పర్వదినాన్న అలంకరించుకునే అలంకరణలలో క్రిస్మస్ చెట్టు ఒకటి. ఈ క్రిస్మస్ చెట్టును గూర్చి రకరకాల పారంపర్య గాధలున్నాయి. వాటిలో ప్రాముఖ్యముగా మూడింటిని గూర్చి తెలుసుకుందాం.
- క్రీ.శ.8 వ శతాబ్దంలో సువార్త సేవ జరిగించుటకు జర్మనీకి వెళ్ళిన సెయింట్ బోనీఫస్ అక్కడ అడవిజాతుల వారు చెట్టు పండుగను జరుపుకోవడం చూశాడు. ఆ పండుగ సమయంలో ఆ ప్రజలు 'ఓక్ చెట్టుకు' నరబలి కూడా ఇచ్చేవారు. ఆ దురాచారాన్ని వారితో మాన్పించాలని ఆయన వారికి ఒక ఫర్ చెట్టును చూపించి దాని విశిష్టతను ఈ విధంగా వివరించాడు. 'ఈ చెట్టు అమ్ము ఆకారంలో ఉండి స్వర్గంవైపు చూపిస్తుంది అనగా క్రీస్తుప్రభువు వైపుకు చూపిస్తుంది. ఆయన మానవుల పాపాలను పరిహరించుటకు బలి అయ్యారు. అందువలన మీరు ఈ నరబలులు చేయడం అనవసరం ఇకనుంచి మీరు ఈ నరబలులు మానివేసి ఈ ఫర్ చెట్టును క్రీస్తు ప్రసాదించిన రక్షణకు గుర్తుగా భావించండి. ఈ చెట్టు కొమ్మలను మీ ఇళ్ళకు తీసుకొని వెళ్ళి అందంగా అలంకరించి ఆనందంగా పండుగ జరుపుకోండి' అని వారితో దైవజనుడు చెప్పాడు. అప్పటినుండి ఈ చెట్టును క్రిస్మస్ రోజున అలంకరించి పండుగ జరుపుకోవడం ఆరంభమైంది.
- పూర్వం క్రిస్మస్ సందర్భంగా జర్మనీలో చర్చి ప్రాంగణంలో ఆదాము హవ్వల కధలతో ప్రారంభించి క్రీస్తు జననం వరకు మానవ రక్షణ చరిత్రను ప్రదర్శించేవారు. ఆదాము-హవ్వల కధను ప్రదర్శించే సందర్భములో ఫర్‌చెట్టుకు యాపిల్ పండ్లను వ్రేలాడదీసేవారు. క్రీస్తు జననానికి చిహ్నంగా ఒక ఎత్తైన కొయ్య స్తంభం మీద ఒక జ్యోతిని వెలిగించేవారు. ఈ రెండింటినీ ప్రతీ ఇంటిలోనూ క్రిస్మస్ సందర్భంగా చేసేవారు. కాలక్రమేణా ఫర్ చెట్టుకు యాపిల్ పండ్లను అలంకరించడం మానేసి జ్యోతి మాత్రము చెట్టుమీద ఉంచడం ప్రారంభించారు. ఈ విధంగా క్రిస్మస్ సందర్భంగా ఫర్ చెట్టుకు గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది.
- క్రీ.శ.16 వ శతాబ్దంలో లూధరన్ చర్చ్ వ్యవస్థాపకుడైన మార్టిన్‌లూధర్ గారు డిసెంబర్‌లో వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఒక మొక్కని చూసారట. ఆకాశంలో నక్షత్రాలను చూసి ఈ మొక్కకు క్రొవ్వొత్తులు పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆ మొక్కను క్రొవ్వొత్తులతో అలంకరించారట. అది క్రిస్మస్ కాలం అవడంతో క్రిస్మస్ వాడుకలోకి వచ్చింది అదేవిధంగా క్రీ.శ.19వ శతాబ్దంలో విక్టోరియా మహారాణి కూడా క్రిస్మస్ ట్రీని ప్రాచుర్యంలోకి తెచ్చారు.
- క్రిస్మస్ చెట్లుగా ఈ క్రింది మొక్కలను ఎక్కువగా వాడతారు. 1) స్కాట్చ్, 2) పైన్, 3) డగ్లస్‌ఫర్, 4) ఫ్రాసర్‌ఫర్, 5) బాల్సమ్‌ఫర్, 6) వైట్‌పైన్
మన భారతదేశంలో ఫర్‌చెట్టు లేకపోవడం వల్ల దానితో దగ్గర పోలిక ఉన్న సరివి చెట్టును క్రిస్మస్ ట్రీగా వాడుకుంటున్నారు.
- జర్మనీలో క్రిస్మస్ ట్రీతో పాటు క్రిస్మస్ పిరమిడ్స్‌ని కూడా అలంకరిస్తారు. చెక్కతో చేయబడిన పిరమిడ్స్‌ను క్యాండిల్స్‌తోను, పచ్చని ఆకులతోనూ అలంకరిస్తారు.
- ప్రపంచంలో అతిపెద్ద క్రిస్మస్ ట్రీ విల్లింగ్టన్‌లోని హీల్లన్ పార్కులో ఉంది. 91 అడుగుల ఎత్తు ఉన్న ఈ చెట్టు 120 చదరపు అడుగుల ప్రదేశంలో విస్తరించి ఉంది. ప్రతీ క్రిస్మస్ దినాన్న ఆ వృక్షాన్ని బంగారు, వెండి ఆభరణములతో అపురూప వస్తువులతో రంగు రంగుల దీపాలతో అలంకరిస్తారు. ఈ అతిపెద్ద క్రిస్మస్ ట్రీని సందర్శించడానికి ప్రతీ సంవత్సరం లక్షలాదిగా దేశవిదేశాల నుండి తరలివస్తారు.
- ప్రొఫెసర్ 'చార్లెస్ ఫోలెన్' అను వ్యక్తి అమెరికా దేశమునందు 1832 వ సం||లో క్రిస్మస్ ట్రీని నిర్మించి, అలంకరించి మొట్టమొదటిసారిగా క్రిస్మస్ ట్రీ మీద క్యాండిల్‌ను వెలిగించాడు. దీనిని అలంకరించడానికి 16,450 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది.
క్రిస్మస్ ట్రీ విశేషాలు
- క్రిస్మస్ పండుగలో 'ఫర్‌చెట్టు'ను అలంకరించే ఆచారము క్రీ.శ.10వ శతాబ్దంలో జర్మనీలో ప్రారంభమైంది.
- ప్రపంచంలో అతిపెద్ద క్రిస్మస్ ట్రీ విల్లింగ్టన్‌లోని హీల్లన్ పార్కులో ఉంది.
- ప్రొఫెసర్ చార్లెస్ ఫోలెన్ 1832 వ సం||లో క్రిస్మస్ ట్రీని అలంకరించి దాని మీద క్యాండిల్ వెలిగించాడు.
- 1882 వ సంవత్సరంలో మొదటిసారిగా క్రిస్మస్ ట్రీని విద్యుత్ దీపాలతో అలంకరించే ఆచారాన్ని ప్రారంభించారు.
- ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్ ట్రీ అబుదాబిలోని ప్యాలస్ హోటల్‌లో ఉంది. దాని ఎత్తు 40 అడుగులు. దీని విలువ 1కోటి 10 లక్షల డాలర్లు. ఈ చెట్టును 181 వజ్రాలు, పగడాలు, కెంపులతో కలిపి దాని విలువ దాదాపు 40 కోట్లు.
- 1984 వ సం|| డిసెంబర్ 13వ తేదీన నేషనల్ క్రిస్మస్ ట్రీగా అమెరికాలో ఒక చెట్టు అమ్ముడైంది.
- ఐరోపాలో ఏడాదికి సగటున 60 మిలియన్ల క్రిస్మస్ ట్రీలను పెంచుతారు.
- క్రిస్మస్ ట్రీలను కొనుగోలు చేయడానికి అమెరికన్లు ఏటా 1.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా.
- దాదాపుగా ఒక లక్ష మంది ఉద్యోగులు క్రిస్మస్ ట్రీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.
- 1,000,000 ఎకరాల భూమి ఈ క్రిస్మస్ ట్రీలను పెంచడానికి ఉపయోగిస్తున్నారు.
- ప్రతీ ఏటా 77 మిలియన్ల చెట్లను నాటుతారు. ప్రతీ ఎకరానికి 2,000 చెట్లను నాటుతారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.










Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech