Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

పక్షిరాజు - పాఠాలు
15 January 2020

పక్షిరాజు - పాఠాలు

'పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి, ఆకాశపు వీధికెక్కునా తనగూడు ఎత్తైయిన చోటను కట్టుకొనునా? అదిరాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను, ఎవరును ఎక్కజాలని యెత్తుచోటను గూడుకట్టుకొనును. అక్కడ నుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడనుందురో అక్కడనే అదియుండును' (యోబు 39:27-30).ఉపోద్ఘాతము : పక్షిరాజు అనగా గ్రద్ద గరుడుపక్షి అని అర్థం. పక్షిరాజు ఎత్తైన స్థలాల్లో ఉంటుంది. ఎత్తైయిన చెట్లమీద గూడుకట్టుకుంటుంది. పర్వత బందసందులలో గూడు కట్టుకొంటుంది. రాతి కొండమీద నివసిస్తుంది. అలాిం ప్రదేశాల్లో పక్షిరాజు దాని పిల్లలు క్షేమంగా ఉంాయి. శత్రువులు చేరలేని స్థలంలో అనగా క్షేమకరమైన స్థలంలో ఉంటుంది. పక్షిరాజు పేరు బైబిల్లో ఎందుకు ఉంది? దాని పాఠాలు మనం నేర్చుకోవడం కోసమే. ఈ క్రింది విషయాలను మనం ధ్యానించబోతున్నాం.1. పక్షిరాజు నివాసం; 2. పక్షిరాజు దృష్టి; 3. పక్షిరాజు సిద్ధపాటు; 4. పక్షిరాజు పవిత్రత; 5. పక్షిరాజు పెంపకం; 6. పక్షిరాజు నూతన బలం; 7. పక్షిరాజు మరణం.

1. పక్షిరాజు నివాసం :
పక్షిరాజు నివాసం ఎత్తైయిన చోటు, మన గూడు / నివాసం ఎక్కడకట్టుకుంటున్నాం మనల్ని మనం ఎక్కడ ఉంచుకొంటున్నాం? అది రాతి కొండ మీద నివసిస్తుంది? మన నివాసం కొరకై కొట్టబడిన బండైన క్రీస్తు మీదనేనా? ఆయన యుగయుగాల బండ, జగజగాలబండ. 'నాకై చీలిన యుగయుగాలబండ, దాని ద్వారానే ముక్తి' అని భక్తుడు పాడుచున్నాడు. మనం కుడా ఆయనతోనే గూడు కట్టుకోవాలి. మన కోసం ప్రభువు సిద్ధపరచిన ఎత్తైన స్థలం పరలోకం, అది మన కలలకు అతీతం.
2. పక్షిరాజు దృష్టి :
'అక్కడ నుండియే తన ఎరను వెదకును' (యోబు 39:29). అంత ఉన్నత పర్వతముల మీద కూర్చున్న పక్షిరాజు అక్కడ నుండి భూమి మీద ప్రాకే పురుగులను, సంచరించే జంతువులను, ఎగిరేపకక్షులను, చూస్తుంది. పదికిలోమీటరు క్రిందికి చూస్తుంది. భూమి మీదనుండి 31/2 కి.మీ. ఎత్తు ఎగురుతాదట. మన దృష్టి ఎలా ఉంది? మన నేత్రాలతో ఎంతో దూరం చూడగలం, మన మనోనేత్రాలతో ఎంత దూరం చూడగలం? విశ్వాసులు చూడాలి. విశ్వాసులు భూసంబంధమైన వాిని మాత్రమేకాదు పరసంబంధమైన వాిని కూడా చూడాలి. విశ్వాసులు, దూరదృష్టి గలవారుగా వుండాలి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను' (హెబ్రీ 11:10) వాగ్దాన దేశములో పరవాసిగా ఉండి చూచాడు విశ్వాస నేత్రాలతో చూచాడు. అబ్రహాము ఒక్కడే కాదు. వీరందరు ఆ వాగ్దానఫలము అనుభవింపక పోయినను, దూరము నుండి చూచి వందనము చేసి, విశ్వాసముగలవారై మృతినొందిరి (హెబ్రీ 11:13). విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము దృష్టి పరలోకం మీద ఉన్నట్టే. మన దృష్టి కూడా పరలోకం మీదే ఉండాలి.
3. పక్షిరాజు సిద్ధపాటు :
'నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు' (కీర్తన 23:5). పకక్షులకు పక్షిరాజుకు ఆహారము సిద్ధపరచేవాడు ఆయనే. పక్షిరాజులు ఆహారం తినేటప్పుడు సైతం రెక్కలు బాగా విప్పుతాయి. ఆహారం తినేటపుడుయినా ప్రమాదం సంభవించవచ్చునని, రెక్కలు విప్పి తింయి. మనం కూడా రెక్కలు చాపి ఉండాలి. ఆకస్మాత్తుగా ఎగరాలంటే. కష్టం కావచ్చునని, ముందే రెక్కలు సగం తెరచి ఉంచుతాయి. అనగా విశ్వాసులు శత్రు పన్నాగాల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఎప్పికప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలి. విశ్వాసులు, సంఘం సిద్ధంగా ఉండాలి. పక్షిరాజు రెక్కలు చాపితే ఏడు అడుగులు విస్తరిస్తాయి. అంటే ఆ కొస నుంచి ఈ కొసవరకు 7 అడుగులు స్థలం వరకు విప్పి గాలిని అనుకూలంగా మలుచుకొాంయి. అంటే శ్రమ వెంటశ్రమ కలిగినా, ఓర్చుకుంటూ సమస్యలను కూడా అనుకూలంగా మలచుకొని సిద్ధపడతాయి. ఒక వేళ తుఫాను లాింది. సంభవిస్తే ముందే క్షేమకరమైన స్థలం చూచుకుంటుంది. పక్షిరాజు మెదడులో దేవుడు అమోఘమైన జ్ఞానాన్ని ఉంచాడు. దేవుని జ్ఞానం మన ఊహకందనిది.'నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతిని సిద్ధ పరుచుము' (యెహెజ్కేలు 38:7). 'సిద్దమనస్సను జోడు తొడుకొని నిలువబడుడి' (ఎఫెసి 6:15). అంటే మనం సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి.
1. సువార్త ప్రకించడానికి (రోమా 1:15)
.2. దేవుని సన్నిధిని కనబడుటకై (ఆమోసు 4:12).
3. హేతువు అడుగు ప్రతివానికి... సమాధానము చెప్పుటకు (1పేతురు 3:16).
4. ప్రభువు రాకడకొరకు (మత్తయి 24:44).
5. పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు (మత్తయి 25:10; ప్రకటన 21:2).
6. బంధించబడుటకు మాత్రమే కాదు... చనిపోవుటకు కూడా (అపొ.కా. 21:13).
7. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి (తీతుకు 3:2).


4. పక్షిరాజు పవిత్రత :ఆడ పక్షిరాజు తొందరపడి మగపక్షిరాజును చేరనీయదట, ఒక మగపక్షిని భర్తగా స్వీకరించే ముందు మగ పక్షిని చాలా పరీక్షించి, ఎక్కువకాలం ఓపిగ్గా కనిపెడుతుందట, ప్రేమలో నిశ్చలత, స్థిరత పటుత్వం, స్పష్టమయ్యాకే భర్తగా స్వీకరిస్తుంది. పిమ్మట పక్షిరాజులు ఆడది మగది కలిసి జీవిస్తాయి. ఒక వేళ ఆరిెంలో మగది చనిపోయినా ఆడదిచనిపోయినా వేరొక పక్షిని చేరవంటే చేరవు. ఒంిగనే చనిపోతుంది గానీ, మరొక పక్షిని చేరవు. దరికిరానివ్వవు. ఎంత ఆశీర్వాదకరమైన జీవితాలు? పవిత్రత విషయంలో పక్షిరాజు మనుష్యులకు బుద్ధి చెప్పుతున్నాయి. ఎంత యోగ్యమైన జీవితం? ఎటువిం అవరోధాలు ఎదురైనా వాిని వారించలేవు. ఒకరికి ఒక్కరే జీవిత భాగస్వామి అనే నియమం. నిష్ట కట్టుబాటు అవసరం అని నేి పాఠకులు గ్రహించాలి. వియోగం తప్పనిసరి అయినప్పుడు లేఖానాల ఆధారంగా పునర్వివాహం పాపం కాదు. అయినా దానికంటే పరిశుద్ధత, పవిత్రత మేలు. ఎక్కడో చదివాను. చెడిపోకముందు చచ్చిపో అని. 'నీశాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము' (కీర్తన 93:5). మందిరం అంటే సంఘం లేక గుడి అని అర్ధం. రెండో అర్థం. మన హృదయం. దేవుని ప్రజల జీవితం ఏమూలచూచినా ఏగదిలో చూచినా పరిశుద్ధతే అయిఉండాలి. మన హృదయసౌందర్యం పవిత్రతకావాలి. మన జీవిత సౌందర్యం పరిశుద్ధత కావాలి. అరికాలు మొదలు నడినెత్తి వరకు పవిత్రతగా జీవిస్తున్న వ్యక్తి జీవితం ఎంత అందంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ పురుషుల జీవితం పక్షిరాజు వలె పవిత్రంగా ఉండాలి.5. పక్షి రాజు పెంపకం :
'పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాిని పట్టుకొని తన రెక్కల మీద వాిని మోయునట్లు, యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను' (ద్వితి 32:11,12). సుదూర ప్రాంతాలకు వెళ్ళి పిల్లలకు, ఆహారం తెస్తుంది. ముక్కలు చేసి పెడుతుంది. పిల్లలకు శ్రద్ధగా, ప్రేమగా తిని పిస్తుంది. పక్షిరాజు సహజంగా రెండు గుడ్లు పెడుతుంది. రెండు పిల్లలే సహజం. అరుదుగా ఒక్కి మరి అరుదుగా మూడు పిల్లలు చేస్తుంది. మూడు పిల్లలకు మించి పుట్టవు గుడ్లు పొదిగాక తల్లి పక్షి తండ్రి పక్షి పిల్లల్ని ఎంతో శ్రద్ధగా చూసుకుాంయి. ఒకి కాపలా ఉంటే మరొక్కి ఆహారం కోసం వెలుతుంది. చిన్న పిల్లలు ఎదిగే కొద్ది తర్ఫీదు (ట్రైనింగ్‌) యిస్తుంది. గూడును రేపుతుంది. గూడుకదిపేటప్పుడు కుదుపునిస్తుంది. పునాదులు, కదులుతాయి. నెమ్మదిగా పునాదులు కూలడం ప్రారంభిస్తాయి. పిల్లలకు ఎగరమని చెబుతుంది. తల్లి పక్షి గూడు రేపుతున్నప్పడు కుదుపులకు, పునాదులు కదలుతున్నప్పుడు పిల్ల పకక్షులు తల్లిని తిట్టుకుాంయి. గుండె చెదిరిపోయినంతగా ఆందోళన పడతాయి. అమ్మకు ఏమయింది. మైండ్‌ పోయిందా? బ్లాక్‌ అయిందా? ఏమిీ ఇలా చేస్తుంది అనుకుాంయి. వాికి అంత తొందరగా అర్థంకాదు. పిల్లలు గూడులో నుండి బయటపడి ఎగురుతూ ఎగురుతూ క్రిందకు పడిపోబోతున్నప్పుడు, రివ్వున కిందికి దిగి తన రెక్కలు చాపి వాిని పట్టుకొని తన రెక్కల మీద మోస్తుందట, నేర్చుకోవాలని తల్లి తపన. మనం పక్షిరాజు పిల్లలంగా, దేవుడు పక్షిరాజుగా, పోల్చుకోవాలి. మన పరిస్థితులన్ని బాగున్నపుడు సమస్యలొచ్చినపుడు మనం పక్షి పిల్లలుగా ఆలోచిస్తాం. దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడేమోనని భయపడిన సందర్భాలు ఉండవచ్చు. ప్రభువైన దేవుడు ఇశ్రాయేలీయుల గూర్చి యిలా అన్నాడు. ఐగుప్తులోను, అరణ్యములోను, మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతిలోను, మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని' (ద్వితి 1:31). ఇందులో దేవుని శ్రద్ధ కనిపిస్తుంది. ప్రభువు మనల్ని కనిప్టిె చూస్తుాండు. గనుక మన చుట్టూ ఉన్న ప్రమాదాలకు వెరవనక్కర లేదు పరిస్థితులు, ప్రభావాలు మనకళ్లకు ఎలాకన్పించినప్పికి, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడుకాదు' (అపో 17:27). మనల్ని ఆయన వదిలేశాడని మనం భావిస్తున్న తరుణంలో సైతం ఇదే సత్యం మనకు అర్థం కావాలి. నీ భవిష్యత్తును గూర్చిన కలవరం కలుగుతున్నప్పుడు నీ పరలోకపు తండ్రి నీ కలవరాన్ని ఆయన ఎరిగియున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో (మత్తయి 6:32).
6. పక్షిరాజు నూతన బలం :
'యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్ముసిల్లక నడిచిపోవుదురు' (యెషయా 40:31) అవి మేఘముకంటే ఎత్తుగా ఎగురుతాయి. ఈ పక్షి రాజు 70 సం||లు జీవిస్తుంది. అయితే ఈ పక్షిరాజుకు 40 సం||లు వచ్చిన తరువాత పరిస్థితి గడ్డుగా (కష్టంగా) తయారువుతుంది.1. దాని ముక్కు దానివైపు వంగి వుంటుంది. అనగా తన చాతివైపుకు వంగి వుంటుంది.2. దాని రెక్కలు బలహీనంగా బరువుగా ఉంాయి. దాని ఈకలు వత్తుగావుాంయి.3. దాని కాళ్ళగోళ్ళు కూడా ముడతలు పడిన చర్మంతో ఉంాయి. పటుత్వం కోల్పాతాయి.ఆలాిం పరిస్థితుల్లో అది అలాగే ఉంటే కొన్ని రోజులకు చనిపోతుంది. అలాచనిపోకుండా ఉండడానికి అది ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది.1. ఒక కొండ శిఖరాన్ని చేరుకుంటుంది.2. తన ముక్కును కొండకు వేసి కొట్టుకొని తనవైపు తిరిగి ఉన్న ముక్కును సాపుగా, తిన్నగా చేసుకుంటుంది.3. తరువాత తన శరీరం మీద ఉన్న ఈకలన్నింని పీకివేస్తుంది.4. తన గోళ్ళమీద చర్మాన్ని సహితం లాగేస్తుంది. మాంసపుముద్దలా తయారవుతుంది.ఈ రీతిగా తాను కోల్పాయిన ఈకల్ని, బలాన్ని పొందుకోడానికి ఆ కొండ శిఖరంపైనే 5నెలలు నివాసం చేస్తుంది. అనగా 150 రోజులు ఆ కొండపైన నివాసం చేసిన తరువాత దానికి నూతన బలం వస్తుంది. నేి విశ్వాసులకు ఏమి ప్రయాసపడకుండానే నూతన బలం వచ్చేయాలి. శ్రమలు లేకపోవడమే జీవితంలో ఆనందం అని శ్రమించవద్దు. అసాధ్యమైన వాిని అంగీకరించడం. ఖచ్చితంగా చేయాల్సిన దానిని చేయడం ద్వారా మనకు నూతన బలాన్నిస్తుంది. ఎవరైనా సరే క్రీస్తులో నూతన బలాన్ని పొందాలంటే యిదే రహస్యం పాత జ్ఞాపకాలు, ప్రాచీన స్వభావం పోవాలి. అప్పుడు 'పక్షిరాజు యౌవనము వలె నీ యౌవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచును' (కీర్తన 103:5). పక్షిరాజు 5 నెలలు వేచి ఉండడం ద్వారా నూతన బలం పొందుకుాంది. అలా 70 సం||లు ఆరోగ్యంగా జీవిస్తుంది. కాలేబు తన 85 సం||ల వయస్సులో 45 సం||ల క్రితం జరిగిన సంభవాన్ని గుర్తుచేస్తున్నాడు. మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో నేివరకు నా కంత బలము. యుద్ధము చేయుటకు గాని, వచ్చుచు పోవుచునుండుటకు నాకెప్పి యట్లు బలమున్నది' (యెహోషువ 14:11) అని సాక్ష్యమిచ్చాడు. కారణం కాలేబు ప్రభుని నిండు మనస్సుతో ప్రేమించాడు. 'ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె ఉందురు (న్యాయధి 5:13). ఉదయించే సూర్యుని ఎవరు ఆపగలరు? యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును' (కీర్తన 29:11). ఇది మామూలుగా కలిగే బలం కాదు. దేవుని యందలి భయభక్తులు ద్వారా కలిగే నూతన బలము. ప్రతిరోజు దైవసన్నిధిలో కూర్చుండే అభ్యాసముంటే మన బలము నూతన పరచబడి యౌవనస్థులవలె ఉంాము.
7. పక్షిరాజు మరణం :
పక్షిరాజు ఎప్పుడు చనిపోతుందో దానికి తెలుసు, ఇతర పకక్షులకు తెలీదు. ఒక్క పక్షిరాజుకు మాత్రమే తెలుసు. దేవుడు ఆలాిం జ్ఞానాన్ని అంతర్‌ దృష్టిని యిచ్చాడు. అది దూరప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఒక బండమీద నిలిచి సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యుని వైపే తీక్షణంగా చూస్తుంది. అలా చూచి చూచి, చూస్తూనే చనిపోతుంది. ఎంతసేపైనా సరే చనిపోయే వరకు చూస్తునే ఉంటుంది. మనం అరనిమిషం కూడా సూర్యుని వైపు చూడలేం. ఇందులోని శ్రేష్ఠమైన పాఠం ఏమంటే విశ్వాసి నీతి సూర్యుని వైపే చూడాలి (మలాకీ 4:2). నీతి సూర్యునివైపు శుభప్రధమైన నిరీక్షణ కలిగి ఎదురుచూడాలి. పక్షిరాజు మరణ సందేశం విశ్వాసుల్ని సవాలు చేస్తుంది.ప్రపంచంలోని అన్ని మరణాలు, అందరి మరణాలు చారిత్రాత్మకమైనవి కావు. సవాలుకరమైన సందేశాలు కాదు. చారిత్రాత్మకమైన మరణాలు చరిత్రలో సగర్వంగా నిలిచిపోతాయి. అటువింవారిలో రాకుమారుడు అలెగ్జాండర్‌ ఒకడు పరాజయం ఎరుగని చక్రవర్తి 32వ ఏట అనారోగ్యంతో మరణించాడు. కానీ ఆయన విజయాలకన్నా ఆయన మరణ సందేశమే ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. ఏమి సందేశం? ఆరోజు ముఖ్య అధికారులను సమీపానికి పిలుపించుకున్నాడు అలెగ్జాండర్‌. తాను చనిపోయాక చేయవలసిన మూడు పనులు ఆదేశించాడు.1. నేను మరణించాక నా వైద్యులే నా శవపిేకను మోసుకెళ్ళాలి.2. దారిపొడుగునా నా నిర్జీవకాయంపై, బంగారు, వెండి, ఆభరణాలు విలువైన వజ్రాలు చల్లుకుంటూ ముందుకుసాగాలి. అవి నా ధనాగారంలోని సంపద మాత్రమే అయి ఉండాలి.3. నా రెండు చేతులు పైకి కన్పించేలా నన్ను సమాధి చేయాలి అన్నాడు.ఈ మూడు ఆదేశాల వెనుక మూడు జీవిత సత్యాలున్నాయి. ఆ సత్యాలవెనుక జీవిత పరమార్థం ఉంది.
1. ఎంత పెద్ద వైద్యుడైనా మన ప్రాణాలు కాపాడలేడని మొది పరమార్థం.
2. కొల్లగ్టొినది (సంపాధించినది) కడవరకు రాదని రెండవ ఆదేశంలోని పరమార్థం.
3. విశ్వ విజేత అయినా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేదేమీ ఉండదని చెప్పడం మూడో ఆదేశంలోని జీవిత సత్యం.మృత్యువు అలెగ్జాండర్‌ని వరించిందో, అలెగ్జాండర్‌ మృత్యువుని వరించాడో చెప్పడం కష్టడం. వెళుతూ వెళుతూ ఆయనిచ్చిన సందేశం మాత్రం, మనిషి తన లోలోపల అణచివేసిన సంస్కారాలను త్టి లేపిన వైనం అది గొప్పది. దీనికంటే శ్రేష్టమైన సందేశం. పక్షిరాజు మరణం. భౌతిక విషయాల ప్రాముఖ్యత గురించి కాదు. ఆత్మ సంబంధంగా ఒక ఉన్నత లక్ష్యంతో జీవితాన్ని పణంగా ప్టోలి. ఆత్మతోను, జ్ఞానముతోను, విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను, కృపతోను, బలముతోను, నిండుకొనిన స్తెఫను మరణసందర్భంలో అతని ముఖం పరలోకం వైపు తేరిచూస్తుంది. అతని కన్నులు ప్రభువువైపు (నీతి సూర్యుని) ఉన్నాయి. అతని పెదవులు ప్రభువుతో మ్లాడుతున్నాయి. అతని మోకాళ్ళు వంగి ఉన్నాయి. ప్రభువా ఈ పాపం వారి మీద మోపకుము అంటున్నాడు. ఈ దృశ్యాన్ని పురస్కరించుకొని ఒక్కడు మారితేచాలు అనేది మాత్రమే. ఒక్కడే మారాడు. ఎవరు? పౌలు అతడు మారిపోయాడు. చాలా మందిని మార్చాడు. 'యూరఫ్‌' ఖండం అంతా సువార్త ప్రకించబడింది. హల్లెలూయ.
 - డా||ఎమ్‌.సి.న్యూటన్‌ బాబు

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి.
-మత్తయి 6:33

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech