Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

సేవ ఎవరు చేయగలరు?సేవ ఎలా చేయాలి?
01 August 2015

సేవ ఎవరు చేయగలరు?సేవ ఎలా చేయాలి?

యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు ఎక్కువగా సేవకొరకైన వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు మనం గమనిస్తాం. ఈ అధ్యాయంలో గమనిస్తే మొదట తన సహోదరుల నుండి వ్యతిరేకత ఎదురైనది (7:3). పరిచర్యకు సొంత ఇంిలో ఉండేవారే ప్రభువుకు వ్యతిరేకంగా ఉండినారు. వారు ప్రభువును చూచి నీవు నిజంగా సూచక క్రియలు చేస్తూ ఉంటే ఇక్కడ కాదు చేయవలసినది, అక్కడకు వెళ్లి చేయి. అప్పుడు నీ శిష్యులు నిన్ను చూసి నమ్ముతారు అని చెప్పినారు. ప్రభువు సూచక క్రియలు చేస్తూ ఉండగా, ఇంకా చేయమని తన ఇంిలోని వారు అడగలేదు కానీ, ఇక్కడ నుండి వెళ్లిపొమ్మని తన సొంత అన్నలు యేసుప్రభువుతో అన్నారు. అంతపెద్ద పరిచర్యకు తన సొంత గృహములో ప్రభువుకు ప్రోత్సాహం లేదు.

యేసుప్రభువు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉంటే వారు, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎా్ల వచ్చెను? అని అన్నారు. ఆ మాట అనుకుంటేనే మనకు సంతోషం కలుగును. ఎందుకనగా చదువు ఏ మాత్రం రాని యేసుప్రభువు సేవకుల మధ్య కూర్చున్నట్లుగా మనం గమనించగలం.చదువుకొనని యేసుక్రీస్తు దేవాలయంలో నిలబడి అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు. ఆ దేవాలయం సొలొమోను దేవాలయం. ప్రపంచంలో అదే పేరుగాంచిన దేవాలయం. అలాిం దేవాలయంలో నిలబడి వాక్యపరిచర్య చేయాలనగా ఎంతగా సిద్ధపడాలి? మనమైతే ఏదైనా పల్లెలో వాక్యం చెప్పాలనగా ఏదో నాలుగు మాటలు చెప్పేసి వస్తాము. లేదా, ఏదైనా మీింగ్‌లో మ్లాడాలనగా కొద్దిగా సిద్ధపడిపోతాము. ఒకవేళ దైవసేవకులు ఉండే మీింగులో మ్లాడాలనగా ఎక్కువగా సిద్ధపడిపోతాము. ఒక్కో స్థలాన్ని బ్టి ఒక్కో వ్యక్తి సిద్ధపడును. మరి ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయంలో యేసుప్రభువు బోధిస్తున్నాడు. అది కూడా పండుగ సమయం. అనగా ఆ సమయంలో శాస్త్రులు, ప్రధానయాజకులు, సద్దూకయ్యులు అందరూ ఉన్నారు. యేసుప్రభువు చదువుకోలేదు కానీ అతనికి పాండిత్యం వచ్చినది. ఆ వాక్యపరిచర్యకు వారు ప్టిెన పేరు పాండిత్యమని. అనగా గ్రంథములోని మాటలను, అందులోని మర్మములను ప్రభువు అద్భుతంగా బోధించడం ప్రారంభించాడు.ఒక వ్యక్తి దేవుని సేవ చేయాలనగా ఏమి చేయాలి? చాలా సార్లు మనం బైబిలు నాకు సరిగా తెలియదండి, దేని తరువాత ఏది చెప్పాలో తెలియదు కాబ్టి నేను వాక్యం చెప్పను. నాకు వాక్యం చెప్పాలని చాలా ఇష్టం, కానీ చెప్పాలనగా ధైర్యం లేదు.
వాక్యం ప్రకించుటకు కావల్సిన అర్హతలేమి?
ఒక వ్యక్తి దైవసేవకునిగా ఉండాలనగా ఆ వ్యక్తికి ఉండాల్సిన అర్హత లేమి? అతను ఏమేమి చదువుకుని ఉండాలి? అతను ఏవైనా పుస్తకాలు చదువుకుని ఉండాలా? ఏదైనా విద్యను అభ్యసించి ఉండాలా? ఏమి చదివితే అతను వాక్యం చెప్పగలడు. కానీ బైబిల్లో యేసుప్రభువు చదువుకోలేదనే మాట వ్రాయబడినది. యేసుప్రభువు చదువుకొనకపోయినా ఆయన దేవుని కుమారుడు కాబ్టి ఆయనకు చదువెందుకని మనం అనుకోవచ్చు. ఆయనకు బోధించగలిగినవారు ఎవరూ లేరుకదా? అని అనుకోవచ్చు. అర్హత లేకుండా ఉండటమే అర్హత. అంతేకాదు యేసుప్రభువు తన శిష్యులుగా ఎవరిని నియమించుకున్నాడనగా, ఏమీ చేతకాని వారిని నియమించుకున్నాడు. అందులో కూడా పేతురు అనే విద్యలేని పామరున్ని పిలుచుకున్నాడు. అ.కా.4 వ అధ్యాయము ప్రారంభములో పేతురు, యోహాను ప్రధాన యాజకులను చూచి వాక్యం చెప్పినారు.
ఒకవ్యక్తి ఎలా దేవుని సేవ చేయగలడు?
పేతురు విద్యలేని వ్యక్తి, ఎలా దేవుని సేవ చేయగలడు? చాలా సందర్భాల్లో మనం వాక్యం చెప్పాలనగా నాకు రాదే అని ఆలోచిస్తాం. నేను ప్రకిస్తే ప్రజలు ఏమనుకుాంరో నేను సరిగా చెప్తానో లేదో? అంటూ రకరకాల ఆలోచనల మధ్య మనం సతమతమవుతూ ఉంాం. అయితే పేతురు విద్యలేనివాడు. కాని అతనికి ఉన్న ఒకే ఒక అర్హత ఏమిటనగా, యేసుతో కూడా అతను ఉన్నాడు.ప్రియమైనవారలారా, మీ జీవితంలో దేవునిచే బలమైన వ్యక్తిగా వాడబడాలనగా ఏమి చేయాలి? ప్రభువుతో ఉంటే చాలు. బైబిల్లో గమనిస్తే పేతురు, యోహానులు యేసుతో కూడా ఉండినవారు (అపొ.కా.4:13). యేసుతో ఒక వ్యక్తి ఉంటే యేసులాిం ఒక బోధకునిగా తయారైపోతారు. దేవుని యొక్క వాక్యపరిచర్య అనగానే మనము ఎంతోమంది విద్యావంతులు వస్తారు ఎలా బోధించాలని భయపడతాము. కానీ వారి విద్యతో, వారి యోగ్యతతో వారికున్న తలాంతులతో, వారి వాక్య పరిచర్య జ్ఞానముతో మనకు పని లేదు. దేవుడు మన తలంపులలో ఏ మాటలు ఉంచునో అవే మనం చెప్పాలి. ఒక వ్యక్తి దేవుని సేవ చేయాలనగా జ్ఞానం, చదువు అవసరం లేదు.

ఆమోసు అనే ప్రవక్త పాతనిబంధనలో కనిపించే ప్రవక్తలలో ఒకడు. ఆమోసు 4:14లో అతను నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యున్ని కాదు. కేవలం పశువుల కాపరిని అన్నాడు. నేను మందను కాచుకుంటూ, మేడిపండ్లు ఏరుకొనే వాడిని. అలాిం నన్ను దేవుడు సేవకు పిలిచాడు. పశువులు కాచుకునే వారికి వెర్రి ఉండును. అలాిం  ఒక వ్యక్తిని దేవుడు సేవకు పిలిచినాడు.

పౌలు తనను గూర్చి తెలియజేస్తూ మాటలయందు నేర్పరితనం లేదు, కానీ జ్ఞానమున్నది. ఒకడు పౌలు ప్రసంగమును కొరగానిదనును. అనగా ప్రసంగించడం రానేరాదు అని అన్నాడు. పౌలు చాలా విద్యావంతుడు. ఆ రోజుల్లో చదువుకున్న వారిలో పౌలు చెప్పుకోదగిన వ్యక్తి. అయితే పౌలు, ఫిలిప్పీ 3:8-9లో నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకొనునట్లుగా సమస్తమును నేను నష్టముగాను, పెంటగాను ఎంచుకొింని అని తన సాక్ష్యమును చెప్పాడు. క్రీస్తును సంపాదించుకుని అనేమాట గమనించగలము.

పౌలు, క్రీస్తును సంపాదించుకోవాలనగా ఏదో కొన్ని పోగొట్టుకున్నాడు. పౌలు తండ్రి తన డిగ్రీలను చెప్పడం ప్రారంభించినాడు. అతడు హెబ్రీయుడు. అతడు పరిసయ్యుడు. సంఘము విషయంలో, పరిచర్యలో ఆసక్తి కలిగినవాడు. అతనికి ఎన్నో ఉన్నాయి. అయితే నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. తన అర్హతలన్ని పోగొట్టుకున్నాను అన్నాడు. అవి పోగొట్టుకున్న తరువాతే అతడు దేవుని సేవకు అర్హుడై ఉన్నాడు. అతనికున్న డిగ్రీలు, విద్యవల్ల అతను దేవుని సేవ చేయలేకపోయాడు.
వాక్య పరిచర్యకు ఎలా సిద్ధపడాలి?
ఇది తెలియక అనేకమంది యాతన పడటం ప్రారంభిస్తారు. వాక్యమ్లెా చెప్పాలి, ఎా్ల సిద్ధపడాలి? అని ఆందోళన పడుచుాంరు. ప్రియమైన వారలారా! ఒక వ్యక్తి దేవుని చేత వాడబడాలనగా ఆ వ్యక్తి యొక్క సేవలో, మాటల్లో ప్రజ్ఞ, పాండిత్యం విం మాటలు మనము ఉండాలి అని అనుకుాంము. కానీ అర్హత ఏమిటనగా యేసుప్రభువు మనతో ఉంటేచాలు, నీవు చేసే సేవలో గొప్ప ఉజ్జీవము, ప్రజ్ఞ అనేవి తప్పకుండా కనబడును కాబ్టి మనము సేవనగా భయపడాల్సిన పని లేదు. విద్యావంతులైన వారు ప్రేక్షకుల్లో కూర్చున్నారనగా భయపడాల్సింది లేదు. మనతో క్రీస్తు ఉన్నాడని ఎప్పుడైతే మనము అనుకుాంమో అపుడు మనకు భయము ఉండదు.

యోహాను 7:16లో యేసు, నేను చేయు బోధ నాది కాదు అన్నాడు. రహస్యమంతా అక్కడే ఉంది. ప్రభువు యొక్క వాక్య పరిచర్యలో ఉండే చాతుర్యం, పాండిత్యం, జీవం, ఆకట్టుకొనే ప్రభావం తన యొక్క రహస్యాలన్ని చెప్తున్నాడు. నేను చేయు బోధ నాది కాదు. నేను సిద్ధపడితే తప్పిపోతాను. నా తలంపులతో, నా జ్ఞానముతో మ్లాడితే నేను ఫెయిల్‌ అవుతాను. హిబ్రూ భాషలో, గ్రీకు భాషలో, అరబిక్‌ భాషలో నాకు ఎంత జ్ఞానముందో ఆ విధంగా నేను ప్రదర్శన ఇవ్వాలని కోరితే నేను ఓడిపోతాను. అయితే ప్రభువు అన్నాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.

యేసు ప్రభువు తన వాక్య పరిచర్య యొక్క రహస్యాన్ని చెపుతు నేను తండ్రి నుండి వాక్యాన్ని పొందుచున్నాను. ఏ విధంగా పొందుచున్నాడనగా తండ్రి దగ్గర మోకరించి ప్రార్థించడమే. ప్రభువా ఈ రాత్రికి అవసరమైన సందేశమును నాకు ఇవ్వు. ప్రభువా నాకు సహాయం చేయి. ఎంతగా నీవు ప్రభువు సన్నిధిలో గడపడం ప్రారంభిస్తావో అంతగా నీవు పొందుతావు.

ఒక వ్యక్తి చేతిలో బైబిలు, పెన్ను పట్టుకుని సిద్ధపడి వాక్యం చెప్పేందుకు వెళ్ళాల్సిన పనిలేదు. యేసు అన్నాడు నేను చేయు బోధ నాది కాదు. అవును సహోదరుడా నీవు వాక్య పరిచర్య చేయడానికి వెళ్తున్నావనగా ముందుగా ప్రార్ధించడం ప్రారంభించు. వచ్చేవారానికి ఈ వారం నుండే ప్రార్ధన మొదలుపెట్టు. ఆ సమయానికి నా మాటలు తొలగించి నీ మాటలు నాకు దయచేయి ప్రభువా, నీ తలంపులు నాకు కలిగించు ప్రభువా అని ప్రార్ధన చేయాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రార్ధిస్తామో మనకు తెలియని రహస్యాలు మనం మ్లాడటం ప్రారంభిస్తాము. అందుకే ప్రభువు అన్నాడు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అని.

యోహాను 7:17లో ఆ బోధ దేవుని వలన కలిగినదా? లేక నా సొంత తలంపుల వలన కలిగినదా? రెండు సంగతులు చెప్తున్నాడు. ఇక్కడ 'నేను' అనే సమయానికి యేసు ప్రభువు తనను మనుష్య కుమారునిగా చెప్పుకున్నాడు. కాబ్టి నా బోధ, దేవుని బోధ అంటూ 2 బోధల గురించి మ్లాడుచున్నాడు. మనుష్యుల బోధ వ్యర్ధం. మనుష్యుల బోధలో జీవముండదు. కొన్నిసార్లు మనుష్యుల బోధ బాగుంటుంది. నవ్విస్తారు. చాలా ఆసక్తికరంగా, భావయుక్తంగా ఉంటుంది. కానీ అందులో జీవముండదు. నా ఉద్దేశంలో జీవమంటే ఒక వ్యక్తిని మార్చడం. ఒక వ్యక్తిని వెలిగించడం, ఇలాింవి ఉండవు. ఎప్పుడైతే వ్యక్తి బోధ దేవుని బోధ అవుతుందో అపుడు ఆ వాక్యం అందరినీ తగలడం ప్రారంభిస్తుంది. ప్రతి జీవితాన్ని అది సంధిస్తుంది. ఏ జీవితాన్ని కూడా అది వదలదు. ఎందుకనగా దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వింది

రెండు రకములైన బోధకులు
యోహాను 7:18లో తనంతట తాను బోధించేవారు ఒకరకం. వీరు స్వకీయ మహిమను వెలిగించడం ప్రారంభిస్తారు. తనను అందరూ మెచ్చుకోవాలి. తన యొక్క మాటలు, చెప్పేతీరు, తన వాగ్ధాిని వింవి అందరూ మెచ్చుకోవాలని ఆశపడతారు. వీరంతా తమంత తాము బోధించేవారు. తరువాతి భాగంలో మనం గమనిస్తే తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు.ఎప్పుడూ ప్రభువును వెదికేవారు రెండవ రకం బోధించేవారు. వారి యొక్క లక్షణము ఏదనగా దేవా; నాకు కాదు ప్రభువా ఘనత నీకు. ప్రభువా నేను కాదు హెచ్చించబడవలసినది మీరు. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును. తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అన్న రీతిలో వారి యొక్క వాస్తవ స్థితి ఉండును. కాబ్టి మన జీవితములో ముందుగా ప్రభువును మనం వెదకాలి. నా మహిమ కాదు, నా ఘనత కాదు కాని ప్రభువా! నీకే మొది స్థానము అని ప్రార్ధించాలి. ప్రభువా నిన్ను ఘనపరచడం నాకు నేర్పించు అని ప్రార్ధించాలి.

నీకున్న బలహీనతల వైపు, అడ్డంకుల వైపు మరియు కొరతల వైపు చూడక నిన్ను సేవకు పిలిచిన వాడు నమ్మదగినవాడని ఎరిగి ఆ ఉన్నత పిలుపుకు లోబడి ఆయన సాధనముగా నీవు ఉండాలి. వెనుక వున్నవి మరచి ముందున్న వాి కొరకు వేగిర పడుము. దేవుని యొక్క పొలములో పనిచేయుట కొరకు ఈ సందేశము చదువుచున్న నీవు ఎంతో దేవునికి అవసరమై ఉన్నావు. దేవుడు నీతో మ్లాడుచుండగా ఆలస్యము చేయక ఆయన సేవ నమ్మకముగా, యధార్ధముగా జరిగించు. దేవుడు నిన్ను సేవలో వాడుకొనును గాక! -రెవ​.డి.ప్రసన్నకుమార్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ధైర్యముగా ఉండుడి; నేను లోకమును జయించితిని.
-యోహాను 16:33

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech